NLG: పెండింగులో ఉన్న వేతనాలు చెల్లించాలి, లేనిపక్షంలో నిరవధిక సమ్మె తప్పదు: AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి
నల్లగొండ: ఎన్ హెచ్ ఎం స్కీంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి పెండింగులో ఉన్న వేతనాలు మరియు 7 నెలల పిఆర్సి ఏరియర్స్ వెంటనే చెల్లించాలి, లేనిపక్షంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ కార్యాలయంలో సూపరిండెంట్ మంజులత కు సమ్మె నోటీసు ఇచ్చారు.
ఈ సందర్భంగా AITUC ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత రెండు నెలల వేతనాలు మరియు పిఆర్సి ఏరియర్స్, ఏడు నెలల డబ్బులు చెల్లించాలని అనేక రోజుల నుంచి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఈ నెల 22వ తేదీ లోపు వేతనాలు ఏరియర్స్ బకాయిలు చెల్లించకుంటే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని చెప్పారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల నిధులను వెంటనే ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతోనే కార్మికులకు వేతనాలు అందించడం లేదని అన్నారు.
ఎన్హెచ్ఎం స్కీంలో దాదాపు ఆల్ క్యాడర్స్ 2వ ఎఎన్ఎంలు, ఆర్బీఎస్కె డాక్టర్లు, ఎం.ఎల్.హెచ్.పిలు, అర్బన్ హెల్త్ సెంటర్ సి.ఓ., అకౌంటెంట్, ఎంఎన్ఏ, వాచ్మెన్ మరియు స్వీపర్, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నిషియన్, స్టాఫ్ నర్సు, సపోర్టింగ్ స్టాఫ్, డిఇఓ, కాంటిజెంట్ వర్కర్స్, లాంటి దాదాపు 78 క్యాడర్లలలో సుమారు 17,514 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో గత అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని, ఈ ఉద్యోగులు నిత్యం క్రింది స్థాయి ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ అనేక ప్రాంతాల నుండి విధులకు హాజరవుతుంటారని అన్నారు.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరు పేద, మధ్య తరగతి చెందినవారు. ప్రతినెలా 1వ తేదీన జీతం అందితే తప్ప వారి కుటుంబాలు నడవని పరిస్థితి లేదు. గత 2 నెలలుగా జీతాలు అందకపోవటంతో కార్మికుల పరిస్థితి దయానీయంగా ఉన్నదని, ఇంటి కిరాయిలు, పిల్లల ఫీజులు, కుటుంబ పోషణ కష్టంగా మారిందని, ఇట్టి విషయమై గతంలో అనేక సందర్భాలు జిల్లా స్థాయి అధికారులకు వినతులు ఇవ్వటం జరిగింది. కానీ నేటి వరకు ఒక్క నెల జీతాలు మాత్రమే చెల్లించారని అన్నారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగులకు పిఆర్సి విడుదలైన సందర్భంగా ఇవ్వవల్సిన 7 నెలల ఏరియర్స్ సైతం నేటికి కూడా చెల్లించలేదు. కావున ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి ఎన్హెహెచ్ఎం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 1వ తేదీన జీతాలు అందే విధంగా తగు చర్యలు తీసుకోవటం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించటానికి అవకాశం ఉంటుంది.తక్షణం జీతాలు చెల్లించనిచో సమ్మె తప్పదని అన్నారు.
ఈ కార్యక్రమంలో 2వ ANM యూనియన్ జిల్లా నాయకులు రాయల గీతా రాణి, చిత్రం సరిత, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.
.
Mar 23 2024, 13:33