/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz తెలంగాణ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తులు Vijay.S
తెలంగాణ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తులు


తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూ ర్తులైన జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌ రావులను శాశ్వత న్యాయ మూర్తులుగా నియమించ డానికి సుప్రీంకోర్టు కొలీజి యం సిఫార్సు చేసింది.

ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తు లుగా సిఫారసు చేస్తూ 2024, ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించిందని తెలిపింది. ముఖ్యమంత్రి, గవర్నర్‌లు దీనికి తమ సమ్మతి తెలియజేశారని పేర్కొంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ డీవై చంద్ర చూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌.గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తు లుగా జస్టిస్‌ శ్రీనివాసరావు, జస్టిస్‌ రాజేశ్వర్‌రావులకు తగిన అర్హతలు కలిగి ఉన్నా రని నిర్ణయించినట్టు వెల్లడించింది.

తెలంగాణ హైకోర్టుకు చెందిన ఈ ఇద్దరు న్యాయ మూర్తుల తీర్పులు పరిశీ లించాలని ఇద్దరు న్యాయ మూర్తులతో కూడిన సుప్రీం కోర్టు కమిటీని సీజేఐ ఆదే శించారని.. ఆ కమిటీ ఆయా తీర్పులపై సంతృప్తి వ్యక్తం చేసిందని వివరిం చింది.

మొగిలి పాక గ్రామంలో వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం


వలిగొండ మండలం మొగిలిపాక గ్రామం లో శ్రీ

సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం  మండల్ కోర్ కమిటీ సభ్యులు, కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీమామిడిసత్తిరెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగ నిర్వహించామని మొగిలి పాక కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పబ్బు ఎల్లయ్య గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడిగే వెంకన్న , మాజీసర్పంచ్ ముద్దసాని నరసింహారెడ్డి,ముద్దసాని రఘుపతిరెడ్డి , ముద్దసాని జైసింహ రెడ్డి, మాజీ సర్పంచ్ రచ్చ యాదగిరి. మాజీసర్పంచ్ మొగిలిపాక గోపాల్ , యాదవ్ సంగం అధ్యక్షులు మర్ల మల్లేష్ యాదవ్ , మొగిలిపాక పాపయ్య, జక్కా జనార్దన్ రెడ్డి, జడిగి నరసింహ , మొగిలిపాక యూత్ కాంగ్రేస్ సభ్యులు మొగిలిపాక రాంబాబు , కార్యదర్శి చెన్నారం మహేష్ అలాగే బజ్రంగ్ యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది .                    

          

దాసిరెడ్డి గూడెం లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వేద బ్రాహ్మణులచే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం జరుపబడినది. ఈ కళ్యాణ మహోత్సవానికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించినారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించిన భక్తులకు స్వామివారి కరుణాకటాక్షం ఎల్లవేళలా ఉండాలని ఆ సీతారామచంద్ర స్వామి వారిని కోరుతున్నాం. కళ్యాణ మహోత్సవం అనంతరం బందారపు లింగస్వామి జయమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ మెంబర్లు రామభక్తులు గ్రామ ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వలిగొండ ఎస్బిఐ బ్యాంకులో నగదులో కొరత, పరారీలో క్యాషియర్ కేసు నమోదు చేసిన వలిగొండ ఎస్సై మహేందర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకులో నగదు లో కొరత ఏర్పడిందని బ్రాంచ్ మేనేజర్ జి మౌనిక స్థానిక వలిగొండ పోలీస్ స్టేషన్లో పిటిషన్ దాఖలు చేశారు. బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి, క్యాష్ ఇన్చార్జి కాలేరు అనిల్ కుమార్ ఈనెల 16వ తేదీ నుండి విధులకు హాజరు కాకుండా పరారీలో ఉన్నారు. ఎక్కడున్నాడో తెలియదు. అతని క్యాబిన్ చెక్ చేయగా నగదు లో రూ. 15 లక్షల 50 వేలు తక్కువగా ఉన్నాయి. ఎంక్వయిరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బ్యాంక్ మేనేజర్ కోరారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వలిగొండ ఎస్సై మహేందర్ తెలిపారు.

