NLG: మొక్కలు నాటిన NSS విద్యార్థులు
నల్లగొండ జిల్లా, నకిరేకల్ ప్రభుత్వం డిగ్రీ కళాశాల NSS యూనిట్ 1 ఆధ్వర్యంలో, ఈరోజు చందంపల్లి గ్రామంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా NG కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ దుర్గా ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉన్నత విద్య, ఆర్యోగం, ఉద్యోగ అవకాశాలు, పోటీ పరీక్షలకు ఎలా రాయాలి అనే స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. అదేవిదంగా ఉచిత పుస్తకాలు పంపిణి చేశారు.
ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి సమాజంలో తమ చదువుతో పాటు స్వచ్ఛమైన పరిసరాలు, చెట్టు పరిరక్షణ గురించి ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రిన్సిపాల్ తెలియజేసారు.
వైస్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, NSS ప్రోగ్రాం ఆఫీసర్ హబీబ్, Dr. శేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ హరిత, G.శంకర్, సురేందర్, సురేష్ గౌడ్, జానయ్య, శ్రీను, ఉపేందర్, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు.
Mar 21 2024, 21:17