/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz బీఎస్పీ మేనిఫెస్టో: భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి Mane Praveen
బీఎస్పీ మేనిఫెస్టో: భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి
హైదరాబాద్: బహుజన భరోసా పేరుతో బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.. 2023 అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో.. నేడు బీఎస్పీ  మేనిఫెస్టోను విడుదల చేశారు.  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 10 పథకాలతో కూడిన బీఎస్పీ మేనిఫెస్టో ను విడుదల చేసారు.

మేనిఫెస్టో లోని 10 అంశాలు

1. కాన్షీ యువ సర్కార్: యువతకు ఐదేళ్ల లో 10 లక్షల ఉద్యోగాలు.. అందులో మహిళలకు 5 లక్షల కొలువులు

2. పూలే విద్యా దీవెన: మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్. ప్రతి మండలం నుండి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య. Data, AI, మరియు కోడింగ్‌ లో శిక్షణ

3. బహుజన రైతు ధీమా: ప్రతి పంటకు కనీస మద్దతు ధరతో కొనుగోలు. రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు కచ్చితమైన ప్రభుత్వ రాయితీ, ధరణి పోర్టల్ రద్దు.

4. చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి: మహిళా కార్మికులు మరియు రైతులకు ఉచిత వాషింగ్ మెషిన్, స్మార్ట్ ఫోన్, మరియు డ్రైవింగ్ శిక్షణ. అంగన్‌వాడీ, ఆశావర్కర్ల ఉద్యోగులు క్రమబద్దీకరణ. మహిళా సంఘాలకు ఏటా లక్ష రూపాయలు.

5. భీం రక్షా కేంద్రాలు: వృద్ధులకు హాస్టల్, ఆహారం మరియు ఉచిత వైద్య సేవలు. రక్షా కేంద్రాల్లో వికలాంగులకు మరియు ఒంటరి మహిళలకు తోడ్పాటు.

6. బ్లూ జాబ్ కార్డ్‌: పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ. రోజూ కూలీ రూ. 350కి పెంపు. కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య మరియు జీవిత బీమా

7. నూరేళ్ల ఆరోగ్య ధీమా: ప్రతి కుటుంబానికి రూ. 15 లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ. ఏటా రూ. 25,000 కోట్లతో పౌష్టికాహార, ఆహార బడ్జెట్‌ కేటాయింపు

8. వలస కార్మికుల సంక్షేమ నిధి: 5,000 కోట్ల నిధి తో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు వలస కార్మికులకు వసతి గిగ్ కార్మికులు, లారీ మరియు టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు.

9. షేక్ బందగీ గృహ భరోసా: ఇల్లు లేని వారికి 550 చ.గ. ఇంటి స్థలం ఇల్లు కట్టుకునే వారికి రూ. 6 లక్షల సహాయం ఇంటి పునర్నిర్మాణానికి రూ. లక్ష సహాయం

10. దొడ్డి కొమురయ్య భూమి హక్కు : భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి, మహిళల పేరిట పట్టా.
దామెర భీమనపల్లి గ్రామపంచాయతీ వద్ద ఏసిఎఫ్ క్యాంపు
నల్లగొండ జిల్లా
మర్రిగూడ: మండల టీబి, లెప్రసీ నోడల్ సూపర్వైజర్ ప్రేమ కుమార్  ఆధ్వర్యంలో మంగళవారం దామెర భీమనపల్లి గ్రామపంచాయతీ వద్ద ఏసిఎఫ్ క్యాంపు నిర్వహించారు.

రెండు వారములకు పైబడి దగ్గు ,ఆకలి లేకపోవడం, బరువు మరియు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, చాతిలో నొప్పి, రక్తంతో కూడిన తేమడ, రాత్రి చెమటలు రావటం, జ్వరం రావడం క్షయ వ్యాధి లక్షణాలు, దగ్గినప్పుడు మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా గాలి ద్వారా ఇతరులకు వ్యాపించి క్షయవ్యాధిని వ్యాప్తి చేస్తాయి. కనుక ప్రాథమిక దశలోనే తెమడ పరీక్ష మరియు ఎక్స్రే ద్వారా ఈ వ్యాధిని గుర్తించి లక్షణాలు ఉన్నవారికి పీహెచ్సీ ద్వారా ఉచిత మందులు ఇవ్వబడతాయి. అనుమానితుల నుంచి తెమడ శాంపిల్స్ తీసుకొని ఆసుపత్రికి పంపడం జరిగినదని ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ క్యాంపులో బిపి మరియు షుగర్ పరీక్షలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి, సిహెచ్ఓ, హెచ్ వి, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST
నల్లగొండలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ కాంగ్రెస్ లో చేరిక
నల్లగొండ మున్సిపాలిటీకి చెందిన బిఆర్ఎస్ పార్టీ పలువురు కౌన్సిలర్లు ఈరోజు హైదరాబాదులోని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కౌన్సిలర్ లకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
బిఆర్ఎస్ పార్టీకి మరోషాక్ తగిలింది.. హస్తం గూటికి చేరేందుకు రెడీ అయిన రాథోడ్ బాపురావు !
TS: రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా మరో సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు బీఆర్ఎస్‌ పార్టీ కి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. కారు దిగి హస్తం గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కు నిరాశే ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా బాపూరావు స్థానంలో అనిల్‌ జాదవ్‌ కు టికెట్ కేటాయించారు. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీపై బాపూరావు అసంతృప్తిగా ఉన్నారు. ఈ తరుణంలోనే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగగా.. ఇవాళ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ పై ఆయనతో చర్చించారు.

