NLG: రాములోరి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న నాంపల్లి జెడ్పిటిసి
నాంపల్లి: శ్రీరాముని ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలి అని జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం శ్రీ రామ నవమి సందర్భంగా పసునూరు గ్రామంలోని రామాలయంలో కళ్యాణ మహోత్సవంలో నాంపల్లి జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి రోజున ప్రతిఏటా వైభవోపేతంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటామని ఆయన అన్నారు. లోక కళ్యాణం కోసం ఎన్నోత్యాగాలను కోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనదని, రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదని తెలిపారు.
సీతారాముల ఆశీస్సులు ప్రజలకు ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని సీతారామచంద్రమూర్తులను ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు.




తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు నల్లగొండ జిల్లా ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శ్రీరామచంద్రుడు ధర్మసంస్థాపన, విలువల ప్రతిష్టాపన, పితృవాక్యపరిపాలన వంటి గొప్ప సద్గుణాలను సమాజానికి అందించారు. ఆ యుగపురుషుడు నడిచిన బాటలో నడిచి సంక్షేమ రాజ్యస్థాపనలో, విలువలు కలిగిన సమాజ నిర్మాణంలో భాగం అవుదాం అని అన్నారు.




Apr 17 2024, 19:17
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
54.8k