NLG: కార్యకర్త కుటుంబానికి అండగా మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ మండలం, నర్సింగ్ భట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అమరోజు స్వామి బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసి, అండగా ఉంటానని, వారి కుమారుడు కూతురు చదువుకోవడానికి పూర్తిగా సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఏదైనా అవసరం ఉంటే స్థానిక ఎంపిటిసి జాకీరా-తాజుద్దీన్ అందుబాటులో ఉంటారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కాసాని లింగస్వామి గౌడ్, బొమ్మగోని సత్యనారాయణ, బొమ్మగోని సైదులుగౌడ్, తిరుమల రాము, పుట్ట రాకేష్, బల్లెం ప్రవీణ్ కుమార్, సూరారపు నగేష్, రాపోలు రమేష్, వల్లకీర్తి సత్తయ్య, మర్రి సతీష్, మర్రి ఏడుకొండలు యాదవ్, కంభం మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
SB NEWS NLG








Apr 12 2024, 11:54
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.2k