NLG: వరి పంట వేసిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
మర్రిగూడ మండలంలోని తిరుగండ్ల పల్లి, తమ్మడపల్లి, ఇందుర్తి గ్రామాలలో రైతు సంఘం సిపిఎం పార్టీ పంటల పరిశీలన బృందం, ఎండిపోయిన వరి పంట రైతులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం మాట్లాడుతూ.. వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి, బోరు బావులు ఎండి పోయినవి. వరి పంట వేసిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రామాల లోకి ప్రభుత్వ అధికారులు వెళ్లి వరి ఎండిపోయిన రైతులను గుర్తించి, ఎండిపోయిన వరికి ఎకరానికి 25 వేల రూపాయలు, ఇతర పంటలకు 30 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, బ్యాంకులలో ఉన్న అప్పులను మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మండల సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, రైతు సంఘం మండల నాయకులు కొట్టం యాదయ్య, చెల్లం ముత్యాలు, ఉప్పునూతల వెంకటయ్య, రైతులు పాల్గొన్నారు.
SB NEWS NATIONAL MEDIA
Apr 01 2024, 10:43