TS: స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించిన ఫుట్బాల్ క్రీడాకారున్ని అభినందించిన ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ టెక్నికల్ మెంబర్ జి.పి.ఫల్గుణ
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పోలీసు ఉద్యోగాలలో TSSP విభాగంలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు బొమ్మపాల సాయిచంద్ర సిద్ధార్థ్.. ఈ రోజు హైదరాబాద్ LB స్టేడియంలో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ టెక్నికల్ కమిటీ మెంబర్ అయిన జి.పి. ఫల్గుణ ను ప్రత్యేకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
ఈ సందర్భంగా జి.పి. ఫల్గుణ బొమ్మపాల సాయిచంద్ర సిద్ధార్థ ను ప్రత్యేకంగా అభినందించి స్వీట్స్ తినిపించారు.
అనంతరం G.P ఫల్గుణ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో రాణించిన ప్రతి క్రీడాకారుడు ఆటతో పాటు, చదువుల పట్ల కూడా దృష్టి సారిస్తే యుక్త వయసులోనే స్థిరపడి భవిష్యత్తులో అద్భుతమైన రీతిలో రాణించి భావితరాలకు మార్గదర్శకులుగా నిలుస్తారని సూచించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో అద్భుతమైన ఫుట్బాల్ క్రీడాకారులు ఉన్నారని వారిలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి, ప్రభుత్వం, అధికారులు, వివిధ సంస్థలు, సహాయ సహకారాలు అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు దక్కించుకుంటారని తెలిపారు.
![]()
SB NEWS NATIONAL MEDIA
































Apr 01 2024, 11:23
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.9k