భువనగిరిలో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపు ఖాయం: భువనగిరి అసెంబ్లీ ప్రబారి మోతేపాక సాంబయ్య
![]()
భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు బోళ్ళ సుదర్శన్ గారి అధ్యక్షతన ఈరోజు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల పదాధికారులు మరియు ముఖ్య నాయకుల సమావేశంను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి అసెంబ్లీ ప్రబారి మోతేపాక సాంబయ్య హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 1 తారీకు నుండి 8 తారీకు వరకు జరిగే కార్నర్ మీటింగ్ లను విజయవంతం చేయాలని కోరారు మరియు మే 3 వ తేదీన చౌటుప్పల్ లో జరిగే బారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ గారు హాజరవుతారు ఈసభను విజయవంతం చేయాలని కోరారు ,అదేవిధంగా బూర నర్సయ్య గౌడ్ గెలుపు కూడా బూత్ ఓటర్ల పైన వుంటుంది కాబట్టి రానున్న భువనగిరి లోక్సభ ఎన్నికల్లో బూర నర్సయ్య గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బూత్ అధ్యక్షులు, కో ఆర్డినేటర్ పైన వుందని అన్నారు, కార్యకర్తలు నాయకులు గ్రామాల్లో ఇంటి ఇంటికి తిరుగుతూ ఓటును అభ్యార్ధించాలని అన్నారు,తెలంగాణ ఓటర్లు బిజెపి వైపు వున్నారు అని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొప్పుల యాది రెడ్డి,అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ,మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్ ,లోడే లింగస్వామి గౌడ్ సీనియర్ నాయకులు బందారపు రాములు మండల ఉపాధ్యక్షులు డోగ్పర్తి సంతోష్,గంగదారి దయాకర్, కోశాధికారి అప్పిషెట్టి సంతోష్ ,మండల కార్యదర్శులు మందుల నాగరాజు , BJYM బీజేవైఎం జిల్లా కార్యదర్శి రేగురి అమరేందర్, BJYM అసెంబ్లీ కన్వీనర్ బుంగమట్ల మహేష్,BJYM జిల్లా కార్యవర్గ సభ్యులు దంతూరి అరుణ్,బీజేవైఎం మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి, ,కిసాన్ మోర్చా అధ్యక్షులు కొత్త రామచంద్రం బూత్ అద్యక్షులు బొంత భాస్కర్, భిక్షపతి , తదితరులు పాల్గొన్నారు.



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల లో మండల ర్యాంకులు సాధించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఎస్ బి ఐ బ్యాంకులో నగదు కాజేసి పరారైన క్యాషియర్ కాలేరు అనిల్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం కోర్టు ముందు హాజరు పరిచారు. క్యాషియర్ అనిల్ కుమార్ రూపాయలు 15 లక్షల 50 వేల రూపాయలు నగదులో కొరత ఏర్పడగా బ్యాంక్ మేనేజర్ జి మౌనిక స్థానిక పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ 16న పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు క్యాషియర్ కాలేరు అనిల్ కుమార్ ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడుతూ రూ.37,63,000 ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు.




భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గోన్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ,ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ,నకిరెకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ,తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్యూల్ . నామినేషన్ కి ముందు యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ పత్రాలు చామల కిరణ్ కుమార్ రెడ్డి దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు.



Apr 25 2024, 18:06
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.2k