138వ మే డే ను జపం చేయండి: ఏ ఐ టి యు సి రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్
![]()
ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డే ను యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించి ఎర్ర జెండాలు ఎగురవేసి కార్మికుల ఐక్యతను చాటాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు పిలుపునిచ్చారు.
ఆదివారం రోజున సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం గోరేటి రాములు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపేడుతున్నదని ఆరోపించారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయిందని ఈ10 సంవత్సరాల కాలంలో కార్మికులకు కర్షకులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం హామీని అమలు చేయలేదని అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా నెలకు పదివేల రూపాయల పెన్షన్ అందించాలని, గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని 2021లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 5 కనీస వేతనాల జీవోలకు గెజిట్ ఇచ్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ పట్టణాలకు విస్తరించాలని, కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ మరియు స్కీం వర్కర్లను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో, హమాలీ కార్మికుల కోసం సమగ్ర సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, అసంఘటిత కార్మిక వర్గానికి సామాజిక భద్రత చట్టాన్ని తీసుకురావాలని, ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేటీకరణ వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు.
*ఈ కారిక్రమం లో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, నాయకులు గనబోయిన వెంకటేష్, గోపగాని రాజు, సోమన సబిత, సామల శోభన్ బాబు, దాసరి లక్ష్మయ్య, పుట్ట రమేష్, పల్లె శ్రీనివాస్ ముదిగొండ బసవయ్య, పాపగల్ల శంకరయ్య, చింతల మల్లేష్, నర్సింహా, రాజు తదితరులు పాల్గొన్నారు.
![]()









ప్రశ్నించే వారు లేకుంటే సమాజం అధోగతి పాలవుతుంది తప్పుడు ఆలోచన లే రాజ్యమేలు తాయి సిపిఎం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నీకి సిపిఎం అభ్యర్థిగా ప్రజా ఉద్యమనాయకుడైన ఎండి జాంగిర్ గారు పోటీ చేస్తున్నారు గెలిపించాలని ప్రజలని కోరారు ఈరోజు శనివారం రోజున భువనగిరి మండలం చీమల కొండూరు లో సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నరసింహ పాల్గొని మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా కమ్యూనిస్టు రాజకీయాల్లో జీవితంలో అనేక సవాలను ఎదుర్కొని నిజాయితీగా ప్రజా సమస్యలపై పోరాటమే దినచర్య కొనసాగుతున్న ఎండి జాంగిర్ గాని వర్గాల ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్ట తో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ము కావున ప్రజలందరూ అన్ని రకాల వర్గాలు సిపిఎం పార్టీని ఆదరించి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకై మీ ఓటు వేసి గెలిపించాలని నరసింహ అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య సిపిఎం శాఖ కార్యదర్శి బోడ ఆంజనేయులు గ్రామ నాయకులు రావుల పోశయ్య జయమ్మ గ్రామ ప్రజలు జయమ్మ మల్లయ్య శ్రీశైలం బిక్షపతి పద్మ ఎల్లమ్మ కాశమ్మ లక్ష్మి రజిని మల్లమ్మ రేణుక లలిత తదితరులు పాల్గొన్నారు.

యోగ మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని వెంకిర్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్ లో ఉచిత యోగ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించడం జరిగినది . ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు యోగ మాస్టర్ సుధాకర్ మాట్లాడుతూ ఈ యోగా శిబిరం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందని, యోగా శిక్షణలో పాల్గొనడం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. తమ సంస్థ గత ఆరు సంవత్సరాలుగా గ్రామంలో నిస్వార్ధంగా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు . ఈ శిబిరం వేసవి సెలవులలో పూర్తిగా కొనసాగుతుందని ,విద్యార్థులు ఎవరైనా పాల్గొనవచ్చు అని తెలిపారు ,ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హెడ్మాస్టర్ చంద్ర రెడ్డి, మహర్షి మోడల్ హై స్కూల్ కరస్పాండెంట్ పి మల్లేష్ గౌడ్, వెంకిర్యాల వాస్తవ్యులు పోచారం మున్సిపల్ కార్పొరేటర్ చింతల రాజశేఖర్, సభ్యులు జిలుకపల్లి లక్ష్మీనారాయణ ,ముడుపు రాకేష్ ,కొండ శ్రీనాథ్ రెడ్డి, చిలుకూరు జంగయ్య మిత్రబృందం, విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.


Apr 28 2024, 16:59
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.4k