/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz అభివృద్ధి కొనసాగాలంటే నల్లగొండలో మళ్లీ బిఆర్ఎస్ రావాలి Miryala Kiran Kumar
అభివృద్ధి కొనసాగాలంటే నల్లగొండలో మళ్లీ బిఆర్ఎస్ రావాలి

 బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ శాసనసభ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గారి సతీమణి కంచర్ల రమాదేవి నేడు నల్గొండ పట్టణంలోని.. మన ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. నలగొండ పట్టణంలో 1350 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధిని చూసి.. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాలన్నా ప్రారంభించిన పనులు పూర్తి కావాలన్నా మళ్ళీ కంచర్ల భూపాల్ రెడ్డి గెలవాలని.. అందుకే కారు గుర్తుపై ఓటు వేసి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే కంచర్ల భూపాల్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఇంటింటి చేశారు... ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ప్రజలు ఎదురేగి నుదుట కుంకుమతో ఇంట్లోకి ఆహ్వానించి ఘన స్వాగతం పలికారు.. మాజీ ఆర్ వో మాలే శరణ్య రెడ్డి మందడి లిఖిత సైదిరెడ్డి, , మాజీ కౌన్సిలర్ రావుల రేణుక శ్రీనివాస్ రెడ్డి,కత్తుల సంధ్య, గాలి రాధిక,కంచర్ల విజయ రెడ్డి, కౌన్సిలర్ ఊటుకూరు వెంకటరెడ్డి దోనాల నాగార్జున్ రెడ్డి తదితరులు వెంట ఉన్నారు.

నల్లగొండ 17,35 వార్డులలో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ మరియు జనంలోకి దూసుకు వెళ్లిన కార్యకర్తల ప్రచార హోరు

నల్లగొండ 17,35 వార్డులలో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ మరియు జనంలోకి దూసుకు వెళ్లిన కార్యకర్తల ప్రచార హోరు 

నల్గొండ 17,35కార్యకర్తలు కలిసి పచ్చ తోరణాలు కట్టి ఘనంగా బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకుని, 17వ వార్డు లోని పోచమ్మ గుడిలో కార్యకర్తలు అందరూ కొబ్బరికాయ కొట్టుకొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో 35వ వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకన్న, 35 వ వార్డు ఇన్చార్జి తలారి యాదగిరి, నల్గొండ టౌను ప్రధాన కార్యదర్శి జయప్రకాష్, నల్గొండ టౌన్ కోశాధికారి గంజి రాజేందర్, 17వ వార్డు ఉపాధ్యక్షుడు వనం చంద్రశేఖర్, మూడ వేణు, గంజి లక్ష్మీనారాయణ, జెల్లా శ్రీనివాస్,జెల్లా మధు, దొంత రవి, మిరియాల కిరణ్ కుమార్, కైరం కొండ శివకుమార్, కైరం కొండ అరుణ్,పోశం గిరి, గంజి మహేష్, చందు తదితరులు పాల్గొన్నారు.

బిగ్ బ్రేకింగ్... నల్లగొండ 35వ వార్డు కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక...

నల్లగొండ బి.ఆర్.ఎస్ పార్టీలోకి వలసల జోరు... ఆగకుండా పరిగెత్తుతున్న కారు...

నలగొండ 35వ వార్డు కు చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు పున్న సత్యం కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పున్న సత్యంతో పాటు మూడ శేఖర్, గంజి వెంకన్న, జెల్లా వంశీ 17 వార్డు కు చెందిన యువకులు బి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పుకునీ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకన్న, 35 వ వార్డు ఇన్చార్జి తలారి యాదగిరి, నల్గొండ టౌను ప్రధాన కార్యదర్శి జయప్రకాష్, నల్గొండ టౌన్ కోశాధికారి గంజి రాజేందర్, 17వ వార్డు ఉపాధ్యక్షుడు వనం చంద్రశేఖర్, మూడ వేణు, గంజి లక్ష్మీనారాయణ, జెల్లా శ్రీనివాస్,జెల్లా మధు, దొంత రవి, మిరియాల కిరణ్ కుమార్, కైరం కొండ శివకుమార్, కైరం కొండ అరుణ్, పోశం గిరీష్, సురేపెల్లి అంజి, రాపోలు ప్రభాకర్, గంజి మహేష్, చందు తదితరులు పాల్గొన్నారు.

రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో ఐదేళ్లు పెంపు

రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో ఐదేళ్లు పెంపు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. శనివారం ఛత్తీస్ గఢ్ పర్యటనలో ఉన్న ప్రధాని ఈ ప్రకటన చేశారు.


 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. శనివారం ఛత్తీస్ గఢ్ పర్యటనలో ఉన్న ప్రధాని ఈ ప్రకటన చేశారు. దేశంలోని 80 కోట్ల మంది పేద ప్రజల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని 2028 వరకు పేదలకు ఉచిత రేషన్ బియ్యం బీజేపీ ప్రభుత్వం పంపిణీ చేస్తుందని వెల్లడించారు. కాగా కరోనా టైమ్ లో పేదల కోసం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు లబ్దిదారులకు ఉచితంగా అందజేస్తుంది.

బీఆర్‌ఎస్‌ హయాంలోనే సూర్యాపేట ప్రగతిబాట: గుంటకండ్ల సునిత జగదీష్ రెడ్డి

బీఆర్‌ఎస్‌ హయాంలోనే సూర్యాపేట ప్రగతిబాట: గుంటకండ్ల సునిత జగదీష్ రెడ్డి 

గుర్తుల గుర్తుంచుకో అంటూ మంత్రి జగదీష్ రెడ్డి కి మద్దతుగా సూర్యాపేట లో విస్తృత ప్రచారంచేస్తున్న సునిత జగదీష్ రెడ్డి 

10,12 వ వార్డ్ లో ఇంటిటి ప్రచారం

గడగడపను తడుతూ, జనం తో మమేకమవుతూ సాగుతున్న ప్రచారం

పిల్లలమర్రి శివాలయంలో ప్రత్యేక పూజలు

  

   సూర్యాపేట 

గుర్తుల గుర్తుంచుకో.. కారును గుర్తుంచుకో’ అంటూ సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సతీమణి సునిత జగదీష్ రెడ్డి సూర్యాపేట లో గడపగడపనూ తడుతూ వృద్ధులను ఆత్మీయంగా పలుకరిస్తూ, యువతకు దిశానిర్దేశం చేస్తూ జనంతో మమేకమవుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు చేపట్టబోయే పనులను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం సూర్యాపేటలోని 10,12 వ వార్డ్ లలో ప్రచారం నిర్వహించిన సునీత జగదీష్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి జగదీష్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి సూర్యాపేట అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు.

కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన ఏదో ఒక పథకం ప్రతి పేదోడి ఇంటికి చేరిందని తెలిపారు.. రాష్ట్రం రాకముందు గ్రామాలు ఎలా ఉన్నాయో, ఎలాంటి బాధలు పడ్డామో అందరికీ తెలుసని, రాష్ట్రం ఏర్పడ్డకా పల్లెలన్నీ ప్రగతిబాటన పయనిస్తు న్నాయన్నారు.మిషన్‌ భగీరథ నీటితో గ్రామా ల్లో నీటి గోస తీర్చిన గులాబీ పార్టీని గుండెల్లో పెట్టుకుని కారు గుర్తుకు ఓటు వేసి మరో సారి ఆశీర్వదిస్తే మరింతగా అభివృద్ధి చేయడం ఖాయం ఆన్నారు. అంతకుముందు పిల్లలమర్రి శివాలయం లో ప్రత్యేక పూజలు చేసి, శివయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని ప్రార్థించారు.

Ts: శబరి వెళ్లే భక్తులకు ఉచిత ప్రయాణం… టీఎస్​ ఆర్టీసీ వారికి ఆఫర్..​

శబరిమలకు వెళ్లే భక్తులకు టీఎస్​ఆర్టీసీ బంపర్​ ఆఫర్​ ఇచ్చింది. అద్దె ప్రాతిపదికన సూపర్‌లగ్జరీ బస్సులు సమకూర్చేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంట మనుషులు, సామాన్లు సర్దేందుకు ఓ వ్యక్తికి, బస్సు బుక్ చేసిన గురుస్వామికి ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన సూపర్‌లగ్జరీ బస్సులు సమకూర్చేందుకు సిద్ధమైంది.

