/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz వాయుకాలుష్యంతో క్యాన్సర్ వచ్చే అవకాశం.. వైద్యనిపుణుల హెచ్చరిక.. Yadagiri Goud
వాయుకాలుష్యంతో క్యాన్సర్ వచ్చే అవకాశం.. వైద్యనిపుణుల హెచ్చరిక..

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ప్రజలు తీవ్రమైన వాయు కాలుష్యంతో విలవిల్లాడుతున్నారు. గాలి నాణ్యత తీవ్రంగా పడిపోవడంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు..

వాయు కాలుష్యం హానికరమైనదని, మానవ శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుందని వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. వాయు కాలుష్యం, వివిధ రకాల క్యాన్సర్ల మధ్య సంబంధాన్ని తెలియజేసే శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ ఎయిమ్స్ అదనపు ప్రొఫెసర్, డాక్టర్ పీయూష్ రంజన్ తెలిపారు.

వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యవస్థకు హాని కలిగించడమే కాకుండా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాల వ్యాధులకు కూడా దారితీస్తుందని పేర్కొన్నారు. శరీరంలోని వివిధ వ్యవస్థలను ప్రభావితం చేస్తుందని, ఈ విషయాన్ని తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమని అన్నారు.

వైద్య ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కడుపులోని పిండానికి కూడా వాయు కాలుష్యం హానికరమేనని, పిండంపై దుష్ప్రభావాలు చూపుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

అన్ని వయసులవారి మెదడు, గుండెను కాలుష్యం దెబ్బతీస్తుందని, ముందు జాగ్రత్తతో వ్యవహరించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోతోంది. వరుసగా నాలుగో రోజు ఆదివారం కూడా 'తీవ్రమైన' కేటగిరీలోనే 'వాయు నాణ్యత ఇండెక్స్' ఉంది..

ఊరూరా భోజనాలు.. నేతల బెంబేలు..!

•ప్రచారంలో రోజూ రూ.లక్షల్లో 'వడ్డింపు'

హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలకు, అభ్యర్థులకు రోజువారీ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి..

ప్రచార సంరంభంలో భాగంగా.. గ్రామాల నుంచి పట్టణాల దాకా రోజూ పెద్దసంఖ్యలో సామూహిక భోజనాలు వండుతున్నారు. రోజూ వీధుల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించే వారికి నాయకులే భోజనాలు సమకూరుస్తున్నారు. దాదాపు ప్రతి గ్రామం, పట్టణంలో నిత్యం వేల మందికి భోజనాలు వండి వడ్డిస్తున్నారు.

వీటి కోసం హోటళ్లు, క్యాటరింగ్‌ నిర్వాహకులు పెద్దఎత్తున సరకులు కొని నిల్వ చేస్తున్నారు. నెల క్రితం వరకూ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి భారీగా కూరగాయలు, ఉల్లిగడ్డలు ఇతర సరకులు రాష్ట్రానికి వచ్చేవి. మహారాష్ట్రకు ఉత్తరాన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో, తూర్పున ఛత్తీస్‌గఢ్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో తెలంగాణకు కూరగాయల సరఫరా తగ్గిపోయింది. ప్రస్తుతం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక నుంచే వస్తున్నాయి..

నెలక్రితం వరకూ సాధారణ రోజుల్లో హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి టోకు మార్కెట్‌కు రోజూ 21 వేల క్వింటాళ్లకు పైగా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు సగానికి సగం తగ్గిపోయినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు జాతీయ మార్కెట్లలో నిత్యావసరాలకు గత నెలరోజుల్లో గణనీయంగా డిమాండు ఏర్పడిందని టోకు వర్తకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా భోజనాలకే రోజూ రూ.లక్షల్లో వెచ్చించాల్సి వస్తోందని అభ్యర్థులు వాపోతున్నారు. దీనికి తోడు పెళ్లి ముహూర్తాలు, కార్తికమాసం, అయ్యప్పదీక్షలు మొదలవుతుండటంతో ఊరూరా అన్నదానాలతో సందడి వాతావరణం నెలకొంటోంది. ఇలా నిత్యావసరాలకు డిమాండ్‌ పెరగడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది..

