/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz 138వ మే డే ను జపం చేయండి: ఏ ఐ టి యు సి రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్ Vijay.S
138వ మే డే ను జపం చేయండి: ఏ ఐ టి యు సి రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్


 ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డే ను యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించి ఎర్ర జెండాలు ఎగురవేసి కార్మికుల ఐక్యతను చాటాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు పిలుపునిచ్చారు.

      ఆదివారం రోజున సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం గోరేటి రాములు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపేడుతున్నదని ఆరోపించారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయిందని ఈ10 సంవత్సరాల కాలంలో కార్మికులకు కర్షకులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం హామీని అమలు చేయలేదని అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

  భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా నెలకు పదివేల రూపాయల పెన్షన్ అందించాలని, గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని 2021లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 5 కనీస వేతనాల జీవోలకు గెజిట్ ఇచ్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ పట్టణాలకు విస్తరించాలని, కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ మరియు స్కీం వర్కర్లను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో, హమాలీ కార్మికుల కోసం సమగ్ర సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, అసంఘటిత కార్మిక వర్గానికి సామాజిక భద్రత చట్టాన్ని తీసుకురావాలని, ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేటీకరణ వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు.

   *ఈ కారిక్రమం లో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, నాయకులు గనబోయిన వెంకటేష్, గోపగాని రాజు, సోమన సబిత, సామల శోభన్ బాబు, దాసరి లక్ష్మయ్య, పుట్ట రమేష్, పల్లె శ్రీనివాస్ ముదిగొండ బసవయ్య, పాపగల్ల శంకరయ్య, చింతల మల్లేష్, నర్సింహా, రాజు తదితరులు పాల్గొన్నారు.

మహిళా శక్తి చైతన్యమే సమసమాజ నిర్మాణం :సునీత రామ్మోహన్ రెడ్డి విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు


భువనగిరి:విశ్వహిందూ పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా మాతృశక్తి దుర్గావాహిని ఒకరోజు అభ్యాస వర్గ స్థానిక వైయస్సార్ గార్డెన్లో శ్రీమతి బొక్క అరుణ్ జ్యోతి గారి అధ్యక్షతన నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య వక్త విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సమాజంలో సగభాగంగా ఉన్న మాతృశక్తి దర్గా వాహిని పనిని కార్యకర్తలు ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకోవలసిన అవసరం ఉందని సమాజంలో అధిక సమస్యలకు పరిష్కారం చూపే సత్తా మహిళ శక్తికే ఉందని తెలిపారు విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత సనాతన ధర్మంలో నారీ శక్తికి ఎంతో ప్రాముఖ్యత ఉందని దానిని గుర్తించి తగువిధంగా ఉపయోగించుకుంటే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పాశ్చాత్య ధోరణుల ద్వారా వికృత చేష్టలతో నారీశక్తిని నిర్వీర్యం చేస్తున్నారు అట్టి శక్తులకు అవకాశం ఇవ్వకుండా నేటి యువతులు శక్తి ఆరాధన ద్వారా నారీశక్తిని గౌరవించుకునే విధంగా కార్యక్రమాలు రూపొందించుకోవాలి ప్రతి మహిళ యువతులు సత్సంగాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు నరసింహమూర్తి గారు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యున్నత శక్తి మహిళా శక్తి అని మహిళలు యువతులు శక్తి రూపం దాల్చి సనాతన ధర్మాన్ని ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాతృ శక్తి తెలంగాణ ప్రాంత సంయోజిక పద్మశ్రీ గారు మహిళలకు మార్గదర్శనం చేశారు ఈ కార్యక్రమంలో ప్రాంత సహ సంయోజిక శ్రీవాణి గారు నల్గొండ విభాగ్ సంయోజిక శ్రీమతి సత్యవతి భాగ్యలక్ష్మి విభాగ్ సoయోజిక జ్యోతి గారు సహ సంయోజిక అరుంధతి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్వి లావణ్య గారు దంత సుమిత్ర సత్యలక్ష్మి జిల్లా అధ్యక్షులు పొత్నక్ రాఘవేందర్ గారు విశ్వహిందూ పరిషత్ ప్రాంత సహ కార్యదర్శి తోట భాను ప్రసాద్ జిల్లా కార్యదర్శి సుక్కల శ్రీశైలం యాదవ్ చామ రవీందర్ పట్టణ కార్యదర్శి సాల్వేరు వేణు భింగి భరత్ బజరంగ్దళ్ పట్టణ కన్వీనర్ నమిలె నవీన్ శివ పూస శ్రీనివాస్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం


