సొంతగూటికి చేరిన ఎంపీటీసీ సామ రామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఉప్పల్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ముద్దాపురం కు చెందిన మాజీ సర్పంచ్ ఉప్పల్ రెడ్డి,
వేములకొండ ఎంపిటిసి సామ రాం రెడ్డి అసంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ లో చేరారు. మంగళవారం తిరిగి తన అనుచర గనంతో భారీ సంఖ్యలో భువనగిరిలో నిర్వహించిన పార్లమెంట్ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన సుమారుగా 200 మందితో భువనగిరి డాల్ఫిన్ హోటల్లో స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నూతి రమేష్, జడ్పిటిసి వాకిటి పద్మా అనంత రెడ్డి, పాశం సతి రెడ్డి, కేశిరెడ్డి నీరజారెడ్డి,పల్లెర్ల సుధాకర్, పులిపలుపుల రాములు, వెంకట్ రెడ్డి, సామ చంద్రారెడ్డి, సూదిని నర్సింహా, సామ వెంకట్ రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.
Apr 16 2024, 20:34