ప్రజా సేవకులు చెరుకు శివ గౌడ్ కి గోల్డెన్ నంది పురస్కారం అందజేత

స్థానిక చౌటుప్పల్ మున్సిపాలిటీ రాంనగర్ కాలనీకి చెందిన చెరుకు శివ గౌడ్ కి గోల్డెన్ నంది అవార్డును తెలంగాణ బీసీ కమీషన్ చైర్మన్ వకులబరణం కృష్ణ మోహన్ రావు,

హీరో కిరణ్ మరియు ప్రముఖ కవులు, అతిధుల చేతుల మీదుగా ఆదివారం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వేదికగా అందజేశారు.

నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ, అసమర్థ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ పేదలకు, విద్యార్థులకు సమస్యలు వస్తే తన వంతు సహాయ సహకారాలు అందజేస్తూ

ప్రజా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున చెరుకు శివ గౌడ్ కి ఈ పురస్కారం అందజేస్తున్నట్లుగా నిర్వాహకులు తెలియజేసారు.

ఈ సందర్బంగా చెరుకు శివగౌడ్ మాట్లాడుతూ ఇకపై రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

గడప గడపకు ప్రచారాన్ని చేపట్టిన - బిజెపి

•నల్గొండ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ గారి సతీమణి మాదగాని విజయలక్ష్మి

నల్లగొండ పట్టణం 16వ వార్డులో చంద్రగిరి విలాస్ కాలనీలో గడప గడపకు వెళ్లి కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని

నల్లగొండ నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి - శ్రీ మాదగాని శ్రీనివాస్ గౌడ్ గారి సతీమణి మాదగాని విజయలక్ష్మి అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో వీరళ్ళి ఆండాళు,నేవర్సు నీరజ,కాశమ్మ,భవాని, హైమవతి,తార,దేవి, కవిత, ఆవుల మధు, నరాల శంకర్,పెరిక మునికుమార్, గుండెబోయిన శేఖర్, కోటి, తరాల వంశీ, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

కెసిఆర్ నియంత పాలన, దోపిడీ నుంచి విముక్తి పొందాలి

•బిజెపి గెలిస్తే రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి

•బిజెపి నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్

తెలంగాణలో కెసిఆర్ నియంత పాలన నుంచి విముక్తి పొందాలని బిజెపి నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని హైదరాబాద్ రోడ్ లో ఉన్న వీటి కాలనీ హనుమాన్ దేవాలయంలో బిజెపి నాయకులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం 36వ వార్డు వివేకానంద నగర్ కాలనీ, వీటి కాలనీ, యాట కన్నా రెడ్డి కాలనీలలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల ఊబీలో కూరుకుపోయిందని, ప్రజలంతా ఆలోచించి కెసిఆర్ కుటుంబ పాలన నుంచి బయటపడాలని, తెలంగాణను వారి దోపిడి నుంచి కాపాడాలని అన్నారు. కేవలం బిజెపి ప్రభుత్వం తోనే తెలంగాణలో కెసిఆర్ అవినీతి అక్రమాలను ఆపగలుగుతామన్నారు.

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ప్రజలు అన్ని రంగాల్లో బాగుపడతారని అన్నారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి వెళ్తున్న సందర్భంలో ప్రజలంతా ఆదరిస్తున్నారని, గతంలో టిడిపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఈ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా నల్గొండ గడ్డపై బిజెపి గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర నాయకులు బండారు ప్రసాద్ మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలో మాదగాని శ్రీనివాస్ గౌడ్ కు ఎంతో అనుబంధం ఉందని ఆయన పరిచయాలు కూడా నల్గొండలో బిజెపి గెలవడానికి అవసరం అయితాయన్నారు. ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి శ్రీనివాస్ గౌడ్ ను గెలిపించాలని అందుకోసం పార్టీ కార్యకర్తలు బూత్ సాయి అధ్యక్షులు ప్రతి ఒక్కరూ కంకణ బద్దలే పని చేయాలని సూచించారు.

నాగం వర్షిత్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ 20 ఏళ్లుగా నల్గొండకు ఎమ్మెల్యేగా వ్యవహరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభివృద్ధి చేసింది శూన్యమని, నల్గొండకు అవసరం లేదని వెంకటరెడ్డిని ఓడించి బయటకు పంపిన సిగ్గు లేకుండా మళ్లీ నియోజకవర్గానికి వచ్చారన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గత ఐదేళ్లుగా నల్గొండ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని అలాంటి నాయకున్ని ప్రజలు ఇంటికి పంపనున్నారన్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేశానని చెప్పిన పార్టీ బిజెపి అని అలాంటి బిజెపిని బీసీలంతా ఆలోచించి ఆదరించాలన్నారు.