యాదాద్రి భువనగిరి జిల్లా : కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు అన్నారు.ఆదివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదాన్ పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు వర్కల శ్రీను, వర్కల మల్లేశం, నారపాక రాజు, నారపాక శ్రీను, వర్కల భరత్, భాశమల్ల క్రాంతి, వర్కల సంతోష్, నారపాక అజయ్, వర్కల వినేయ్, వర్కల గణేష్, వర్కల సురజ్, వర్కల గుణ, సల్ల ఉపేందర్, రాపోలు సుభాష్, బోడ్డు మచ్చగిరి, అకెనపల్లి ఉపేందర్, వర్కల ప్రవీణ్, వర్కల సురేశ్,భాశమల్ల ప్రవీణ్, సల్ల వెంకటేష్, నేడు గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ :-

రానున్న పార్లమెంటు ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకై అహర్నిశలు కృషి చేయాలని తెలిపారు..

కోమటిరెడ్డి బ్రదర్స్ ను విమర్శించే స్థాయి జగదీశ్ రెడ్డి కి లేదు: కాంగ్రెస్ జిల్లా నాయకులు కూనూరు సాయికుమార్ గౌడ్


తెలంగాణ రాష్ట్ర సాధనలో తన మంత్రి పదవిని సైతం వదులుకొని నిరాహార దీక్ష చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినీ విమర్శించే స్థాయి జగదీష్ రెడ్డికి లేవని కాంగ్రెస్ జిల్లా నాయకులు కునూరు సాయి కుమార్ గౌడ్ అన్నారు. పది సంవత్సరాలు మంత్రిగా ఉండి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలిపించుకోలేని అసమర్థ మంత్రి జగదీష్ రెడ్డి అని అన్నారు. కెసిఆర్ దగ్గర నీవు ఏమి చేసేవాడివో మీ సొంత పార్టీ వాళ్లే చెబుతున్నారు. 10, సంవత్సరాలు మంత్రిగా ఉండి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నీవల్ల ఒరిగిందేమీ లేదని నీవల్లనే చాలామంది ఓడిపోయామని మీ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే లంతా బాహాటంగానే విమర్శిస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతిపై అతి త్వరలో జైలుకు వెళ్ళబోవాల్సి వస్తుందని జగదీష్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ పై రాద్దాంతం చేస్తున్నారు. మానవత్వానికి మంచి పేరు అయినా మా కోమటిరెడ్డి బ్రదర్స్ పై మరోసారి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలమంతా నీకు సరైన బుద్ధి చెబుతామని ఇదే నీకు చివరి హెచ్చరిక అని అన్నారు.

అంగన్వాడి కేంద్రాలను ప్రక్షాళన చేయాలి: బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్

 యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను ప్రక్షాళన చేసి, విద్యార్థులకు, గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన ఆహారం అందించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో శనివారం గర్భిణీ కి అందించిన ఆహారంలో ఈగలు పడి చనిపోయి ఉండడం, అంగన్వాడీ కార్యకర్తల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో అనేకం జరుగుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గత నెలలో స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కేమెరాలు ఏర్పాటు చేయాలని, అంగన్వాడీ కార్యకర్తలకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని సూచించారని వెంకటేష్ గుర్తు చేశారు. అధికారులు వెంటనే ముఖ్యమంత్రి సూచనలు అమలు చేసి, పసి పిల్లలకు, తల్లులకు, గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

బొమ్మలరామారం మండల కేంద్రంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార ర్యాలీ


యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం గుడ్డిబావి చౌరస్తా వద్ద చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ ర్యాలీ,కార్నర్ మీటింగ్ నిర్వహించారు.

ఈ ర్యాలీ కి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు,భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి గారు,గిరిజన సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు.మహిళ సహకార అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బండ్రు శోభారాణి

తదితరులు పాల్గొన్నారు.

బొమ్మలరామారం మండల కేంద్రం నుండి గుడ్డి బావి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ ర్యాలీ భారీజన సంద్రోహం మధ్య కొనసాగింది.

