NLG: డా.బిఆర్ అంబెడ్కర్, కామ్రేడ్ జార్జి రెడ్డి ఆశయాల సాదన కై ఏప్రిల్ 14 న మార్నింగ్ వాక్
నల్లగొండ: భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బిఆర్ అంబెడ్కర్ 143 వ జయంతి మరియు విప్లవ విద్యార్థి నాయకుడు, PDSU వ్యవస్థాపకుడు ఇండియన్ చేగువేరా, ఉస్మానియా అరుణతార జార్జిరెడ్డి 52 వ వర్ధంతి సందర్భంగా వారి ఆశయాల సాధనకై ఏప్రిల్ 14 న ఉదయం 6 గంటలకు ఎన్. జి కాలేజ్ నుండి గడియారం సెంటర్ వరకు మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. ఈ కార్యక్రమంలో అంబెడ్కర్, జార్జిరెడ్డి అభిమానులు, PDSU పూర్వ విద్యార్థులు, ప్రగతిశీల మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని PDSU జిల్లా పూర్వ అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.
పన్నాల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో అస్పృశ్యత, అంటరానితనం, దోపిడీ, పీడన, అసమానతలను రూపుమాపేందుకు డా.బిఆర్ అంబెడ్కర్, కా.జార్జిరెడ్డి లు ఎంతో కృషి చేశారని అన్నారు.
పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, అనేక అవమానాలను, అణిచివేత లను ధిక్కరించి భారత జాతికి గొప్ప రాజ్యాంగాన్ని డా.బిఆర్ అంబెడ్కర్ అందించాడని అన్నారు.
కా. జార్జిరెడ్డి సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా విద్యార్థులను చైతన్యం చేసినాడని, యూనివర్సిటీ లో మతోన్మాద శక్తుల ఆగడాలకు అడ్డుకట్టవేశాడని పేర్కొన్నారు. ఇద్దరి మేధావుల జయంతి, వర్ధంతిలు ఒకేరోజు రావడం కాకతాలియం అయినప్పటికీ వారి ఇద్దరి లక్ష్యం ఒక్కటేనని దేశంలో కులం, మతం లేని సమ సమాజాన్ని ఆవిష్కరించాలని కలలు కన్నారని వారి ఆశయాల అమలు కై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
అందులో భాగంగానే ఏప్రిల్ 14న డా,,బి.ఆర్ అంబెడ్కర్, కా,,జార్జిరెడ్డి ల స్పూర్తితో నల్లగొండలోని ఎన్.జి కాలేజ్ నుండి గడియారం సెంటర్ వరకు జరిగే మార్నింగ్ వాక్ లో ప్రగతిశీల మేధావులు, అభిమానులు, PDSU మాజీ,తాజా విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
Apr 12 2024, 21:06