/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని లండన్ లో లండన్ బ్రిడ్జి వద్ద భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం లండన్ ఎన్నారైలు Vijay.S
చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని లండన్ లో లండన్ బ్రిడ్జి వద్ద భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం లండన్ ఎన్నారైలు


భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆదివారం

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం లండన్ ఎన్నారై ల విజ్ఞప్తి లండన్ లో  లండన్ బ్రిడ్జి వద్ద భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ వివిధ గ్రామాల లండన్ ఎన్నారై ల చామల కిరణ్ కుమార్ రెడ్డి ని భారీ మేజారిటి తో గెలిపించాలని ప్రదర్శన నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో భువనగిరి గిరి నియోజకవర్గం కి చెందిన ఎన్నారై లు అమరపాల్ రెడ్డి 

అభినవ్ 

కిట్టు 

రఘుపతి 

రాజేందర్ ల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

విద్యార్థి దశ నుండే విద్యార్థి నాయకుని గ యువజన నాయకుని గ అనేక ప్రజా సమస్యలు పరిష్కరించడం లో ఎంతో కృషి చేసారు.

ప్రజల మధ్యలో నిరంతరం ఉంటూ ప్రజల తోనే జీవితం మమేకం అయిన కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గ గెలిస్తే, నియోజకవర్గం కి ఎన్ని విధాల మేలు జరుగుతుంది అని అన్నారు 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3 లక్షల మెజారిటీ తో భువనగిరి కాంగ్రెస్ గెలవబోతుందని ఆశాభావం వ్యక్తపరిచారు.

గంప వేణుగోపాల్ 

కన్వీనర్ 

టీపీసీసీ ఎన్నారై సెల్

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు ఎదురు గట్ల బాల నరసింహ


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రానికి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు. ఎదురుగట్ల బాల నరసింహ వలిగొండ మండల ఎంపీపీ నూతి రమేష్ రాజు , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి , కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కంకల కిష్టయ్య . కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు బోళ్ళ శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో. కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల యుగంధర్ రెడ్డి , కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు. బత్తిని లింగయ్య ,కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు బత్తిని సహదేవ్ ,మండల నాయకులు కుందారపు కొమురయ్య , బత్తిని సత్యనారాయణ , ఎమ్మె మల్లేశం , కాంగ్రెస్ పార్టీ మాజీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పోలేపాక జానకి రాములు ,తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి రోడ్ షో లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం వారు మాట్లాడుతూ భువనగిరి గడ్డ పోరాటాలకు స్ఫూర్తిని అన్నారు. కష్ట నష్టాల్లో పేదలకు సేవలు అందించిన మీ బిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ,తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని అన్నారు .తెలంగాణ రాష్ట్రం వచ్చాకే మంత్రి పదవిని తీసుకుంటానని చెప్పి నలగొండ పోరాట యోధుడు వెంకటరెడ్డి అని అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన దుర్మార్గుడు కేసీఆర్ అని అన్నారు. పోటీ పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగుల ఉసురు తీసుకున్న వ్యక్తి కెసిఆర్ ,కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, 30 వేల ఉద్యోగాలు వివరాలు ఇస్తామని అన్నారు. దమ్ముంటే భువనగిరి సెంటర్ కు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆడబిడ్డలకు ఆర్టీసీ లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ను ఓడించాలా ? రాజీవ్ ఆరోగ్యశ్రీ  ద్వారా రూపాయలు 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించినందుకు కాంగ్రెస్ని ఓడించాలా ? అని అన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుకు కాంగ్రెస్ను ఓడించాలా ? వంద రోజుల్లో పేదల సంక్షేమానికి ఇచ్చిన ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తుంటే పదేపదే ప్రభుత్వం పడిపోతుంది అని కేసిఆర్ అంటున్నాడు. ఇదేమైనా ఫుల్ బాటిలా పడిపోవడానికి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నాయకులు, కళాకారులు, కార్యకర్తలు ,పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

