మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ : ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
![]()
రంజాన్ పండుగ ను పురస్కరించుకుని ఆలేరు పట్టణంలోని ఈద్గ వద్ద ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.బీర్ల ఐలయ్య గారితో పాటు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అలాయి బలాయి తీసుకొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అన్నారు.ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో అల్లాహ్ ప్రజలందరి కష్టాల తొలగించి శాంతి సంపద ఆనందం ఆరోగ్యం శ్రేయస్సు ఇవ్వాలని కోరుకున్నారు.రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్ష క్రమశిక్షణతో చేసిన ప్రార్థనలు సమత మమత ను పెంచుతాయన్నారు..రంజాన్ పండుగ మనుషుల్లో మానవీయ విలువలను, పరస్పర ప్రేమానురాగాలను పెంపొందిస్తుందన్నారు.సమాజంలో సమానత్వం, సోదరభావాన్ని తెలియజేస్తుందన్నారు. రంజాన్ పండుగ ముఖ్యంగా దాన గుణాన్ని నేర్పుతుందన్నారు.మరోసారి ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.



గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ రోజు గూడూరు టోల్ గేట్ వద్ద చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి మాజి ఎంపీ & భువనగిరి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు.ఈ కార్యక్రమం లో వారితో పాటు భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ గారు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేష్ గారు, బి జె పి రాష్ట్ర కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి గారు, గూడూరు నారోత్తం రెడ్డి గారు, బి జె పి బీబీనగర్ మండల అధ్యక్షులు ఇంజమూరి ప్రభాకర్ గారు మాజి అధ్యక్షులు జంగా రెడ్డి గారు మరియు జిల్లా బి జె పి నాయకులు, మండల నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో బీఆరెస్ పార్టీని వీడి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన వలిగొండ మండలం సుంకిశాల గ్రామ నాయకులు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం అభివృద్ధి ప్రదాత, ప్రజాసేవ చేయాలని లక్ష్యంతో ముందడుగు వేసి ఇంద్రపాల నగరం గ్రామ సర్పంచిగా గత ఐదు సంవత్సరాలుగా పలు అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి, గ్రామాన్ని ప్రగతి పథంలో లో నడిపించి, రామన్నపేట ఎంపీపీ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రజా నాయకులు పూస బాల నరసింహ కి ఇంద్ర పాలనగరం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బందెల క్రిస్టఫర్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఇంద్రపాల నగరం గ్రామానికి వీరి చేసిన సేవలు సేవలు మరువలేమని అన్నారు

Apr 11 2024, 17:51
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.4k