NLG: రూ. 67 కోట్ల ఆర్ అండ్ బి రహదారి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
నల్లగొండ జిల్లా:
నార్కట్ పల్లి మండలం, బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో సుమారు రూ. 67 కోట్ల విలువచేసే ఆర్ అండ్ బి రహదారుల పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. గ్రామానికి చెందిన చంద్రమ్మ అనే పేద మహిళకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. రాబోయే వానకాలం నాటికి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కింద అన్ని కాలువలకు నీరు అందిస్తామని తెలిపారు.
తెలంగాణలో పేదలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, సబ్సిడీ ఎల్పిజి కనెక్షన్, సొంత స్థలం ఉన్చ వారికి 5 లక్షల రూపాయ లతో ఇందిర ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని, మహాలక్ష్మి పథకం కింద పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, చిట్యాల మున్సిపల్ చైర్మన్ వెంకట్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డిఓ రవి, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Mar 15 2024, 21:02