- సుశిక్షితులైన డ్రైవర్లతో, భద్రమైన ప్రయాణానికి అవకాశం కల్పిస్తుందని కరీంనగర్‌ రీజియన్‌ రీజినల్‌ మేనేజర్‌ ఎన్‌.సుచరిత చెప్పారు. ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో టీవీ సౌకర్యం ఉందని, ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంటమనుషులు, సామాన్లు సర్దేందుకు ఓ వ్యక్తికి ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సును అద్దెకు బుక్‌ చేసిన గురుస్వామికి ఉచిత ప్రయాణం ఉంటుందని చెప్పారు. ఒకటి కంటే ఎక్కువ బస్సులు బుక్‌ చేసిన గురుస్వామికి ఆ బస్సులపై రోజుకు రూ.300 చొప్పున కమీషన్‌ కూడా ఇస్తామని వెల్లడించారు.

లక్షలాది ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయ, పెన్షనర్ల భారీ ర్యాలీ: వి. కృష్ణ మోహన్ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసీయేషన్‌ (టాప్రా)

లక్షలాది ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయ, పెన్షనర్ల భారీ ర్యాలీ

పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించి పోస్టులను భర్తీ చేయకుంటే ఉద్యమం ఉధృతం

ఢిల్లీలో లక్షలాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, టీచర్లు, పెన్షనర్లు భారీ ర్యాలీ నిర్వహించి రామ్ లీలా మైదానంలో బహిరంగ సభలో పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ప్రభుత్వ రంగ సంస్థలతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారని ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి. కృష్ణ మోహన్ తెలిపారు.

ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏ.ఐ.ఎస్.జి.ఈ.ఎఫ్), కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ (సీసీజీఈడబ్ల్యూ), స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( ఎస్.టీ.ఎఫ్.ఐ), నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్సీసీపీఏ), సీ.సీ.జీ.జీ.ఓ.ఓ, ఎఐఎస్‌జీపీఎఫ్‌ సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన చేతావనీ ర్యాలీలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణలను ఆపాలని, ట్రేడ్ యూనియన్ హక్కులను పరిరక్షించాలని, 8వ కేంద్ర వేతన కమీషన్ ను నియమించాలని, 18 నెలల డి.ఏ/ డి.ఆర్ బకాయిలను విడుదల చేయాలని, కారుణ్య నియామకాలకు అడ్డంకులను తొలగించాలని, పీఎఫ్‌ఆర్డీఏను రద్దు చేయాలని నినదించారు. ”ఎన్పీఎస్‌ రద్దు చేయాలి, ఓపీఎస్‌ పునరుద్ధరించాలి, ఎన్‌ఈపీని వెనక్కి తీసుకోవాలి” అంటూ డిమాండ్‌ చేస్తూ ఇంగ్లీష్‌, హిందీ భాషలతో పాటు ప్రాంతీయ భాషల్లో డిమాండ్లతో కూడిన ప్లకార్డులు, బ్యానర్లు చేబూని దేశ రాజధాని ఢిల్లీలో కదంతొక్కారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లనుండి ఎన్.జీ.ఓ అసోసియేషన్లు, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూ.టి.ఎఫ్), ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసీయేషన్‌ (టాప్రా), పోస్టల్ తదితర సంఘాల నుండి వేలాది మంది ఢిల్లీ భారీ ర్యాలీలో పాల్గొని తమ న్యాయబద్ధమైన కోర్కెలను వెంటనే పరిష్కరించాలని, లేనట్లయితే నిరవధిక సమ్మెతో సహా తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎన్.పి.ఎస్ ను రద్దు చేసి, సీ.సీ.ఎస్ పెన్షన్ రూల్స్, 2021ను అందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, టీచర్లు, పెన్షనర్లు, ప్రభుత్వ రంగ సిబ్బందికి వర్తింప చేసి పాత పెన్షన్ స్కీమును ( ఓ.పి.ఎస్) పునరుద్ధరించాలని, క్యాజువల్, కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్, డైలీ వేతనాల కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, వారిని రెగ్యులరైజ్‌ చేయాలని, వేతన సవరణ జరపాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ,పెన్షన్‌ ఫండ్ ప్రయివేటీకరణలను మానుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని వి. కృష్ణ మోహన్ డిమాండ్ చేశారు.

