NLG: ప్రవస్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం
నల్లగొండ: ప్రవస్తిక ఫౌండేషన్ చైర్మన్ బండారు కవిత గిరిధర్ ఆధ్వర్యంలో, పట్టణంలో మంగళవారం కీ.శే. ప్రవస్తిక ప్రథమ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్దులకు ఆహారపు ప్యాకెట్లు అందజేశారు.
ప్రవస్తిక ఫౌండేషన్ చైర్మన్ కవిత గిరిధర్ మాట్లాడుతూ.. తమ కుమార్తె ప్రవస్తిక, గత సంవత్సరం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఉండగా, గత సం. మార్చి 19న అనారోగ్య కారణంగా ఆకస్మికంగా మరణించింది. ప్రవస్తిక జ్ఞాపకార్థం ఆమె పేరు మీద ప్రవస్తిక ఫౌండేషన్ స్థాపించి, తమ సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, చిట్టితల్లి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నామని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలో తమ కూతుర్ని చూసుకుంటున్నామని తెలిపారు.





















Mar 21 2024, 07:27
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.0k