NLG: వివక్ష లేని సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతి బా పూలే
నకిరేకల్: మహాత్మా జ్యోతి రావ్ పూలే జయంతి సందర్భంగా, శాసనసభ్యులు వేముల వీరేశం, పట్టణంలోని పన్నాల గూడెం క్యాంపు కార్యాలయం నందు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...
సామాజిక కార్యకర్తగా, సంఘ సంస్కర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన క్రాంతి కారుడు పూలే అని మహాత్మ పూలే సేవలను స్మరించుకున్నారు.
వివక్ష లేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతి బా పూలే అని కొనియాడారు.
సామాజిక కార్యకర్తగా, సంఘ సంస్కర్తగా, వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన దార్శనికుడు మహాత్మా జ్యోతి రావ్ గోవింద్ రావ్ పూలే.. దళిత, బహుజన జనోద్ధరణ కోసం జీవితకాలం పూలే చేసిన కృషి భారత సమాజంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేసిందన్నారు.
తన భార్య సావిత్రి బాయి పూలే కు విద్యాబుద్దులు నేర్పి, దేశంలో ప్రథమ ఉపాధ్యాయురాలిని చేసి స్త్రీ విద్యకు బాటలు వేసిన ఘనత పూలేకు దక్కుతుందన్నారు. పూలే ఆశయ సాధన దిశగా నిరంతరం కృషి చేయాలని పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో నకిరేకల్ మండల PACS చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్లు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు..
Apr 11 2024, 14:01