సూర్యాపేటలో కొనసాగుతున్న బీఆర్ఎస్ దూకుడు..

కొనసాగుతున్న బీఆర్ఎస్ దూకుడు

బీఎస్పీ కి నై.. బీఆర్ఎస్ కే జై అంటున్న గాంధీనగర్ వాసులు

మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో మూకుమ్మడిగా బీఆర్ఎస్ లో చేరిన బీఎస్పీ, కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు

బారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్న మంత్రి జగదీష్ రెడ్డి

చివ్వేంల మండలం వట్టి ఖమ్మం పహాడ్ లో బిజెపి , కాంగ్రెస్ లు ఖాళీ

అభివృద్ధి కి ఆకర్షితులై స్వచ్ఛందంగా చేరికలు

గులాబీ కండువాలతో స్వాగతం పలికిన మంత్రి 

సూర్యాపేట 

   సాధారణ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూకుడు కొనసాగుతుంది. సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధితో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాన్ని ఖాయం చేసుకోగా, అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ ,బిజెపి ల నుండి వెల్లువలా కొనసాగుతున్న చేరికలతో బీఆర్ఎస్ అభ్యర్ధి జగదీష్ రెడ్డి భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. తాజాగా బీఎస్పీ కి నై అంటూ పట్టణం లోని గాంధీనగర్ , బాషానాయక్ తండా కు చెందిన నేతలు, కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. చేరిన వారిలో పురాణపు యాదగిరి, అంజయ్య, ప్రసాద్, రామకృష్ణ, చిన్నరాములు, చిన గురుస్వామి, సాయి కుమార్ తో పాటు 54మంది బిజెపి, కాంగ్రెస్ కార్యర్తలు బీఆర్ఎస్ లో చేరారు.13 వ వార్డ్ అధ్యక్షుడు రఫీ, జానయ్య, జనార్దన్ ఆధ్వర్యం లో చేరికలు జరిగాయి. ఇక చివ్వెంల మండలం వట్టి ఖమ్మం పహాడ్ లో రౌతు నర్సింహ రావు ఆధ్వర్యం లో 58 మంది కాంగ్రెస్, బిజెపి లకు చెందిన యాదవ సోదరులు, ఇతర పార్టీల కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అభివృద్ధి కి మద్దతుగా పార్టీ లో చేరిన వారందరికీ గులాబీ కండువాకప్పి మంత్రి జగదీష్ రెడ్డి సాదరస్వాగతం పలికారు.

మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ తనిఖీ

ఎన్నికలకోడ్ 

మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ తనిఖీ

సూర్యాపేట శివారులో వాహన సోదాలు చేసిన పోలీసులు

 సూర్యాపేట 

 

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ని సూర్యాపేట సమీపం లోని విజయవాడ - హైదరబాద్ జాతీయ రహదారి పై చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీ చేశారు.ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి జగదీష్ రెడ్డి పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. కార్ లోని డాష్ బోర్డ్ లను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసి డబ్బు ఉందా? అంటూ ఆరా తీశారు. తమ వాహనం మొత్తం, వెంట ఉండి మరీ, పోలీసులకు చూపించారు. వాహన తనిఖీ అనంతరం మంత్రికి అధికారులు ధన్యవాదాలు తెలిపారు.

నేడు బిఆర్ఎస్ లోకి కాసాని జ్ఞానేశ్వర్

బిఆర్ఎస్ లోకి కాసాని జ్ఞానేశ్వర్

హైదరాబాద్‌: తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్‌ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగు దేశం పోటీ చేయవద్దని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాసాని ఆ పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ ఉండగా.. ఉన్న పార్టీని కాదని మరొక పార్టీని ఎన్నికల్లో గెలిపించాలనే లక్ష్యంతో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడికి లేఖ కూడా రాశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ముదిరాజ్‌ సామాజిక వర్గంలో పట్టున్న నేతగా కాసాని జ్ఞానేశ్వర్‌కు గుర్తింపు ఉన్నది.