ఈనెల ములుగు జిల్లా రామాజపురంలో జరగనున్న కాంగ్రెస్ భారీ బహిరంగసభలో ఢిల్లీ నేతల సమక్షంలో పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండు సార్లు నియోజవర్గంలో గెలిచినా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా.. తనకు టికెట్ ఇవ్వకుండా ఇతరులకు కేటాయించడంపై బాపూరావు తీవ్ర సంతృప్తికి లోనయ్యారు. బుజ్జగింపు కోసం వేచి చూసిన ప్రయోజనం లేకపోవడంతో పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు సమాచారం. మరోవైపు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సైతం ఇదే ముహూర్తంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

SB NEWS TELANGANA
మర్రిగూడ: రైతు సంఘం మండల కమిటీ సమావేశం
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ నాంపల్లి, మండలాల తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ సమావేశం సోమవారం, సిపిఎం పార్టీ కార్యాలయంలో కొట్టం యాదయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ బండ శ్రీశైలం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన రుణమాఫీ 100 కు 40 శాతం మందికి రుణమాఫీ రాకుండా పోయింది. రైతుబంధు పెండింగ్లో ఉన్నవారికి ఇవ్వలేదు. పెండింగ్లో ఉన్న రైతుబంధు రైతు ఖాతాలో జమ చేయాలని, రుణమాఫీ రైతు ఖాతాలో జమచేయాలేని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, కనీసం ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి, రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ బందు, సంక్షేమ పథకాలు.. నిరుపేదలను గుర్తించి గ్రామసభల ద్వారా ఎంపిక చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కానీ దీనికి భిన్నంగా సంపన్నులకు టిఆర్ఎస్ కార్యకర్తలకు ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు.

రేపు జరగబోయే ఎన్నికల్లో అధికార పార్టీ వారిని ప్రజాప్రతినిధులను గ్రామాల్లోకి వస్తే నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నల్లగొండ జిల్లా కార్యదర్శి బాష్పాక ముత్తి లింగం, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి, ఏర్పుల యాదయ్య, ఉప్పునూతల వెంకటయ్య, నీలకంఠం రాములు, చెల్లం ముత్యాలు, గిరి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
జనగామలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న పొన్నాల
జనగామ: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పొన్నాల లక్ష్మయ్య కారెక్కారు. జనగామ బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్, పార్టీ కండువా కప్పి పొన్నాలను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనగామ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, 18వ వార్డు కౌన్సిలర్ గాడిపెల్లి ప్రేమలత రెడ్డి, 30వ వార్డు కౌన్సిలర్ బొట్ల శ్రీనివాస్ కూడా బీఆర్ఎస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చిన పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని పొన్నాల ఆరోపించారు. పార్టీ అంశాలు చర్చించేందుకు కూడా తనకు అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు.

కొందరు నాయకుల వైఖరితో పార్టీ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈ పదేళ్లలో తనకు ఒక్కపదవి కూడా ఇ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా కనిపిస్తే నమస్తే పెట్టినా స్పందించరని, సొంత పార్టీలోనే పరాయి వ్యక్తులమయ్యామని పొన్నాల ఆరోపించారు.

జనగామ టికెట్ పై పొన్నాల ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, టికెట్ దక్కదని తెలిసి తీవ్రంగా నిరాశ చెందారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నానని.. ఇక భరించలేక రాజీనామా చేశానని పొన్నాల చెప్పారు.

