NLG: చత్రపతి శివాజీ ఫుట్బాల్ లీగ్స్ పోటీలకు.. ముఖ్యఅతిథిగా వన్ టౌన్ సిఐ సత్యనారాయణ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో క్రీడాకారులలో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా గత 8 వారాల నుండి ప్రతి ఆదివారం నాడు నిర్వహిస్తున్న CSL ఫుట్బాల్ లీగ్ పోటీలలో, ఈరోజు నిర్వహించిన మ్యాచ్ లో KV ఫుట్బాల్ క్లబ్, CSFC ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన మ్యాచ్ జరగగా 2-0 స్కోర్ తో CSFC ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్టు విజయం సాధించింది.
ఈ సందర్భంగా క్రీడాకారులకు TRMS రాష్ట్ర అధ్యక్షులు లోకన బోయిన రమణముదిరాజ్ అరటిపండ్ల ను పంపిణీ చేసి క్రీడాకారులను ప్రోత్సహించారు. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు.
విద్యార్థుల్లో స్పోర్ట్స్ కల్చర్ ని డెవలప్మెంట్ చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నామని, రాబోయే రోజుల్లో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్పోర్ట్స్ కల్చర్ ని డెవలప్మెంట్ చేస్తూ గ్రామీణ క్రీడాకారులని వెలుగులోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందని వారు తెలిపారు.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన వన్ టౌన్ CI సత్యనారాయణ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అని దానిని ప్రతి ఒక్కరూ పాటిస్తూ శారీరకంగా దారుఢ్యం కొరకు, ప్రతిరోజు ఎక్సర్సైజులు చేయాలని తద్వారా మానసికంగా బలోపేతం కావచ్చునని తెలియజేస్తూ, పిల్లలు సెల్ ఫోన్లకు, వీడియో గేమ్స్ కు అలవాటు కాకుండా తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ, తమ తమ పిల్లల్ని మైదానాలకు తీసుకెళ్లి ఏదో ఒక క్రీడలో రాణించే విధంగా కృషి చేస్తే ఎంతో ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు.
గౌరవ అతిధి TRMS రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజ్ మాట్లాడుతూ.. క్రీడాకారులను తయారు చేయడం, దానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం, నిరంతరం క్రమం తప్పకుండా సాధన చేయించడం, సాధనకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం, SRM మద్రాస్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన ఫుట్బాల్ కోచ్ ను ఏర్పాటు చేయడం, ఇదంతా సేవా దృక్పథంతో ముందరికి వెళ్తున్న చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ సేవలు అభినందనీయమని తెలియజేశారు. తనవంతుగా క్రీడాకారులకు ఈరోజు అరటిపండ్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో MCC-9 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఫౌండర్ పాముల అశోక్, ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, అంబటి ప్రణీత్ , సత్యం, గణేష్ సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు రాచూరి వెంకట్ సాయి, కొక్కు యశ్వంత్, దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.
Apr 07 2024, 22:00