NLG: లీగ్ పోటీలను క్రీడాకారులందరూ వినియోగించుకోవాలి: Sk రహీం
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫుట్బాల్ క్రీడాకారుల అభివృద్ధి కొరకు క్రీడాకారులను వెలికి తీసే పనిలో భాగంగా, మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం CSL ఫుట్బాల్ లీగ్స్ నిర్వహిస్తున్నామని తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ పాల గిరిబాబు తెలిపారు.
ఈ లీగ్స్ పోటీలలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి 70 మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఇది క్లబ్ హెడ్ కోచ్ మద్ది కరుణాకర్ సారధ్యంలో ప్రతి ఆదివారం కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్ దగ్గుపాటి విమల క్రీడాకారులకు అరటి పండ్లను స్పాన్సర్ చేశారు. ఈ లీగ్స్ పోటీల కార్యక్రమానికి ఫ్రీడమ్ క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు SK రహీం ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రీడాకారులకు అరటి పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రహీం మాట్లాడుతూ.. ఫుట్బాల్ క్రీడాకారులని ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెలికి తీసే కార్యక్రమంలో భాగంగా ఫుట్బాల్ లీగ్ పోటీలను నిర్వహించడం ఎంతో గర్వకారణం అని దీనిని క్రీడాకారులందరూ ఉపయోగించుకొని, వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలని తెలిపారు.
క్లబ్ హెడ్ కోచ్ మద్ది కరుణాకర్ మాట్లాడుతూ.. ఈ లీగ్స్ కాంపిటీషన్స్ ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహిస్తున్నామని, ఈ లీగ్స్ లో పాల్గొన్న క్రీడాకారులు ఎంతో నైపుణ్యంతో, మెలకువలు నేర్చుకొని ఫుట్బాల్ క్రీడలో రాటుదేరుతున్నారని, ఇది రాబోయే రోజులలో జాతీయస్థాయిలో రాణించడానికి ఎంతో ఉపయోగపడుతుందని, మారుమూల గ్రామ ఫుట్బాల్ క్రీడాకారులు కూడా ఈ పోటీల్లో పాల్గొనటానికి ముందుకు రావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యావర్, గణేష్, శ్రవణ్, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.
Mar 10 2024, 18:44