భువనగిరి లో ముఖ్యమంత్రి రోడ్ షో తో ప్రయాణికుల పాట్లు


 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి భువనగిరి లో నిర్వహించిన రోడ్ షో తో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సుమారు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆర్టీసీ బస్సులు భువనగిరి బస్ స్టేషన్ లోకి రాక పోవడంతో గంటల తరబడి ప్రయాణికులు, పసి పిల్లలతో భువనగిరి బస్ స్టేషన్ లో వేచి ఉండాల్సి వచ్చింది. ఆదివారం సెలవు దినం కావడం, పెళ్ళిళ్ళు ఉండడం తో ప్రయాణికుల గమ్యస్థానాలకు చేరడానికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యమంత్రి రోడ్ షో ప్రచారం కోసం ప్రజలను తరలించిన ప్రైవేటు వాహనాలు , కార్లు, ఇతర వాహనాలు భువనగిరి బస్ స్టేషన్లో నిలిపి, ప్రైవేటు పార్కింగ్ గా మార్చి వేసారు. దీంతో అటు నల్లగొండ నుండి వచ్చే వాహనాలు బైపాస్ వద్ద నిలిపివేయడం, నల్గొండ కు వెళ్ళాల్సిన ప్రయాణికులు ఆటోల ద్వారా బైపాస్ వరకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాద్, వరంగల్ వెళ్ళే ప్రయాణికులు కూడా గంటల తరబడి భువనగిరి బస్ స్టేషన్ లో వేచి ఉండాల్సి వచ్చింది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రోడ్ షో ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. జిల్లా పోలీస్ అధికారులు, ఆర్టీసీ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు ఆరోపించారు. కేవలం ఒక్క నల్గొండ రూట్ ఆర్టీసీ ప్రయాణికులకు కేటాయిస్తే సమస్య ఉండేది కాదని వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రి ప్రచార సభ ఎవ్వరికీ ఇబ్బంది కలుగకుండా నిర్వహిస్తే బాగుండేదని ఆయన అన్నారు. అధికారుల సమన్వయ లోపంతోనే సమస్యలు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆయన కోరారు.

విద్యార్థుల మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి భూక్యా సంతోష్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు

 భువనగిరి ప్రభుత్వ ఎస్సీ గురుకులా హాస్టల్లో మృతిచెందిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు భూక్య సంతోష్ నాయక్ గారు మాట్లాడుతూ భువనగిరి ఎస్సీ హాస్టల్లో కలుషిత ఆహారం తిని మృతి చెందిన ప్రశాంత్ అలాగే రెండు నెలల క్రితం ఎస్సీ హాస్టల్లో చనిపోయిన భవ్య, వైష్ణవి, 1 ఇయర్ క్రితం చనిపోయిన మనోహర్ ఇలా యాదాద్రి జిల్లాలో మూడు సంవత్సరాల వ్యవధిలో 9 మంది విద్యార్థుల మరణాలపై విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లా sc సంక్షేమ శాఖ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు విద్యార్థుల ప్రాణాలంటే ఈ అధికారులకు ఇంత నిర్లక్ష్యమా వాళ్ళ పిల్లలైతే కార్పొరేట్ స్థాయి స్కూల్లో హాస్టల్లో చదివిస్తారు బడుగు బలహీన వర్గాల పేదింటి బిడ్డలు బతుకు మీద భవిష్యత్తు మీద ఆశతో విద్యను అభ్యసించడానికి వచ్చిన పేదింటి బిడ్డలకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారులు మరియు ఫుడ్ సప్లై చేస్తున్న కాంట్రాక్టర్ పై తక్షణమే ఘటనలకు బాధ్యులైన అందరిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తీసేయాలని విద్యార్థుల మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు, యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యా సంస్థలు పూర్తిగా నిరు గారి పోతుంది, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది, మృతి చెందిన విద్యార్థి కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబానికి ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని , జిల్లా మరియూ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు, ఈ సమావేశంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవి నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్ నాయక్, gvs ప్రవీణ్ నాయక్,LHPS రమేష్ నాయక్, వెంకటేష్ నాయక్, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నాయకుడు జహంగీర్ ను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపండి : సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి


భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ను ఆశీర్వదించి, పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ ఆదివారం రామన్నపేట మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ కాలనిలో సిపిఎం నాయకులు ప్రచారం నిర్వహించారు

ఈసందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి మాట్లాడుతూ అనునిత్యం పేద ప్రజల కోసం పోరాడుతున్న ఎర్రజెండా ముద్దుబిడ్డ, నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే ఎండి జహంగిర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి భువనగిరి ఎంపీగా జహంగీర్ ను గెలిపించి పార్లమెంటుకు పంపాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటి సభ్యులు జిల్లాల పెంటయ్య మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్, గన్నేబోయిన విజయభాస్కర్, మండల నాయకులు కందుల హనుమంతు బావాండ్లపల్లి బాలరాజు, మేడబోయిన శ్రీనివాస్, గొరిగే సోములు, వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.

అక్రమంగా తరలిస్తున్న హాస్టల్ కిరాణా వస్తువులను పట్టుకున్న చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ నాయకులు

 భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో పుడ్ పాయిజన్ జరిగి ఓ విద్యార్థి మరణించిన సంఘటన పై పూర్తి విచారణ జరగక ముందే సిబ్బంది హాస్టల్ నుండి మిగిలి ఉన్న కిరాణా వస్తువులను ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యులు ఆటోను అడ్డగించి నిలిపివేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. హాస్టల్ లో కలుషిత ఆహారం తీసుకొని కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురై, ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి సి.ఎచ్ ప్రశాంత్ మృతి చెందిన విషయం తెలిసిందే. కానీ పుడ్ పాయిజన్ కు కారణమైన కిరాణా వస్తువులను ఆటో నెంబర్ TS 27/ T 2170 ఆటో లో శనివారం మధ్యాహ్నం అక్రమంగా తరలిస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా బాలల హక్కుల సంఘం నాయకులు కొడారి వెంకటేష్, భువనగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుగ్గ రమేష్ లు ఆటోను అడ్డగించి, ఆటోలోని కిరాణా వస్తువులను తిరిగి హాస్టల్ లోకి పంపించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు కొడారి వెంకటేష్ మాట్లడుతూ గురుకుల పాఠశాలల కో- ఆర్డినేటర్ రజని మేడం, రెవెన్యూ డివిజన్ అధికారి అమరేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి జైపాల్ రెడ్డి లు హాస్టల్ తనిఖీ చేస్తున్న సమయంలోనే హాస్టల్ సిబ్బంది అక్రమంగా కిరాణా వస్తువులను ఆటోలో తరలించే ప్రయత్నం చేసారని ఆయన ఆరోపించారు. ఆటోను ఆపి డ్రైవర్ ను అడుగుతున్న సమయంలో హాస్టల్ సిబ్బంది ధనుంజయ్ వచ్చి ఆర్డీవో అనుమతి తో పంపిస్తున్నామని చెప్పగా ఆర్డీవో కు ఫోన్ చేయగా నాకు సంబంధం లేదని చెప్పాడని వెంకటేష్ తెలిపారు. ఆటోను స్వాధీనం చేసుకుని పంచనామా చేయాలని పట్టణ ఎస్సై అరుణ్ కుమార్ కు పోన్ లో పిర్యాదు చేయగా, మాకు సంబంధం లేదని, కిరాణా వస్తువుల శాంపిల్స్ పుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా గతంలోనే సేకరించినట్లు ఎస్సై అన్నట్లు వెంకటేష్ తెలిపారు. గురుకుల పాఠశాల రీజనల్ కో- ఆర్డినేటర్ రజని మేడంకు పోన్ చేయగా ఆమె స్పందించక స్పందించక పోవడంతో అట్టి కిరాణా వస్తువులను తిరిగి హాస్టల్ లోకి పంపించామని ఆయన అన్నారు. గురుకుల పాఠశాలలకు సరఫరా చేసే కిరాణా వస్తువులలో నాణ్యత లోపించినట్లు స్పష్టంగా అర్థం అవుతుందని ఆయన అన్నారు. కిరాణా వస్తువులను సరఫరా చేసే కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హాస్టల్ లో జరిగిన సంఘటన పై పూర్తి స్థాయిలో విచారణ ముగిసేవరకు ఎలాంటి కిరాణా వస్తువులను హాస్టల్ నుండి తరలించరాదని ఆయన డిమాండ్ చేశారు. ఆహార భద్రతా అధికారులు శాంపిల్స్ సేకరించి, ల్యాబ్ కు పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రశాంత్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆయన కోరారు.

