సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి:
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న సిపిఎం అభ్యర్థి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ పిలుపునిచ్చారు. సోమవారం బోనగిరి మండల పరిధిలోని నందనం, ముస్తాలపల్లి గ్రామాలలో సిపిఎం అభ్యర్థి గెలుపును కోరుతూ ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈసంర్భంగా నర్సింహ మాట్లాడుతూ సిపిఎం ఆధ్వర్యంలో అనేక కూలీ భూమి పోరాటాలు కార్మికుల కర్షకుల హక్కుల కోసం అనేక సమరశీల పోరాటాలు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించామని నిరంతరం రైతులు ప్రజలు వ్యవసాయ కూలీలు సంఘటిత అసంఘటిత కార్మికుల పక్షాన సిపిఎం అభ్యర్థి అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నదని తెలియజేశారు. సిపిఎం అభ్యర్థి జహంగీర్ గెలిస్తే ఈ ప్రాంతాన్ని విద్య వైద్యం ఉపాధి పరంగా ముందు భాగంలో పెట్టడానికి కృషి చేస్తాడని ప్రజలందరూ ప్రజల పక్షాన ప్రజల మధ్యన ఉండే జహంగీర్ ని గెలిపించాలని వారు కోరినారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, మండల కమిటీ సభ్యులు కొండపురం యాదగిరి, నాయకులు కళ్లెం లక్ష్మీ నరసయ్య, భూపాల్ రెడ్డి, లచ్చిరెడ్డి, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.




రైతులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రానికి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు. ఎదురుగట్ల బాల నరసింహ వలిగొండ మండల ఎంపీపీ నూతి రమేష్ రాజు , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి , కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కంకల కిష్టయ్య . కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు బోళ్ళ శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో. కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల యుగంధర్ రెడ్డి , కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు. బత్తిని లింగయ్య ,కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు బత్తిని సహదేవ్ ,మండల నాయకులు కుందారపు కొమురయ్య , బత్తిని సత్యనారాయణ , ఎమ్మె మల్లేశం , కాంగ్రెస్ పార్టీ మాజీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పోలేపాక జానకి రాములు ,తదితరులు పాల్గొన్నారు.





Apr 22 2024, 23:43
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.3k