ఈ ర్యాలీ లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు ప్రజలందరినీ కలుస్తూ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు.

భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థిగా ప్రజా ఉద్యమ నాయకుడు ఎండి జహంగీర్ ని గెలిపించండి: దయ్యాల నరసింహ సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి


ప్రశ్నించే వారు లేకుంటే సమాజం అధోగతి పాలవుతుంది తప్పుడు ఆలోచన లే రాజ్యమేలు తాయి సిపిఎం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నీకి సిపిఎం అభ్యర్థిగా ప్రజా ఉద్యమనాయకుడైన ఎండి జాంగిర్ గారు పోటీ చేస్తున్నారు గెలిపించాలని ప్రజలని కోరారు ఈరోజు శనివారం రోజున భువనగిరి మండలం చీమల కొండూరు లో సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నరసింహ పాల్గొని మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా కమ్యూనిస్టు రాజకీయాల్లో జీవితంలో అనేక సవాలను ఎదుర్కొని నిజాయితీగా ప్రజా సమస్యలపై పోరాటమే దినచర్య కొనసాగుతున్న ఎండి జాంగిర్ గాని వర్గాల ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్ట తో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ము కావున ప్రజలందరూ అన్ని రకాల వర్గాలు సిపిఎం పార్టీని ఆదరించి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకై మీ ఓటు వేసి గెలిపించాలని నరసింహ అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య సిపిఎం శాఖ కార్యదర్శి బోడ ఆంజనేయులు గ్రామ నాయకులు రావుల పోశయ్య జయమ్మ గ్రామ ప్రజలు జయమ్మ మల్లయ్య శ్రీశైలం బిక్షపతి పద్మ ఎల్లమ్మ కాశమ్మ లక్ష్మి రజిని మల్లమ్మ రేణుక లలిత తదితరులు పాల్గొన్నారు.

వెంకిర్యాల లో యోగ మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత యోగ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం


యోగ మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని వెంకిర్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్ లో ఉచిత యోగ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించడం జరిగినది . ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు యోగ మాస్టర్ సుధాకర్ మాట్లాడుతూ ఈ యోగా శిబిరం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందని, యోగా శిక్షణలో పాల్గొనడం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. తమ సంస్థ గత ఆరు సంవత్సరాలుగా గ్రామంలో నిస్వార్ధంగా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు . ఈ శిబిరం వేసవి సెలవులలో పూర్తిగా కొనసాగుతుందని ,విద్యార్థులు ఎవరైనా పాల్గొనవచ్చు అని తెలిపారు ,ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హెడ్మాస్టర్ చంద్ర రెడ్డి, మహర్షి మోడల్ హై స్కూల్ కరస్పాండెంట్ పి మల్లేష్ గౌడ్, వెంకిర్యాల వాస్తవ్యులు పోచారం మున్సిపల్ కార్పొరేటర్ చింతల రాజశేఖర్, సభ్యులు జిలుకపల్లి లక్ష్మీనారాయణ ,ముడుపు రాకేష్ ,కొండ శ్రీనాథ్ రెడ్డి, చిలుకూరు జంగయ్య మిత్రబృందం, విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేసిన దాసిరెడ్డిగూడెం మాజీ సర్పంచ్ కొమిరెల్లి సరిత - సంజీవరెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పత్తేపు లలిత అనారోగ్య కారణంగా మృతి చెందడం జరిగింది. వారి కుటుంబానికి దాసిరెడ్డిగూడెం తాజా మాజీ సర్పంచ్ కొమిరెల్లి సరిత సంజీవరెడ్డి వారి కుటుంబానికి 100 కేజీల బియ్యం 5000/- రూపాయలు బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో దాసిరెడ్డి గూడెం బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దంతూరి నరేష్ కుమార్, కార్యదర్శి గోధుమగడ్డ మల్లారెడ్డి, అప్పిడి వెంకటరెడ్డి, బాలగోని సత్తయ్య, బాలయ్య కుటుంబ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

గుడి మల్కాపురం గ్రామ శివారులో చెట్టును ఢీకొట్టిన కారు డ్రైవర్ మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గుడిమల్కాపురం గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది .ఈ ప్రమాదంలో డ్రైవర్ వృత్తి చెందాడు. మృతుడు బోయపల్లి రాము గా గుర్తించారు .ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం .ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.