ఈకార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, కౌన్సిలర్లు బొజ్జ మల్లిక నాగరాజు, రావిరాల పూజిత, వెంకటేశ్వర్లు, దాసరి సాయి, నూకల వెంకట్ నారాయణ రెడ్డి,ఆవుల మధు,చర్లపల్లి గణేష్, వంగూరి రాఖి, ఏరుకొండ హరి, యాట మధు, దీక్షిత్, మిర్యాల అంజిబాబు, కుమార్, మల్లికార్జున్, నవీన్, మధుకర్ రెడ్డి, మేక శీను, ఎడ్ల వెంకన్న, పులిపల్లి రవీందర్ రెడ్డి, బాలాజీ, సురేష్, జీవన్, కిరణ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్‌ ఆత్మహత్య?

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్‌ ఏఎస్‌ఐ ఫజల్‌ అలీ బలవన్మరణానికి పాల్పడ్డారు. సర్వీస్‌ రివాల్వర్ తో నుదిటిపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది .

హైదరాబాద్‌ అమీర్‌పేటలోని శ్రీనగర్‌ కాలనీలో ఉన్న ఓ హోటల్‌లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఆయన సూసైడ్‌ చేసుకున్నట్టు తెలిసింది . ఘటనా స్థలాన్ని మంత్రి సబిత, వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ పరిశీలించారు.

అయితే ఆదివారం ఉదయం కుమార్తెతో మాట్లాడిన ఫజల్‌.. ఆమె ఎదుటే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోస్టుమార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.

కాగా, ఏఎస్‌ఐ ఫజల్‌ అలీ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణమని ప్రాథమికంగా తెలుస్తున్నదని డీసీపీ జోయల్‌ డేవిస్‌ అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్నారని చెప్పారు.

ఆదివారం ఉదయం 6 గంటలకు తన కూతురుతో కలిసి విధులకు హాజరయ్యారని, 7 గంటల సమయంలో సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

హోటల్‌ దగ్గర వ్యక్తిగత విషయాల గురించి కుమార్తెతో చర్చించినట్లు తెలిసింది.పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.,..

భాజపా, జనసేన మధ్య కుదిరిన పొత్తు

•9 స్థానాల్లో జనసేన పోటీప్రధాని సభలో పాల్గొననున్న పవన్‌కల్యాణ్‌..

హైదరాబాద్‌: భాజపా, జనసేన మధ్య పొత్తు కుదిరింది. శాసనసభ ఎన్నికల్లో జనసేన తొమ్మిది స్థానాల్లో పోటీ చేయనుంది..

ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ నివాసంలో భాజపా రాష్ట్ర నేతలు శనివారం రాత్రి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సమావేశంలో పవన్‌కల్యాణ్‌తోపాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు.

మొదట జనసేన 11 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించినా తాజా చర్చల్లో 9 స్థానాలకు అంగీకరించింది. కూకట్‌పల్లితోపాటు మరో ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఏయే స్థానాల్లో జనసేన పోటీ చేయనుందనే అంశంతోపాటు తదుపరి కార్యాచరణను ఆదివారం వెల్లడించనున్నారు.

119 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 88 చోట్ల అభ్యర్థులను భాజపా ప్రకటించింది. మిగిలిన 31 స్థానాలకుగాను తొమ్మిది చోట్ల జనసేన బరిలోకి దిగనుండగా.. 22 స్థానాలకు భాజపా అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో పాల్గొనే బీసీ ఆత్మగౌరవ సభకు పవన్‌కల్యాణ్‌ హాజరు కానున్నారు. ప్రధాని సభలో పాల్గొనాలని పవన్‌కల్యాణ్‌ను కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు కోరగా..

అందుకు ఆయన అంగీకరించారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్‌డీయే భాగస్వామిగా ఉన్న జనసేన.. గతంలో జరిగిన అసెంబ్లీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో సహకరించిందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఎంతో కీలకమైనవని.. తెలంగాణ రాష్ట్రానికి డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అవసరమని పేర్కొన్నారు. జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చిందని తెలిపారు..

