NLG: "నిత్య జీవితంలో గణిత శాస్త్రం ప్రాధాన్యత" పై సెమినార్.. ప్రసంగించిన హెచ్ సి యూ ప్రొఫెసర్

నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో గణిత శాస్త్ర విభాగం మరియు ఇండియన్ ఉమెన్ మ్యాథమెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, శుక్రవారం "నిత్య జీవితంలో గణిత శాస్త్రం ప్రాధాన్యత" అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అర్చనా మోరే ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. నిత్య జీవితంలో గణిత శాస్త్రం ప్రాధాన్యత, రేఖీయ బీజగణిత ప్రాధాన్యత, అదేవిధంగా గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల కలిగే అవకాశాల గురించి క్షుణ్ణంగా వివరించారు.

ఈ సందర్భంగా గణిత శాస్త్ర విభాగ అధిపతి నక్క నరసింహ మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థులు కూడా గణితశాస్త్రంలో సులభంగా రాణించవచ్చు, అదేవిధంగా గణిత శాస్త్ర విద్యార్థులు కేంద్ర మరియు రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తున్నారు అని అన్నారు. గణిత శాస్త్రం వల్ల ప్రైవేటు, ప్రభుత్వ రంగాలలో మంచి అవకాశాలు పొందుతున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. మ్యాథమెటికల్ టాలెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డి. మధుకర్, కనకయ్య, సీకే రజిని, కే.బాల, రాజశేఖర్, వెంకట్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Mar 03 2024, 11:39