రాజ్యాంగం కల్పించిన హక్కులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలి : ఏ ప్రదీప్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి
![]()
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం లోని హక్కులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని రామన్నపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ. ప్రదీప్ కోరారు. శనివారం మండల పరిధిలోని జనంపల్లి లోని తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాల/కళాశాల లో జరిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మొదట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు బాలికలకు చదవుకునే అవకాశం లేదని , స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగం లో కల్పించిన ప్రాథమిక హక్కుల ప్రకారం ప్రతి భారతీయుడు చదువుకునే అవకాశం కల్పించారని ఆయన తెలిపారు. ముఖ్యంగా బాలికలకు ఉచిత విద్య అందించాలని నిర్ణయించారని దానిని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బాలికలు చదువు తప్ప మరే ఆలోచన లేకుండా భవిష్యత్తును నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. నేటి విద్యార్థులు, యువత ఆన్ లైన్ లో అవసరం లేని వాటి జోలికి వెళ్ళి, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు.
విశిష్ట అతిథిగా విచ్చేసిన అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్. చందన మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే పుస్తకాలతో పాటు దేశ నాయకులు జీవిత చరిత్రను, కరెంట్ ఎఫైర్స్, జనరల్ నాలెడ్జ్ లాంటి పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పినట్లు కలలు కనండి, ఆ కాలంలోనే నిజం చేసుకోండని ఆమె విద్యార్థులను కోరారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం డి మజీద్, వైస్ ప్రెసిడెంట్ లింగయ్య, ప్యానల్ &రిటైనర్ న్యాయవాదులు మామిడి వెంకట్ రెడ్డి ,దంతూరి సత్తయ్య, డేవిడ్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యులు స్వామి, సీనియర్ న్యాయవాది జగతయ్య, బార్ అసోసియేషన్ కల్చరల్ కార్యదర్శి శ్రావణ్ కుమార్, పారా లీగల్ వాలంటీర్ కొడారి వెంకటేష్, పాఠశాల/కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ స్మిత మేడం, మండల న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది సాయిదీఫ్ , కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. ఆత్మకూరు మండల కేంద్రంలో చైన్ స్నాచర్స్ శుక్రవారం రాత్రి ఓల్డ్ సిటీ లో డాబా పై నిద్రిస్తుండగా, మేకపోతుల స్వామి (హెడ్ కానిస్టేబుల్) భార్య నర్మద పై ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడు మరియు మూడు తులాల నల్లపూసల దండ ఎత్తుకెళ్లినట్లు బాధిత కుటుంబంలో సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలంలో బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఏసీపీ మధుసూదన్ రెడ్డి. ఇటీవల భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామంలో ఇంటి ఆవరణలో బయట నిద్రిస్తున్న మహిళల మెడలో నుంచి నాలుగు తులాల పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న గొలుసు దొంగలు.




భారతీయ జనతా పార్టీ యువ మోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులుగా వలిగొండ మండలం కు చెందిన దంతూరి అరుణ్ కుమార్ ను నియమిస్తూ గురువారం భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రాంతంలో జరుగుతున్న యువత ,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టడం ద్వారా పార్టీని సంస్థాగతంగా పటిష్ట పరిచి విస్తరించడానికి కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ నియామకానికి సహకరించిన వలిగొండ మండల జిల్లా రాష్ట్ర నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
Apr 13 2024, 17:35
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.1k