ఎంఐఎం పార్టీ తొలి జాబితావిడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంఐఎం శుక్రవారం ప్రకటించింది.

9 నియోజకవర్గాల్లో మజ్లిస్ పోటీకి దిగనుంది. జూబ్లీ హిల్స్, రాజేంద్రనగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్ పుర, బహదూర్ పుర, కార్వాన్, మలక్‌పేట్, నాంపల్లి నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది.

తొలి విడతగా పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు.

అభ్యర్థులు వీరే

1)చాంద్రాయణగుట్ట-అక్బరుద్దీన్ ఓవైసీ

2)చార్మినార్- మీర్ జుల్ఫిఖర్ అలీ

3)కార్వాన్-కౌసర్ మొయినుద్దీన్

4)మలక్‌పేట్-బలాల

5)నాంపల్లి-మహమ్మద్ మాజీద్ హుస్సేన్

6)యాకుత్ పురా-జాఫర్ హుస్సేన్

ఓటు అడిగే హక్కు బిజెపికి,కాంగ్రెస్ కి లేదు: సీఎం కేసీఆర్

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ముథోల్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

కేసీఆర్ మాట్లాడుతూ..ఇవాళ బీజేపీ పార్టీ అభ్య‌ర్థిని మీరు ప్రశ్నించాలి.అని కేసీఆర్ సూచించారు. మోదీకి ప్ర‌యివేటైజేష‌న్ పిచ్చి ప‌ట్టుకుంది. విమానాలు, ఓడ‌రేవులు, రైల్వేలు, లోక‌మంతా ప్ర‌యివేటు. చివ‌ర‌కు క‌రెంట్ కూడా ప్ర‌యివేటు. బోర్ మోటార్ల కాడా మీట‌ర్లు పెట్టాల‌ని ఆర్డ‌ర్ చేశారు.

నేను దానికి ఒప్పుకోలేదు నేను ఒకటే చెప్పిన పాణం పోయినా త‌ల తెగిప‌డ్డా వ్యవసాయానికి మీటర్లు పెట్ట‌ను అని చెప్ప‌ను. ఏడాదికి వ‌చ్చే రూ.5 వేల కోట్లు క‌ట్ చేస్తాన‌ని చెప్పాడు.

అలా ఐదేండ్ల‌కు క‌లిసి రూ. 25 వేల కోట్లు న‌ష్టం చేసిండు. మ‌న‌కు రావాల్సింది రాకుండా.. మీట‌ర్లు పెట్ట‌లేదు అని బంద్ పెట్టిండు. రైతాంగం నిల‌బ‌డాలి. రైతులు ఆగ‌మైపోయారు.

రైతులు క‌చ్చితంగా బాగుప‌డాలి. వ్య‌వ‌సాయం బాగుండాల‌నే సిద్ధాంతో ఎంత ఒత్తిడి చేసినా మీట‌ర్లు పెట్ట‌లేదు. భ‌విష్య‌త్‌లో కూడా మీట‌ర్లు పెట్టం. మీట‌ర్లు పెట్టేటోళ్ల‌కు ఓట్లు వేయ‌మ‌ని చెప్పాలి. రూ. 25 వేల కోట్లు క‌ట్ చేసిన పార్టీ ఇవాళ ఏముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావ‌ని ప్రశ్నించాలని అన్నారు.

దేశంలో 157 మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేశారు. కానీ తెలంగాణ‌కు ఒక్క‌టి ఇవ్వ‌లేదు. 50 ఉత్త‌రాలు రాశాను. ఎందుకు ఇవ్వ‌లే. ఇదేం వివ‌క్ష‌. ఒక్క మెడిక‌ల్ కాలేజీ ఇవ్వ‌ని బీజేపీకి ఓటు ఎందుకు వెయ్యాలని కెసిఆర్ ప్రశ్నించారు.

న‌వోద‌య విద్యాయాలు ఇవ్వ‌లేదు. 33 జిల్లాల‌కు న‌వోద‌య విద్యాల‌యాలు రావాలి. ప‌దేండ్ల నుంచి అడుగుతున్నా ఒక్క‌టి కూడా మంజూరు చేయ‌లేదు. మ‌రి న‌వోద‌య పాఠ‌శాల ఇవ్వ‌ని నాయ‌కులు ఏ ముఖం పెట్టుకుని బీజేపీ మ‌న‌ల్ని ఓట్లుఅడుగుతుంది, వారికి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్ప‌క‌పోతే మ‌నమీద‌నే దాడి చేస్తారు.అని కేసీఆర్ అన్నారు..