గురుకుల విద్యార్థి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలి: బిఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రియదర్శిని మేడి


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై మృతి చెందిన ఆరో తరగతి చదువుకునే విద్యార్థి ప్రశాంత్ కుటుంబాన్ని రాష్ట్రప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రియదర్శిని మేడి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల గురుకుల పాఠశాలలో తరచూ ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించడం లేదని, ప్రభుత్వాధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణమని అన్నారు, మృతి చెందిన విద్యార్థి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలన్నారు.

గురుకుల విద్యార్థి ప్రశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి; కొడారి వెంకటేష్ ,పల్లగొర్ల మోది రాందేవ్


 భువనగిరి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి చినలచ్చి ప్రశాంత్ కుటుంబానికి ఇరవై లక్షల ఎక్సగ్రేషియా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని బాలల హక్కుల సంఘం జిల్లా నాయకులు కొడారి వెంకటేష్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీ రాందేవ్ లు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థి సీ ఎచ్ ప్రశాంత్(12) చిత్రపటానికి పూలమాలలు వేసి, క్రొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘటనకు బాధ్యులైన భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్, వార్డెన్, సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి మృతికి కారణమైన ప్రిన్సిపాల్ ను ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, ఎస్సీ/ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కంచనపల్లి నర్సింగ్ రావు బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు బాసాని మహేందర్, బి ఆర్ ఎస్ పట్టణ సహాయ కార్యదర్శి గుండెబోయిన సురేష్ ,బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు గుండేబోయిన శంకర్, నాయకులు పోలేపాక సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

గురుకుల పాఠశాలలో మృతి చెందిన విద్యార్థి ప్రశాంత్ కుటుంబానికి 15 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి:ఏఐఎస్ఎఫ్

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గత 14వ తేదీన జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటన లో ఆర్ సి ఓ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అడ్డ గూడూరు మండల కేంద్రము లో నిరసన*

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈనెల 14వ తేదీన జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనలో బీబీనగర్ మండలం జిబ్లాక్ పెళ్లి గ్రామానికి చెందిన చిన్నచి ప్రశాంత్ అనే విద్యార్థి మృతి చెందిన సంఘటన బాధాకరం 

మృతుని కుటుంబానికి ప్రభుత్వం 15 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ అన్నారు

ఈరోజు అడ్డ గూడూరు మండల కేంద్రము లో ప్రభుత్వ నికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా లో గురుకుల పాఠశాలల్లో ,సంక్షేమ హాస్టల్లల్లో, ఫుడ్ పాయిజన్,జరుగుతున్న నేపథ్యంలో అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈరోజు ఒక విద్యార్థి ప్రాణం పోయింది అని రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న రజిని గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొందని ఆర్సిఓ పర్యవేక్షణ లోపంతో గురుకుల పాఠశాలల్లో నిరంతర ప్రక్రియగా ఫుడ్ పాయిజన్ జరుగుతుందని ఘటన కారణమైన ఆర్ సి ఓ నువ్వు వెంటనే సస్పెండ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం 

ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్ యూనియన్ మండల నాయకులు చెరుకు శివరాజ్ ,జిల్లా రాకేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు సంతోష్ మహారాజ్, చిప్పలపల్లి ధనుష్, సూరారం సోహిత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ మండల వ్యాప్తంగా వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలకేంద్రంలో శ్రీ రామాలయంలో, మండలంలోని వివిధ గ్రామాలలో బుదవారం శ్రీ రామ నవమి పురస్కరించుకొని శ్రీ సీతా సమేత శ్రీ రామ చంద్ర మూర్తి తిరు కళ్యాణo అంగరంగ వైభవంగా భక్తుల కనువిందుగా వేదపండితులు శాస్త్రోక్తoగా నిర్వహింఛారు. వేసవి కాలం సందర్భముగా భక్తులకు చలువ పందిళ్లు వేసి, మంచినీటి సౌకర్యం కల్పించారు.వలిగొండలో శ్రీ రామాలయంలో నిర్వహించిన ఈ కళ్యాణంలో స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అదేవిధంగా సంగెం గ్రామంలోని శ్రీ రామ నవమి సందర్భంగా రాముల వారి సన్నిధిలో స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.స్వామి అమ్మవార్లకు ఆలయ చైర్మన్ ముసలయ్య దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు ఈ కళ్యాణానికి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమి నేటి సందీప్ రెడ్డి హాజరైనారు.ఈ కార్యక్రమంలోఎంపీపీ రమేష్, వైస్ ఎంపీపీ బాసర ఉమా బాల నరసింహ, మాజీ సర్పంచ్ కీసర రామ్ రెడ్డి, కాసుల కృష్ణ, జక్కుల వెంకటేశం సంజీవరెడ్డి మల్లారెడ్డి వరికుప్పల మల్లేశం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సతిరెడ్డి, కంకల కిష్టయ్య,కుంభం విద్యా సాగర్ రెడ్డి, వెంకటపాపి రెడ్డి,శ్రీ రాం రెడ్డి, బొల్ల శ్రీనివాస్ దంపతులు,కుందారపు కొమురయ్య దంపతులు,పల్లెర్ల రాజు దంపతులు,కంకల కిష్టయ్య,బచు శ్రీనివాస్,చెరుకు శివయ్య,చిలుగురి సతిరెడ్డి, బతినిలింగయ్య,సహదేవ, ఉత్సవ కమిటీ సభ్యులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు..

చికిత్స పొందుతూ గురుకుల పాఠశాల విద్యార్థి మృతి


యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థి ప్రశాంత్ వయసు 12 సంవత్సరాలు మంగళవారం రాత్రి మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి కి చెందిన మహేష్ కుమారుడు ప్రశాంత్ ఆరవ తరగతి చదువుతున్నాడు. ఈనెల 12న కలుషిత ఆహారం వలన విద్యార్థులు అస్వస్థకు గురైనారు. మెరుగైన చికిత్స కోసం ప్రశాంత్ ను 13వ తేదీ హైదరాబాద్ కి తరలించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనకు బాధ్యులుగా భువనగిరి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తూ గురుకులాల సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

భువనగిరిలో స్వర్ణగిరి ఎల్లమ్మ టెంపుల్ బైపాస్ వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని డిసిపికి వినతిపత్రం అందజేసిన బీసీ విద్యార్థి సంఘం


భువనగిరి DCP రాజేష్ చంద్ర సార్ని ఆఫీసులో కలిసి పలు విషయాలపై వినతిపత్రం ఇచ్చిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ వారు మాట్లాడుతూ స్వర్ణగిరి బోనగిరి ఎల్లమ్మ టెంపుల్ బైపాస్ వద్ద ప్రజలు రోడ్డు కాస్ చేసేటప్పుడు ప్రమాదానికి గురవుతున్నందున పోలీస్ పికెట్ ట్రాఫిక్ పోలీస్లను వీకెండ్ లో 20 నుండి 30 వేల భక్తులు రాకపోకలు ఉన్నందున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ప్రమాదం కలగకుండా చూడాలని ఎలక్షన్లో ఎక్కువలోనికి గురవుతున్న గ్రామాలలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని జిల్లాలో అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని రాత్రి వేళల్లో గ్రామాలలో దోపిడీకి గురవుతున్నందున పోలీసులను పెట్టాలని పలు విషయాలపై మాట్లాడిన తనంతరం డీసీపీ సార్ స్పందిస్తూ తప్పకుండా బైపాస్ వద్ద ట్రాఫిక్ పోలీసులను పెడతామని ఎలక్షన్ లోనికి గ్రామాల్లో కేంద్ర బలగాలతో కవాత్ ఏర్పాటు చేశామని దోపిడి దొంగలను పట్టుకుని ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూస్తాం అన్నారు DCP గారికి ధన్యవాదాలు తెలిపిన బీసీ విద్యార్థి సంఘం *ఈ సమావేశంలో యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుండెబోయిన సురేష్ యాదవ్ , బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కోటేశ్వరి, బిజెపి నాయకులు సురేష్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు గుండెబోయిన శంకర్,తదితరులు పాల్గొన్నారు.