మే' డే ను జయప్రదం చేయండి: ఏఐటీయూసీ
138వ 'మే' డే ను ఘనంగా నిర్వహించి జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి , జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి పిలుపునిచ్చారు. సోమవారము నల్లగొండ లో జరిగిన ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం లో మాట్లాడుతూ.. ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని, కార్మిక చట్టాల పునరుద్ధరణకై దేశంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని దేశాన్ని రాజ్యాంగాన్ని ప్రజలను రక్షించుకోవాడానికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశం లో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు సయీద్ , సుమతమ్మ, దోటీ వెంకన్న, కొశాదికారి వెంకన్న జిల్లా నాయకులు జానీ, శంకర్,గుండె రవి, వెంకట్ రాములు, కోట్ల శోభ, లెనిన్, మల్లయ్య , నీల వెంకటయ్య, అమీర్, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
SB NEWS NLG











Apr 22 2024, 19:35
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.4k