TG: గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు ఉచితంగా ఇసుక
![]()
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఉచితంగా ఇసుక అందిస్తామని తెలిపింది.
ఇసుక కొరతతో లోకల్ గా నిర్మాణ పనులు ఆగిపోకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం గుర్తించిన రీచ్ ల నుంచి ఉచితంగా ఇసుక అందిస్తామని వెల్లడించింది. సరైన పత్రాలు చూపించిన వారికి స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణా కు అనుమతించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.
ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణా కు అనుమతి ఇవ్వాలంటూ వరుసగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అవసరమున్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల లలో ఉచితంగా ఇసుక రవాణా చేసుకునేందుకు అనుమతిస్తారు. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.




















నాంపల్లి: మండలంలోని తుంగపాడు గౌరారం గ్రామంలోని శ్రీ చలిదోన లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా, శుక్రవారం స్వామి వారి రథోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం ఆలయంలో పండితులు స్వామి వారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. అలంకరించిన ఉత్సవ విగ్రహాన్ని రథంపై ప్రతిష్టించి ఊరేగింపు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, గుట్ట పైకి పోవుటకు రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తానని, గుట్ట చుట్టూ డబల్ రోడ్డు వేయిస్తానని మండలాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని అన్నారు.
రథోత్సవంలో భక్తులు పోటాపోటీ పడి రధం లాగ గా మహిళలు రథం ముందు నీళ్లు ఆరబోసి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యపేట, గుంటూరు జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ చలిదోన లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్నారు.





Mar 24 2024, 19:51
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.4k