NLG: దేవరకొండలో ఘనంగా ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ 97 వ ఆవిర్భావ దినోత్సవం
భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను ప్రతి పౌరుడు కి అందేవిధంగా సామాజిక పోరాటానికి, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ సారధులు సంసిద్ధులు కావాలని సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చిన దళిత రత్న బురి వెంకన్న, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ.
నల్లగొండ జిల్లా, దేవరకొండ:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ 97వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు, నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ప్రపంచ మేధావి ,రాజ్యాంగ నిర్మాత, న్యాయకోవిదుడు, ప్రజాస్వామ్యవాది, స్త్రీల హక్కుల పరిరక్షకుడు, సామాజికవేత, తత్వవేత్త, ఆర్థికవేత్త , సామాజిక పోరాట విప్లవ జ్యోతి అంబేద్కర్ ను స్మరిస్తూ ఆయన విగ్రహానికి పూలమాల వేసి, సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి దళితరత్న బుర్రి వెంకన్న, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మార్చి 13, 1927 న ఈ యొక్క సంస్థను స్థాపించినారని తెలిపారు. నేటితో 97 వసంతాలు పూర్తి చేసుకున్నాయని అన్నారు.
ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ స్థాపించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహద్ చెరువు పోరాటం మరియు దేవాలయంలోకి ప్రవేశించుట, మానవులంతా సమానమే, అందరికీ స్వేచ్ఛ సమానత్వం కోసం ఈ సంస్థ ద్వారా మహోన్నతమైన ఉద్యమాలు కు శ్రీకారం చుట్టారని, వారి యొక్క సేవలు మరువలేనివని ఆయన గుర్తు చేశారు.
జిల్లా ఉపాధ్యక్షులు బరపటి వెంకటయ్య మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుండి మండల, జిల్లా స్థాయిలో సంస్థ పూర్తి బలోపేతం కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా సలహాదారుడు అడ్వకేట్ నక్క వెంకటేష్, ఏకుల అంబేడ్కర్ పానుగంటి శ్రీకాంత్, భూతం రవి, పీఏ పల్లి మండల కన్వీనర్ జిల్లా రాములు, డివిజన్ కార్యదర్శి ఇరిగి లింగయ్య, బుడిగ గిరి తదితరులు పాల్గొన్నారు.
Mar 14 2024, 13:23