భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు కారణమైన ప్రిన్సిపాల్ , కేర్ టేకర్ లను సస్పెండ్ చేయాలి:AISF
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా లో ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో గత రెండు రోజులుగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ జరిగి విపరీతమైన వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు అని విద్యార్థుల కు ఫుడ్ పాయిజన్ అయిన విషయాన్ని సంబంధిత ప్రిన్సిపల్ గోప్యంగా ఉంచి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు
గత రెండు రోజులుగా భువనగిరి జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ లో ఏడుగురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురై చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలిసిందని ఒక విద్యార్థికి విషమంగా ఉండడంతో నీలోఫర్ హాస్పిటల్ కి తరలించారని పరిస్థితి ఇంత విషమంగా ఉన్నప్పటికీ సంబంధిత ప్రిన్సిపాల్, రీజనల్ కోఆర్డినేటర్ తో మాట్లాడడానికి ప్రయత్నం చేసిన ప్రిన్సిపాల్ గారు ఫోను స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగిందని, ఆర్ సి ఓ గారు తో మాట్లాడుతూ గత సంవత్సరం మన యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ మండల కేంద్రంలో కూడా 20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేస్తూ ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మరియు ఫుడ్ పాయిజన్ కారణమైన కేర్ టేకర్ ని సస్పెండ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్ )గా డిమాండ్ చేస్తు మాట్లాడడం జరిగింది
నిత్యం గురుకుల పాఠశాలల్లో సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ గురై విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఇకనైనా జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్లో గురుకుల పాఠశాల లపైన సంబంధిత అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేయడం జరుగుతుంది లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు రాష్ట్ర రకాలు చేస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు.







యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. ఆత్మకూరు మండల కేంద్రంలో చైన్ స్నాచర్స్ శుక్రవారం రాత్రి ఓల్డ్ సిటీ లో డాబా పై నిద్రిస్తుండగా, మేకపోతుల స్వామి (హెడ్ కానిస్టేబుల్) భార్య నర్మద పై ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడు మరియు మూడు తులాల నల్లపూసల దండ ఎత్తుకెళ్లినట్లు బాధిత కుటుంబంలో సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలంలో బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఏసీపీ మధుసూదన్ రెడ్డి. ఇటీవల భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామంలో ఇంటి ఆవరణలో బయట నిద్రిస్తున్న మహిళల మెడలో నుంచి నాలుగు తులాల పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న గొలుసు దొంగలు.




Apr 13 2024, 18:30
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.7k