NLG: సిపిఎం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జయప్రదం చేయాలి: ఏర్పుల యాదయ్య

నల్లగొండ జిల్లా:
మునుగోడు నియోజకవర్గం సిపిఎం పార్టీ విస్తృతస్థాయి సమావేశం గట్టు శ్రీరాములు ఫంక్షన్ హాల్ చౌటుప్పల్ కేంద్రంలో, ఏప్రిల్ 2న ఉదయం 10 గంటలకు సమావేశం ఉన్నందున మర్రిగూడ మండల సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, సానుభూతిపరులు తప్పక సమయం పాటించి హాజరుకావాలని సిపిఎం పార్టీ మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా, మునుగోడు నియోజకవర్గ పరిధిలో 7 మండలాల విస్తృతస్థాయి సమావేశానికి హాజరై జయప్రదం చేయాలని కోరారు.

సిపిఎం పార్టీ అభ్యర్థి కామ్రేడ్ ఎం.డీ జాంగిర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని పార్టీ శ్రేణులకు మేధావులకు అభిమానులకు మీ పవిత్రమైన ఓటు వేసి పేద ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే పార్టీ సిపిఎం అని ఆయన గుర్తు చేశారు. కార్మికులకు కనీస వేతన చట్టం అమలు కోసం ఎర్రజెండా ను భుజాన వేసుకుని కార్మిక కర్షక శ్రామిక మహిళల కోసం రైతు గిట్టుబాటు ధర కోసం చట్టం చేయాలని పోరాటం చేసే అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, మండల కమిటీ సభ్యులు కొట్టం యాదయ్య, నారోజు అంజాచారి, గడగోటి వెంకటేష్, మైల సత్తయ్య, చెల్లం ముత్యాలు, నామ సైదులు, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS NATIONAL MEDIA
Mar 31 2024, 14:29