సిపిఎం ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన గెలవాలని కోరుతూ విరాళం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో సిపిఎం ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్ ఇంటింటి ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది .

ఈ సందర్భంగా ఓటు అభ్యర్థించడానికి ఓ కార్యకర్త ఇంటికి వెళ్లిన సిపిఎం ఎంపీ అభ్యర్థికి సిపిఎం సీనియర్ నాయకుడుగా ఉన్న వరికుప్పల యాదయ్య మీరు గెలవాలని కోరుతూ 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని విరాళంగా ఇచ్చారు ఇంటింటికి తిరిగిన సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ కు ప్రజలు హారతులు ఇచ్చి పూలదండలు తో స్వాగతం తెలియజేశారు ప్రజల కోసం పోరాడే మీలాంటివారు ఈ ఎన్నికల్లో గెలవడం ప్రజలకు ఎంతో అవసరమని 

ఈసారి మా ఓటు మీకే అంటూ అనేకమంది వారికి హామీని ఇచ్చారు ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ మాట్లాడుతూ పులిగిల్ల గ్రామంతో గత 35 సంవత్సరాలుగా అనుబంధం ఉందని మొట్టమొదటి ప్రచారం సాయుధ పోరాట చరిత్ర కలిగిన పులిగిల్ల నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా ముందుకు వస్తున్న కాంగ్రెస్,బిఆర్ఎస్, బిజెపి అభ్యర్థుల యొక్క చరిత్ర ఏమిటో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలని,ప్రజల కోసం ఎలాంటి వ్యాపారాలు,వ్యాపకాలు లేకుండా పోరాడుతున్న నాలాంటి వ్యక్తికి ఒక్క అవకాశం కల్పించాలని కోరారు ఈ గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో కొమ్మిడి లక్ష్మారెడ్డి నాయకత్వం లో గత 35 సంవత్సరాలుగా ప్రజల కోసం అనేక పోరాటాలు నడిపి గ్రామ అభివృద్ధిని చేసి చూపించారన్నారు అమరజీవి వేముల మహేందర్ ప్రజల కోసం జీవితాంతం పోరాడి అమరుడైన ఈ గ్రామం కమ్యూనిస్టులకు ఎప్పుడు అండగా నిలిచిందన్నారు కమ్యూనిస్టులకు ఓటు వేస్తే ప్రజల కోసం పనిచేసే సేవకున్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు ప్రస్తుతం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మిగతా మూడు పార్టీల అభ్యర్థులు ఏనాడు ప్రజల కోసం పోరాడిన చరిత్ర లేదని వాళ్లకున్న వ్యాపారాలను మరింత పెంచుకోవడం తప్ప ప్రజలకు ఎలాంటి మేలు జరగదని అందుకే నిజాయితీగా 35 సంవత్సరాలుగా ప్రజా పోరాటాలు చేస్తున్న తనకు అవకాశం కల్పించాలని కోరారు ఈ ప్రాంతానికి సాగునీరు అందించే బునాది గాని కాలువ ప్రారంభించి 20 సంవత్సరాలు గడుస్తున్న గత ఎంపిలుగా గెలిచిన ముగ్గురు బీఆర్ఎస్, కాంగ్రెస్,పాలకుల యొక్క నిర్లక్ష్యం మూలంగా నేటికీ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు సిపిఎం కు అవకాశం ఇచ్చి ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలిపిస్తే బునాది గాని కాలువను పూర్తి చేయడమే కాకుండా ఆ కాలువ ద్వారా గోదావరి జలాలను ఈ ప్రాంత రైతాంగానికి అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ నారి ఐలయ్య జగదీష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరు బాలరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆవనగంటి వెంకటేశం, సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, జిల్లా కమిటి సభ్యులు గడ్డం వెంకటేష్,సీనియర్ నాయకులు కళ్లెం సుదర్శన్ రెడ్డి,మండల కమిటీ సభ్యులు వాకిటి వెంకటరెడ్డి,కందడి సత్తిరెడ్డి, శాఖ కార్యదర్శి బుగ్గ చంద్రమౌళి,స్థానిక పార్టీ నాయకులు దొడ్డి బిక్షపతి,వరికుప్పల యాదయ్య, వడ్డేమాన్ వెంకటయ్య, బుగ్గ ఐలయ్య, వేముల చంద్రయ్య,వరికుప్పల శంకరయ్య,వేముల ఆనంద్, దొడ్డి యాదగిరి, వేముల అమరేందర్, బొడ్డు రాములు,వేముల ముత్తయ్య,వడ్డెమని మధు,వనం యాదయ్య,మారబోయిన ముత్యాలు,ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వేముల నాగరాజు,వరికుప్పల సతీష్,కొమ్మిడి క్రిష్ణా రెడ్డి, వరికుప్పల శ్రీశైలం,వేముల రాంబాబు,సందేల శ్రీకాంత్, వేముల జ్యోతిబస్,దయ్యాల నర్సింహ,వరికుప్పల యాదమ్మ,వేముల రమణమ్మ,మౌనిక,వడ్డెమని ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

