NLG: మర్రిగూడ మండలంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సిపిఎం నాయకులు.
పార్లమెంటు ఎన్నికల్లో భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించి , నిర్వీర్యం చేసే పార్టీలను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుపాలడుగు నాగార్జున అన్నారు. మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి గ్రామంలో సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలలో జీఎస్టీ పేర ప్రజలపై అధిక పన్నులు మోపిందని ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచిందని పెట్టుబడిదారులకు దేశ సంపదను దోచి పెట్టిందని, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్నారు. దేశంలో సమతుల్యత లేని అభివృద్ధిని మోడీ చేస్తున్నారని దక్షిణ భారతదేశంలో నిధుల కేటాయింపులు, నీటి కేటాయింపులు ప్రాజెక్టుల నిర్మాణం, రైలు మార్గాల నిర్మాణం లేదని ఆరోపించారు. తీవ్రమైన నిర్లక్ష్యం వివక్షత చూపుతున్నారని తెలిపారు. కేవలం అంబానీ ఆధానీల మెప్పు కోసమే దేశ సంపదను లూటీ చేస్తున్నారని అన్నారు. జీరో అకౌంట్ ద్వారా 15 లక్షలు ప్రతి అకౌంట్లో వేస్తామనే మాట జూట అని అన్నారు.
ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని పంటలకు 500 బోనస్ ఇవ్వాలని అన్నారు. ఏకకాలంలో పంటల రుణమాఫీ రెండు లక్షలు చేయాలని ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రజల నుండి వ్యతిరేకత తప్పదని తెలియజేశారు. ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి పేద ప్రజల పక్షాన నికరంగా పోరాడే అభ్యర్థి జహంగీర్ అని అన్నారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన మీ అమూల్యమైన ఓట్లు వేసి సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, కాగు వెంకటయ్య, చెల్లం ముత్యాలు, నారోజు అంజయ్య,బుర్రి పెంటయ్య, లక్షమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
SB NEWS NLG
Apr 28 2024, 13:25