భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థిని గెలిపించి, పార్లమెంటుకు పంపించాలని ఇంటింటికి ప్రచారం
సిపిఎం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఎండి జాంగిర్ ని గెలిపించాలని ఈరోజు బోనగిరి మండలం వడపర్తి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నరసింహ మాట్లాడుతూ గత 35 సంవత్సరాల నుండి ప్రజా ఉద్యమంలో పనిచేస్తున్న ఎండి జాంగిరి చిన్నతనం నుండి ఉపాధి హామీ కూలీల కోసం రైతుల కోసం కార్మికుల కోసం నిరుద్యోగ సమస్యలపై అదేవిధంగా కాలువల కావాలని బసాపురం రిజర్వాయర్ నుండి వడపర్తి గతంలోకి నీళ్లు తేవాలని ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగింది కావున ప్రజలందరూ ఎండి జాంగిర్ కు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే భువనగిరి పార్లమెంటును అభివృద్ధి పథంలో చేస్తారని నరసింహ అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య మండల కమిటీ సభ్యులు పాండాల మైసయ్య గ్రామ నాయకులు పాండాల ఆంజనేయులు మల్లేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.







రైతులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రానికి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు. ఎదురుగట్ల బాల నరసింహ వలిగొండ మండల ఎంపీపీ నూతి రమేష్ రాజు , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి , కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కంకల కిష్టయ్య . కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు బోళ్ళ శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో. కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల యుగంధర్ రెడ్డి , కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు. బత్తిని లింగయ్య ,కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు బత్తిని సహదేవ్ ,మండల నాయకులు కుందారపు కొమురయ్య , బత్తిని సత్యనారాయణ , ఎమ్మె మల్లేశం , కాంగ్రెస్ పార్టీ మాజీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పోలేపాక జానకి రాములు ,తదితరులు పాల్గొన్నారు.

Apr 24 2024, 07:32
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.7k