/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: దేవాలయ నిర్మాణానికి మాజీ ఎంపీపీ విరాళం Mane Praveen
NLG: దేవాలయ నిర్మాణానికి మాజీ ఎంపీపీ విరాళం

 

మర్రిగూడెం మండలం వట్టిపల్లి గ్రామంలో ఏకశిల పై వెలిసిన శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి, మర్రిగూడ మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్ రూ. 50 వేలు విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ సిరిసవాడ బిక్షం, ఉపాధ్యక్షులు మల్గిరెడ్డి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కొంపల్లి నాగరాజు గౌడ్, కోశాధికారి ఎడ్ల కాశయ్య, కార్యవర్గ సభ్యులు సత్యనారి, రమేష్, సత్తయ్య, మల్లేష్ ఉన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ: పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవ్వాల ఉదయం ఆకస్మికంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.రోగులకు అందుతున్న వైద్యసేవలు, ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.డాక్టర్ల హాజరు పట్టిక,ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషేంట్ల వివరాలను పరిశీలించారు.

హాస్పిటల్ లో లిఫ్ట్ పనిచేయకపోవడంపై సిబ్బందిని మంత్రి ప్రశ్నించగా..లిఫ్ట్ రిపేర్ అయ్యిందని..రిపేర్ చేయడానికి 10 రోజుల సమయం పడుతుందన్న సిబ్బంది సమాధానంపై మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ప్రసవం కోసం వచ్చే బాలింతలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని..బాలింతలు,పసిపాపలు ఉండే హాస్పిటల్ లో లిఫ్ట్ రిపేర్ కు పది రోజుల సమయం పడితే పేషేంట్ల పరిస్థితి ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..

అలాగే హాస్పిటల్ ఆవరణంలో పేషేంట్లు,వారి అటెండెంట్లు పడుతున్న ఇబ్బందులను చూసిన మంత్రి వెంటనే స్పందించి సకల సౌకర్యాలతో అందరికి అనువుగా ఉండేలా భవన నిర్మాణం చేయాలని,వైద్య ఆరోగ్యశాఖ, ఆర్అండ్ బీ అధికారులకు అప్పటికప్పుడే ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు.భవన నిర్మాణం నెలరోజుల్లోనే పూర్తిచేసేలా యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.తాను రెండు రోజులకు ఒకసారి భవన నిర్మాణ స్థితిగతులను పరిశీలిస్తానని అధికారులకు తెలిపారు.భవన నిర్మాణానికి కావాల్సిన అనుమతులను తాను ఇస్తానని చెప్పారు.హాస్పిటల్ మొత్తం కలియతిరిగిన మంత్రి..రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు.

పలుచోట్ల పారిశుద్య నిర్వాహణ లోపాలపై హాస్పిటల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ వస్తానని వచ్చే వరకు అన్ని సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు తేల్చిచెప్పారు.

NLG: శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు నల్లగొండ జిల్లా ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శ్రీరామచంద్రుడు ధర్మసంస్థాపన, విలువల ప్రతిష్టాపన, పితృవాక్యపరిపాలన వంటి గొప్ప సద్గుణాలను సమాజానికి అందించారు. ఆ యుగపురుషుడు నడిచిన బాటలో నడిచి సంక్షేమ రాజ్యస్థాపనలో, విలువలు కలిగిన సమాజ నిర్మాణంలో భాగం అవుదాం అని అన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: నల్గొండలో ప్రతీ విద్యార్ధి ని ప్రయోజకున్ని చేయడమే నా లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా, ఈ నెల 5 నుంచి అందిస్తున్న ఎప్ సెట్ పరీక్షల కోచింగ్ సెంటర్ ను కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఛైర్మన్ గా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం సందర్శించారు. 

ఈ కార్యక్రమంలో విద్యార్ధులతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నల్గొండలో చదువుకోవాలనుకునే ప్రతీ విద్యార్ధికి అండగా ఉంటానని.. చదువును నిర్లక్ష్యం చేయకుండా ప్రతీ విద్యార్ధి కష్టపడి చదువుకొని పైకి రావాలని ఆకాంక్షించారు. ఇప్పటికే జిల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే పనులు ప్రారంభిస్తామని విద్యార్ధులకు తెలియజేశారు.

కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న ఈ కోచింగ్ కేంద్రంలో జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్న విద్యార్ధిని, విద్యార్ధులకు ఉచితంగా ఎప్ సెట్ కోచింగ్ అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఒక్క కోచింగ్ మాత్రమే కాకుండా ఉచిత హాస్టల్, భోజన వసతి మరియు ఉచిత స్టడీ మెటీరియల్ ను కూడా అందిస్తున్నామని ఆయన వివరించారు. విద్యార్ధులకు కోచింగ్ ఇవ్వడమే కాదు.. రోజువారీ పరీక్షలు, వారంతపు పరీక్షలు, గ్రాండ్ టెస్ట్ లు నిర్వహిస్తూ విద్యార్ధులను ఎప్ సెట్ కు సిద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు.

కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఛైర్మన్ గా శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. 300 మంది విద్యార్ధులకు ఉచిత స్టడీ మెటీరియల్ ను అందించారు. అనంతరం విద్యార్ధిని, విద్యార్ధులతో సమావేశమై వారికి అందుతున్న సౌకర్యాలు, శిక్షణ గురించి విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధుల నుంచి సానుకూల స్పందన రావడంతో కోచింగ్ సిబ్బందిని అభినందించారు. 

విద్యార్ధులందరూ కష్టపడి చదువుకొని మంచి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు, గురువులకు మరియు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ కు పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్తులో విద్యార్ధులకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నుంచి మరిన్ని పరీక్షల శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి విద్యార్ధుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పులు జరిపిన షూటర్లు అరెస్ట్*

గుజరాత్‌లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్

విచారణ కోసం ముంబైకి తరలిస్తామని చెప్పిన అధికారులు

ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని భుజ్‌లో సోమవారం అర్ధరాత్రి వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు ధృవీకరించారు. కాల్పుల అనంతరం ముంబై నుంచి గుజరాత్ పారిపోయారని పోలీసులు అధికారులు వివరించారు. విచారణ కోసం వీరిని ముంబైకి తీసుకొస్తామని తెలిపారు.

కాగా ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల ఘటన జరిగింది. సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. మోటారుసైకిల్‌పై వచ్చిన నిందితులు హెల్మెట్‌లు ధరించారు. పక్కా ప్రణాళికతో నాలుగు రౌండ్ల కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. సల్మాన్‌ ఖాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సల్మాన్ ఖాన్‌కు భద్రతను పెంచాలని ముంబై పోలీస్ కమిషనర్‌తో సూచించారు.

...

...

NLG: ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న గోలి మధుసూదన్ రెడ్డి

నల్లగొండ పట్టణంలో 18, 19 వార్డులో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం కోరుతూ, మంగళవారం బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయం, నల్లగొండలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని, ప్రతి కార్యకర్త గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు.

..

..

..

ఇందుర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సిపిఎం మండల కార్యదర్శి

మర్రిగూడ: మండలం ఇందుర్తి గ్రామంలో మంగళవారం భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మహిళలను కలిసి ఓటు వేయాలని కోరారు. యాదయ్య మాట్లాడుతూ.. ప్రజల కోసం కార్మికుల కోసం పోరాటం చేసే వ్యక్తిని పార్లమెంట్ కు పంపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో పగిళ్ల మల్లేష్, గౌస్య బేగం, పగిళ్ల మట్టమ్మ, లప్పంగి సులోచన, తదితరులు పాల్గొన్నారు

..

...

...

NLG: ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న ఎరెడ్ల రఘుపతి రెడ్డి

నాంపల్లి: మండలంలోని రేవల్లి గ్రామంలో అనారోగ్యంతో నిరుపేద కుటుంబానికి చెందిన కార్యకర్త రేవెల్లి వెంకులు మరణించడంతో, ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి, సాధారణ ఖర్చుల కొరకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేసి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి తెలిపి వారి ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పూల వెంకటయ్య, పెద్దిరెడ్డి సంజీవరెడ్డి, తుమ్మలపల్లి చంద్రారెడ్డి బట్టు శ్రీను, తుమ్మలపల్లి లింగారెడ్డి, కోన్ రెడ్డి యాదయ్య, కోన్ రెడ్డి వెంకటయ్య, బట్టు జగన్, మేకల కొండల్, గ్రామ శాఖ బట్టు శ్రీశైలం, మేకల రాములు, తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

NLG: కస్తూరిభా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుక

నాంపల్లి: మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో, ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్133 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ విజయశ్రీ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, కుల నిర్మూలన కోసం ఎంత కృషి చేశాడని, అతను స్వాతంత్ర భారతదేశం మొట్టమొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రిని, రాజ్యాంగ శిల్పి అలాంటి గొప్ప మహనీయుల జయంతి వర్ధంతులను చేసుకోవాలని, వారి ఆశయ సాధనకై యువత ఎప్పుడు ముందుండాలని ఆమె అన్నారు.

అదేవిధంగా కేతపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి గ్రామ మాజీ సర్పంచ్ కోరే యాదయ్య, కాశీమల జంగయ్య, వడ్లకొండ రమేష్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి గ్రామ ప్రజలకు ఆయన సేవలు చేసిన గురించి తెలియజేశారు.

NLG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పూల వెంకటయ్య

నాంపల్లి: మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పూల వెంకటయ్య, ఆదివారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సిఎం రేవంత్ రెడ్డిని శాలువ తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.