ఈనెల 21న ఆలేరు లో ఉమ్మడి నల్గొండ జిల్లా పురుషుల ఫుట్బాల్ జట్టు ఎంపిక
నల్లగొండ: ఈనెల 27 నుండి 30 తేదీ వరకు కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో 10 వ రాష్ట్రస్థాయి పురుషుల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించనున్నారు.
దానికి అనుగుణంగా ఈనెల 21 న ఆదివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పురుషుల ఫుట్బాల్ జట్టు ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తున్నామని, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సెలక్షన్ ప్రక్రియలో పాల్గొనదలచిన ఉమ్మడి జిల్లాకు చెందిన ఫుట్బాల్ క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఒరిజినల్ ఆధార్ కార్డుతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు జాయింట్ సెక్రెటరీ గడసంతుల మధుసూదన్ (సెల్ నెంబర్ 90009-89671) మరియు అసిస్టెంట్ సెక్రటరీ మద్ది కర్ణాకర్ (సెల్ నెంబర్ 94925-72900) లను సంప్రదించాలని సూచించారు.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
Download Streetbuzz news app











Apr 13 2024, 18:03
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.9k