అస్వస్థతకు గురైన మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నరసింహులు


యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి జిల్లాకు చెందిన

 మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ మోత్కుపల్లి నర్సింహులు శనివారం అస్వస్థతకు గురయ్యారు.

అకస్మాత్తుగా బిపి డౌన్ కావడం, షుగర్ లెవల్స్ పడిపోవడంతో బేగంపేటలోని వెల్నెస్ ఆసుపత్రిలో చేరడం జరిగినది.

పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు అత్యవసర చికిత్సను అదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

కేంద్రంలో మరోమారు బిజెపి సర్కార్

*భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఇంటింటి ప్రచారంను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి.యన్.రెడ్డి ,స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలె చంద్రశేఖర్ ,పార్లమెంట్ కన్వీనర్ బంధారపు లింగస్వామి గౌడ్ హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే కావున భువనగిరి పార్లమెంట్లో బూర నర్సయ్య గౌడ్ కచ్చితంగా గెలవడం వల్ల భువనగిరి పార్లమెంట్ అభివృద్ధి జరుగుతుందని అన్నారు, బిజెపి గెలవడం వల్ల కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకం క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్తుందని అన్నారు, ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అని ఈ సందర్భంగా వారు అన్నారు ,తెలంగాణ లో టిఆర్ఎస్ పని ఐపోయింది, కాంగ్రెస్ అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేసిందని అన్నారు ఈ రెండు పార్టీలు అమలుకాని హామీలతో , తెలంగాణ ప్రజలను ఆకర్షించడానికి ఉచిత పథకాలకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఉచితంగా ఇవ్వాల్సిన విద్య వైద్యం మౌలిక సదుపాయాలను ప్రజల నుండి దూరం చేస్తున్నారని అన్నారు .టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయడం వృధా అని అన్నారు ,ప్రజలు బీజేపీ కి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు అని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, సీనియర్ నాయకులు సత్తయ్య కణతాల అశోక్ రెడ్డి జిల్లా కార్య వర్గ సభ్యులు భచ్చు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి మారోజు అనిల్ కుమార్ ,లోడే లింగస్వామి , మండల కమిటీ సభ్యులు సంతోష్ దయ్యాల వెంకటేశం, అప్పిశెట్టి సంతోష్,మైసొల్ల మచ్చ గిరి, మందుల నాగరాజు, మోర్చా అధ్యక్షులు కొత్త రామచంద్రం వెలిమినేటి వెంకటేశం బీజేవైఎం నాయకులు బుంగమట్ల మహేష్ ,రేగురి అమరేందర్, దంతూరి అరుణ్,ఏళ్ళంకి మురళి, ఎర్రబోలు జంగయ్య, పాతకోట నరేష్,మైసొల్ల హరీష్,పుండరీకం కట్ట బిక్షం శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.