NLG: ప్రతి ఆదివారం చత్రపతి శివాజీ (CSL) ఫుట్బాల్ లీగ్స్
నల్లగొండ టౌన్:
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో క్రీడాకారులలో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా గత 5 వారాల నుండి ప్రతి ఆదివారం నాడు నిర్వహిస్తున్న CSL ఫుట్బాల్ లీగ్ పోటీలలో ఈరోజు నిర్వహించిన మ్యాచ్ లో కేంద్రీయ విద్యాలయం ఫుట్బాల్ టీం మరియు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల ఫుట్బాల్ అకాడమీ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. రెండు జట్లు 1-1 స్కోర్ తో సమవుజ్జిగా నిలిచి మ్యాచ్ డ్రా చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా క్రీడాకారులకు ప్రభుత్వ టీచర్ కురుమిళ్ళ భూపతి సుధాకర్ అరటిపండ్ల ను పంపిణీ చేసి క్రీడాకారులను ప్రోత్సహించారు.
తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని ఇది నిరంతరం సాగుతుందని తెలియజేస్తూ, సీనియర్ క్రీడాకారులలో క్రీడా నైపుణ్యాన్ని మరియు మ్యాచ్ స్థితిగతులని అవగాహన చేసుకోవడానికి ఈ యొక్క లీగ్ కాంపిటీషన్స్ ఎంతో ఉపయోగపడతాయని, మరియు గ్రాస్ రూట్ లో తయారవుతున్న క్రీడాకారులకు ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు స్ట్రెంత్, ఎజిలిటీ, ప్లెక్సీబులిటీ, స్పీడ్ పెంపొందించడానికి వివిధ రకాల కార్యక్రమాలను రూపొందించి ఉదయం పూట నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ రోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టైక్వాండో కోచ్ అంబటి ప్రణీత్ మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత దశాబ్ద కాలంగా, ఈ క్రీడా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నారని, ఈ ఫుట్బాల్ లీగ్ పోటీలను ఉపయోగించుకొని మంచి క్రీడాకారులుగా తయారై జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయ్యే విధంగా ప్రతి ఒక్క క్రీడాకారుడు తమ కార్యాచరణను ఏర్పాటు చేసుకోవాలని క్రీడాకారులకు సూచిస్తూ అరటి పండ్లను పంపిణీ చేశారు.
ఫ్రూట్స్ స్పాన్సర్ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కురుమిళ్ళ భూపతి సుధాకర్ మాట్లాడుతూ.. గత 2 సంవత్సరాలుగా మా యొక్క ముగ్గురు పిల్లలని చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ లో చేర్పించామని, వారు ఇప్పుడు అద్భుతమైన ఫిజికల్ ఫిట్నెస్ ను పెంపొందించుకున్నారని, చదువులలో కూడా రాణిస్తూ, రాష్ట్రస్థాయి ఫుట్బాల్ క్రీడాకారులుగా తయారవుతున్నారని తెలియజేస్తూ, దీనికి సహకరిస్తున్న బొమ్మపాల గిరిబాబు మరియు క్లబ్ హెడ్ కోచ్ మద్ది కరుణాకర్ లకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గురుకుల ఫుట్బాల్ అకాడమీ కోచ్ లింగయ్య నాయక్, కత్తుల హరి, జాకటి బాలరాజు, అప్పల లింగయ్య, యావర్, మురళి, సైదులు తదితరులు పాల్గొన్నారు
Mar 17 2024, 17:10