భైంసా ఎలా అభివృద్ధి చెందిందో మీరు చూస్తున్నారు అని కేసీఆర్ తెలిపారు. కులం, మ‌తం లేదు. తెలంగాణ ప్ర‌జ‌లంద‌రూ మ‌న బిడ్డ‌లే. ద‌ళిత స‌మాజం ఎప్ప‌ట్నుంచో వెనుక‌బ‌డి ఉంది. అణిచివేతకు కు గుర‌య్యారు.

వారు సాటి మ‌న‌షులు కారా..? ద‌ళితుల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఉంటే ఇవాళ ఈ ప‌రిస్థితి ఎందుకు ఉండేది. ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. ఈ ద‌ళిత బంధు స్కీం తెచ్చింది కేసీఆర్. త‌ప్ప‌కుండా ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి సాయం అందిస్తాం. ద‌ళితులు కూడా ఆలోచించి ఓటేయాలి అని కేసీఆర్ సూచించారు.

భైంసా, ముథోల్‌, నిర్మ‌ల్‌, ఆదిలాబాద్‌, హైద‌రాబాద్‌లో ముస్లింలు హిందువులు ఉన్నార‌ని కేసీఆర్ గుర్తు చేశారు. వంద‌ల ఏండ్ల నుంచి క‌లిసి బ‌తుకుతున్నాం. తాకులాట‌లు పెట్టి మ‌త‌పిచ్చి లేపి భైంసా అంటేనే యుద్ధ‌ మ‌న్న‌ట్టు చిత్రీక‌రించి, త‌న్నుకు చ‌స్తార‌ని అబ‌ద్ధాలు చెప్పి ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నం బీజేపోళ్లు చేస్తున్నారు.

బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో ప‌దేండ్ల‌లో క‌ర్ఫ్యూ లేదు. లాఠీ ఛార్జి లేదు. ఫైరింగ్ లేదు. ప్ర‌శాంతంగా ఉన్న‌ది తెలంగాణ‌. ఇలానే ప్ర‌శాంతంగా ఉండాల్నా.. మ‌త‌పిచ్చి మాటలతో నెత్తురు పారాలా..? మీరు ఆలోచించాలి.

ఎవ‌రి బ‌తుకు వారు బ‌తుక‌కా.. ద్వేషం పెట్టుకుని ఏం సాధిస్తాం. ఏమోస్త‌ది. క‌లిసిమెలిసి బ‌త‌క‌డంలోనే శాంతియుత‌మైన స‌హ‌జీవ‌నం ఉంట‌ది. అంద‌రం గొప్ప‌గా బ‌తుక గ‌లుగుతాం. మ‌న రాష్ట్రంలో ఉన్న అన్ని మ‌తాలు, కులాల వారు క‌లిసి కట్టుగా బి ఆర్ ఎస్ కు ఓటు వేయాలని కెసిఆర్ కోరారు...

నామినేషన్ పత్రాలతో రేపు కోనయపల్లి లో కేసీఆర్ ప్రత్యేక పూజలు

బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాకు రేపు శనివారం వెళ్ల‌నున్నారు.

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనయపల్లి వెంకటేశ్వర స్వామిని శనివారం ద‌ర్శించుకోనున్నారు.

ఈ సంద‌ర్భంగా స్వామివారి పాదల వ‌ద్ద సీఎం కేసీఆర్ నామినేష‌న్ ప‌త్రాలు ఉంచి పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

ప్రతి ఎన్నికల్లో నామినేషన్ ముందు నామినేషన్ పత్రాలను స్వామివారికి పాదాల వద్ద పెట్టి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నామినేషన్ వేస్తారు.

ఆరాధ్య దైవంగా భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఉదయం 10 గంటలకు కొనేపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

ఇది ఆయ‌న‌కు సెంటీమెంట్. ఈసారి కూడా అదే సెంటీమెంట్‌ను సీఎం కేసీఆర్ ఫాలో అవుతున్నారు. ఇక్క‌డ పూజ‌లు నిర్వ‌హించి ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు...