/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: గిరిజన మోర్చా అధికార ప్రతినిధిగా చందు నాయక్ Mane Praveen
NLG: గిరిజన మోర్చా అధికార ప్రతినిధిగా చందు నాయక్

నల్గొండ జిల్లా బీజేపి గిరిజన మోర్చా అధికార ప్రతినిధిగా కొండమల్లేపల్లి మండలం కొర్ర తండాకు చెందిన చందు నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అప్పగించిన బాధ్యత లను క్రమశిక్షణతో నిర్వహిస్తానని, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.

SB NEWS NATIONAL MEDIA

NLG: బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులుగా పొలగోని గణేష్

నల్లగొండ జిల్లా భారతీయ జనతా యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, దేవరకొండ పట్టణానికి చెందిన పొలగోని గణేష్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు రాఖీ ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ.. బీజేవైఎం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన నాయకులందరికీ ధన్యవాదాలు అని తెలిపారు.

SB NEWS NATIONAL MEDIA

NLG: ఈనెల 5న శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కొరకు శంకుస్థాపన

నల్లగొండ పట్టణం రామగిరి శ్రీనివాస నగర్ కాలనీలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవస్థానం పునరుద్ధరణ కార్యక్రమాన్ని సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ పూజారులు జీర్ణోదరణ, కళాపకర్షణ చేయుటకు శుభ ముహూర్తం నిర్ణయించారు. ఈనెల 5వ తేదీన శుక్రవారం జీర్ణోదరణ, నూతన దేవాలయం నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమాలు చేయనున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు.

NLG: ఆలయ గోపురం నిర్మాణానికి విరాళం

గుర్రంపోడ్ మండలంలోని కొప్పోల్ గ్రామస్తులు కోట్ర బుచ్చిరాములు, చిన్న రాములు సోమవారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ గోపుర పునర్నిర్మాణానికి తమ వంతుగా రూ.10,016/- లు విరాళంగా అందజేశారు. అదేవిధంగా కొట్రసత్తయ్య రూ.5000/-, ఆర్ఎంపీ మల్లికార్జున రూ.10,116/-, చింతల మల్లయ్య రూ. 5000/- విరాళం అందించారు.

SB NEWS NATIONAL MEDIA

Mane Praveen

దేవరకొండ పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చెల్లించిన డబ్బులకు రసీదులు ఇవ్వడం లేదని పేషంట్ల సంబంధీకులు తెలిపారు. తమ పేషెంట్ ను అనారోగ్య రీతి హాస్పిటల్లో జాయిన్ చేసి సంబంధిత రుసుము చెల్లించినప్పుడు క

తెల్ల కాగితం మీద చేతిరాత తో రాసి బిల్లు లని ఇస్తున్నారు!
దేవరకొండ పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చెల్లించిన డబ్బులకు రసీదులు ఇవ్వడం లేదని పేషంట్ల సంబంధీకులు తెలిపారు. తమ పేషెంట్ ను అనారోగ్య రీతి హాస్పిటల్లో జాయిన్ చేసి సంబంధిత రుసుము చెల్లించినప్పుడు కంప్యూటర్ జనరేటర్ బిల్లులు ఇవ్వకుండా తెల్ల కాగితం మీద రాసి అనధికారిక బిల్లులు ఇస్తున్నట్లు ఆకులపల్లి లక్ష్మమ్మ పేషెంట్ సంబంధీకులు కత్తుల వెంకటేష్ ఆరోపించారు. అట్టి తెల్ల కాగితం బిల్లులు ఈఎస్ఐ వంటి వాటిలో రియంబర్స్మెంట్ కోసం పనికిరావని, ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని వ్యవస్థను సక్రమంగా నడిచేలా చూడాలని అన్నారు.
తెల్ల కాగితం మీద చేతిరాత తో రాసి బిల్లు లని ఇస్తున్నారు!
NLG: నల్లగొండ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులకు సన్మానం

నల్లగొండ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్షులు సిరిగిరి వెంకటరెడ్డి, కార్యదర్శి గిరి లింగయ్య, జాయింట్ సెక్రటరీ మామిడి ప్రమీల, కార్యవర్గ సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సిరిగిరి వెంకటరెడ్డి మరియు సభ్యులు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని కోర్టు న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులను పలువురు న్యాయవాదులు సన్మానించి, పుష్ప గుచ్చం అందజేసి అభినందించారు.

SB NEWS NATIONAL MEDIA

భవన నిర్మాణ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం

మునుగోడు: మండల కేంద్రంలోని సిపిఐ ఆఫీసులో, భవన నిర్మాణ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం ఏఐటీయూసీ మండల కార్యదర్శి బెల్లం శివయ్య అధ్యక్షతన జరిగింది. 

ఈ సమావేశం లో సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను పాల్గొని మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను.. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా రద్దు చేస్తూ నాలుగు కోడ్ లుగా విభజిస్తున్నారు. 

అందుకని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోవు పార్లమెంటు ఎలక్షన్ లో కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా తగిన బుద్ధి చెప్పాలని, అదేవిధంగా కార్మికులకు పని వద్ద ఎలాంటి ప్రమాదాలు జరిగినా ప్రమాద బీమా క్రింద 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, 50 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి నెలకు 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, మత్స్యకారులకు ఇచ్చినట్టుగా ప్రతి కార్మికునికి టు వీలర్ సైకిల్ మోటార్ వాహనాన్ని ఇవ్వాలని, గతంలో పెండింగులో వివిధ రకాల ఉన్న బిల్లులు, ఎక్స్గ్రేషియా ఇతర ఇతర పెండింగ్ బిల్లులు వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో నరసింహ, దొమ్మాటి గిరి, యాసరాని వెంకన్న, బొల్లు సైదులు, భీమనపల్లి స్వామి, డి. నగేష్, ఉప్పు రమణయ్య, వి.ఎంకన్న తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

NLG: మరోసారి మానవత్వం చాటుకున్న నాంపల్లి ZPTC ఎ.వి.రెడ్డి

నల్లగొండ జిల్లా:

నాంపల్లి మండలంలోని పసునూరు గ్రామానికి చెందిన భూతం అంజయ్య తల్లి భూతం లక్ష్మమ్మ మరణించిన విషయం మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్కే అబ్బాస్ ద్వారా విషయం తెలుసుకున్న నాంపల్లి జెడ్పిటిసి ఎవి రెడ్డి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం కల్పించారు. వారి కుటుంబానికి రూ.10,000/- ఆర్థిక సాయం అందించారు.

వారి వెంట పసునూరు మాజీ సర్పంచ్ ఎస్.రాములు,రాగి ఫణి ధనుంజయ చారి, ఎస్కే జానీ, జింకల నరేష్, ఉ

ప్పునూతల ఆంజనేయులు, రామస్వామి, శ్రీకాంత్,బాలమ్మ, మహిమూద్, ఆనంద్, కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

TS: స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించిన ఫుట్బాల్ క్రీడాకారున్ని అభినందించిన ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ టెక్నికల్ మెంబర్ జి.పి.ఫల్గుణ

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పోలీసు ఉద్యోగాలలో TSSP విభాగంలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు బొమ్మపాల సాయిచంద్ర సిద్ధార్థ్.. ఈ రోజు హైదరాబాద్ LB స్టేడియంలో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ టెక్నికల్ కమిటీ మెంబర్ అయిన జి.పి. ఫల్గుణ ను ప్రత్యేకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

ఈ సందర్భంగా జి.పి. ఫల్గుణ బొమ్మపాల సాయిచంద్ర సిద్ధార్థ ను ప్రత్యేకంగా అభినందించి స్వీట్స్ తినిపించారు.

అనంతరం G.P ఫల్గుణ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో రాణించిన ప్రతి క్రీడాకారుడు ఆటతో పాటు, చదువుల పట్ల కూడా దృష్టి సారిస్తే యుక్త వయసులోనే స్థిరపడి భవిష్యత్తులో అద్భుతమైన రీతిలో రాణించి భావితరాలకు మార్గదర్శకులుగా నిలుస్తారని సూచించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో అద్భుతమైన ఫుట్బాల్ క్రీడాకారులు ఉన్నారని వారిలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి, ప్రభుత్వం, అధికారులు, వివిధ సంస్థలు, సహాయ సహకారాలు అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు దక్కించుకుంటారని తెలిపారు.

SB NEWS NATIONAL MEDIA