భువనగిరి రోడ్ షో లో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కేసీఆర్ బస్సు యాత్ర - 2 వ రోజు.
సూర్యాపేట నుంచి మధ్యాహ్నం బయలుదేరిన కేసీఆర్, వయా అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా భువనగిరి చేరుకున్నారు.
మార్గమధ్యంలో పలు చోట్ల కార్యకర్తలు ప్రజలు అభిమానం తో దారిపొడవునా ఘన స్వాగతం పలికారు.
సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన భువనగిరి రోడ్డు షోలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సాయంత్రం భువనగిరి లో నిర్వహించిన రోడ్డు షోలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం - ముఖ్యాంశాలు :
మొత్తం మూడు పార్టీలు పోటీలో ఉన్నాయి.
పిచ్చిగా ఉన్మాదం తో కాకుండా ఏపార్టీకి ఓటు వేయాలో ఏ పార్టీ మనకోసం పనిచేస్తదో ఆలోచించి ఓటేయాలి
బీజేపీ మేకిన్ ఇండియా అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ ఒక్కటి అమలు చేస్తాలేదు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల మీద దాడులు
డాలరు విలువ 83 రూపాయలకు పెరిగింది
ఒకపార్టీ దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతంది.. ఇంకో పార్టీ దేవుని మీద ఒట్లు .. ఇదీ నడుస్తాంది
మనం అద్భుతంగా యాదాద్రిని నిర్మించుకున్నం కానీ ఎన్నడూ ఓట్లకోసం వాడుకోలే
భోనగిరిలో బిజెపి కాంగ్రెస్ మిలకత్ అయినయి
అక్షింతలు తీర్థాలు మన పిలగాన్ల కడుపునింపుతదా .?
తలకాయ తెగిపడ్డా కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టనని చెప్పిన మోడీ కి
కేంద్రం ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇయ్యలే
ఇవ్వాళ ఎంపీ గా పోటీ చేసేటాయిన అయ్యల ఎంత అడిగిన ఇయ్యాలే
తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ
ఇప్పుడు యువత ఆలోచించాలి భవిష్యత్తు మీదే
మన శత్రువే కాంగ్రెస్ పార్టీ
నాడు ఎవ్వడు లేకున్నా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుని పదేండ్లు నడిపినాం
తల్లికొడివలే అందరినీ కాపాడుకున్నాం
మొదటి సంవత్సరం లోనే చెడిపోయిన కరెంటును బాగుచేసుకున్నాం రైతుబంధు ఇచ్చుకున్నాం
బసవపురం రిజర్వాయర్ కట్టుకున్నం
ఐదేకురాలకు ఇస్తామంటే ఆరో ఏకురం వాడు ఎటుపోవాలి
పొలాలను ఎండబెట్టిండ్రు
బోర్లు ఎండినాయి పూడికలు తీసే క్రేన్లు మల్లోచ్చినాయి
ధాన్యం కొంటలేరు
రాత్రిపూట మోటర్ పెట్టి పాము కాట్లకు సచ్చే దుర్మార్గపు పాలన కాంగ్రెస్ ది
కేసీఆర్ పొంగనే కట్క బంజేసినట్టే నీళ్లు ఆగినాయి కరెంటు ఆగింది
దద్దమ్మనప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు
రైతులు చనిపోతే ఒక్క మంత్రి పోలె సీఎం పోలె
నా కండ్లముందాలనే పంట ఎండిపోతే ఎంజేయాల్నే నోరుమూసుకుని ఊకోవాల్నా కొట్లాడాల్నా.?
ఫీజు రీబర్సంట్ ఇస్తాళేరు
చేనేత కార్మికులను ఆదుకుంటాలేరు
నిరుద్యోగ బృతి లేదు బోగస్
ఐదొందలు బోనస్ అన్నరు ఇప్పుడు లేదు అంటున్రు
రెండు లక్షలు రుణ్మాఫీ అన్నారు ఇచ్చిండ్రా
తులం బంగారం తుస్సుమన్నది బోనస్ బోగస్ అయింది
గృహకు జ్యోతి విద్యుత్తు పరిస్థితి అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టు అయింది
స్కూటీ రాలేదు కానీ లూటీ అయితాది
తెలంగాణ కు కాంగ్రెస్ కు పంచాతి పడ్డది మీరు ఎవలిని కోరుకుంటారు పంచ్ గా…
కేసీఆర్ కేసీఆర్ ప్రజల స్పందన
నన్ను తెలంగాణ కోసం పుట్టించిండ్రు దేవుడు
ప్రజల గుండె చీలిస్తే కనిపించేది కేసీఆర్… కేసీఆర్ గుండె చీలిస్తే కనపడితే కనిపించేది తెలంగాణ ప్రజలు
దేర్ హోగా మగర్ అందేర్ నహీ
మనది సెక్యులర్ పార్టీ
నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిండ్రు.. ప్రాణం పోయేదాకా న్యాయం కోసం కొట్లాడుతాం
బిఆర్ఎస్ కార్ గుర్తుమీద ఓటేసి క్యామ మల్లేష్ గారిని గెలిపించండి
ఆయన 24 గంటలు మీ సేవలో వుంటాడు తలలో నాలుక లాగా ఉంటాడు
* ఇదే ఉత్సాహం మే 13 దాకా చూయించి బీఆర్ ఎస్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలి.
![]()

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కేసీఆర్ బస్సు యాత్ర - 2 వ రోజు.

గాంధీ భవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాయినింగ్ కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి మరియు కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మరియు మన ఎమ్మెల్సీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మహేష్ కూమార్ గౌడ్ ఆధ్వర్యంలో యాదాద్రి బోవనగిరి జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ ఓబీసి విభాగం చైర్మన్ గోద రాహుల్ గౌడ్ మరియు వారి బృందం తిరిగి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.






యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల లో మండల ర్యాంకులు సాధించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఎస్ బి ఐ బ్యాంకులో నగదు కాజేసి పరారైన క్యాషియర్ కాలేరు అనిల్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం కోర్టు ముందు హాజరు పరిచారు. క్యాషియర్ అనిల్ కుమార్ రూపాయలు 15 లక్షల 50 వేల రూపాయలు నగదులో కొరత ఏర్పడగా బ్యాంక్ మేనేజర్ జి మౌనిక స్థానిక పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ 16న పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు క్యాషియర్ కాలేరు అనిల్ కుమార్ ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడుతూ రూ.37,63,000 ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు.

Apr 26 2024, 06:59
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
46.8k