NLG: చత్రపతి శివాజీ(CSL )ఫుట్బాల్ లీగ్స్.. వేసవి కాలంలో మహిళ ఫుట్బాల్ లీగ్స్ పోటీల నిర్వహణ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో క్రీడాకారులలో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా గత 6 వారాల నుండి ప్రతి ఆదివారం నాడు నిర్వహిస్తున్న CSL ఫుట్బాల్ లీగ్ పోటీలలో ఈరోజు నిర్వహించిన మ్యాచ్ లో సూర్యాపేట ఫుట్బాల్ క్లబ్, మేకల స్టేడియం ఫుట్బాల్ క్లబ్ జట్ల మధ్యన మ్యాచ్ జరగగా 1-0 స్కోర్ తో అభినవ్ స్టేడియం జట్టు విజయం సాధించింది.
ఈ సందర్భంగా క్రీడాకారులకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాచూరి లక్ష్మిగణేష్ అరటిపండ్ల ను పంపిణీ చేసి క్రీడాకారులను ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని రాబోయే వేసవి కాలంలో 8 నుండి 10 సంవత్సరాలలోపు బాల బాలికలకు, సీనియర్ సిటిజన్స్ కు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, మరియు మహిళలకు ప్రత్యేకమైన ఫుట్బాల్ లీగ్ కాంపిటీషన్స్ నిర్వహించడానికి ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు
ఈరోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన MCC 9 కాంపిటీటివ్ ఇన్స్టిట్యూషన్ ఫౌండర్ పాముల అశోక్ మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో, గత 13 సంవత్సరాల నుంచి ఎంతోమంది కబడ్డీ, ఫుట్బాల్ జాతీయ స్థాయి క్రీడాకారులను తయారుచేసి తెలంగాణ రాష్ట్రానికి అందించి మన నల్లగొండ జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు సాధించే విధంగా కృషిచేసిందని తెలియజేస్తూ, క్రీడలు అంటేనే క్రమశిక్షణ, సమయపాలన, క్యారెక్టర్లతో కూడిన వ్యవహారమని దీనిని ప్రతి ఒక్క క్రీడాకారుడు పాటించి బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకొని, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని క్రీడాకారులకు సూచించారు.అనంతరం క్రీడాకారులకు అరటి పండ్లను పంపిణీ చేశారు.
ఫుట్బాల్ క్రీడాకారినులు మైనం వకుళ మరియు అప్పల సోనీ లు మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్లో మేము గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం సాధన చేస్తూ, రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొన్నాము. భవిష్యత్తులో కూడా కోచ్ లు చెప్పిన సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ మా యొక్క భవిష్యత్తు కు బాటలు ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, రాచూరి లక్ష్మీగణేష్, కత్తుల హరి,జాకటి బాలరాజు, అప్పల లింగయ్య, మురళి, తదితరులు పాల్గొన్నారు
Mar 27 2024, 19:18