45 ఏళ్ల రాజకీయ జీవితం నాది. పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి చేరుకున్నా. కానీ పార్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా చేయాల్సి వచ్చింది అని పొన్నాల వాపోయారు.
NLG: ప్రవళిక సూసైడ్.. కేటీఆర్ పై మండిపడ్డ మేడి ప్రియదర్శిని బీఎస్పీ నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి
నల్లగొండ జిల్లా: తెలంగాణాలో కలకలం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బిఎస్పి నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని మండిపడ్డారు. ఆమె మాట్లాడుతూ.. ప్రవళిక అసలు గ్రూప్స్ కు అప్లై చేసుకోలేదన్న కేటీఆర్, ఆమె గ్రూప్స్ 1,2,3,4 అప్లై చేసుకున్న ఆధారాలను చూసి మాట్లాడాలని అన్నారు. మంత్రి కేటీఆర్ ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడారని అన్నారు. నెల రోజులలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ.. నిరుద్యోగుల ఓట్ల కోసం నిరుద్యోగుల చూపు మళ్ళించడానికి ఇలా మాట్లాడారని అన్నారు. ఓట్ల కోసం ఇంత దిగజారడం ఒక టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని విమర్శించారు. ప్రవళిక వ్యక్తిగతమైన చాటింగ్ బయట పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

గవర్నర్ తమిళ సై చేసిన వ్యాఖ్యలపై నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ స్పందిస్తుంది, కల్వకుంట్ల కవిత పై చేసిన వ్యాఖ్యలకు స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్స్ స్పందిస్తుంది. అదే ఒక సామాన్యురాలు ప్రవళిక మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పోలీసు యంత్రాంగం మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం రాజకీయం చేయడం, విషయాన్ని పక్కదో పట్టించాలని చూస్తున్నారని ఆమె తెలిపారు. ఇప్పటికైనా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడం ఆపాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం అధ్యక్షులు గద్దపాటి రమేష్, మునుగోటి సత్తయ్య, శేఖర్, యోగి, కృష్ణ, జగపతి తదితరులు పాల్గొన్నారు
చిట్యాల మండల బిఎస్పీ పార్టీ అధ్యక్షులు గా  జోగు శేఖర్
చిట్యాల మండల బిఎస్పీ పార్టీ అధ్యక్షులుగా తాళ్ల వెల్లంల గ్రామానికి చెందిన  జోగు శేఖర్ ను నియమిస్తున్నట్లు నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్ తెలిపారు. విద్యావంతుడు, బహుజన వాదం పట్ల ఆసక్తి ఉండటం వల్ల శేఖర్ ను నియమించామని నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్ తెలిపారు.  శేఖర్ మాట్లాడుతూ.. మండల నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పిన, బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శినికి, మరియు   నయోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్ కి కృతజ్ఞతలు అని తెలిపాడు. శక్తి మేరకు  చిట్యాల మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

నకిరేకల్ లో నీలి జెండా ఎగిరే విధంగా శక్తివంచన లేకుండా పార్టీ కొరకు అహర్నిశలు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

తన యొక్క ఎన్నికకు సహకరించిన ప్రతి బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తకు నాయకులకు అందరికీ కూడా పేరుపేరునా కృతజ్ఞతలు అని తెలిపారు.
TS: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
భద్రాచలం జిల్లా: ఎన్నికల వేళ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్రనాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. భద్రాచలంలోని ఆమె నివాసంలో తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో, హాస్పిటల్‌ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. కుంజా సత్యవతి మొదట్లో సీపీఎం పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత వైఎస్ఆర్ చొరవతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1991లో భద్రాచలం ఎంపీపీ గా ఎన్నికయింది. 2009లో భద్రాచలం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచారు. అసెంబ్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిటీ, ఎస్టీ కమిటీ, ఎంప్లాయిమెంట్ ఇన్ ప్రాస్ట్రక్చర్ స్టాండింగ్ కమిటీలకు సభ్యురాలుగా పనిచేసింది. వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంత కాలం ఆమె కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆ తరువాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్లారు. కొన్నాళ్ల తరువాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు. ఆమె మృతి పట్ల అన్ని రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
NLG: ఏఐఎస్ఎస్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా 2వసారి దళిత రత్న బుర్రి వెంకన్న
ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర 10వ మహాసభలు  హైదరాబాదులోని ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ (శాంతి చక్ర ఇంటర్నేషనల్) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ హాల్ లో ఆదివారం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి దాసరి లక్ష్మయ్య రాష్ట్ర అధ్యక్షులు సభ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ జాతీయ చైర్మన్ డాక్టర్ హెచ్.ఆర్. గోయల్, జాతీయ సెక్రెటరీ జనరల్ అశోక్ శెండే, మాజీ జాతీయ చైర్మన్ ఎస్.చంద్రయ్య, మాజీ జాతీయ కార్యదర్శి డాక్టర్ డి. యాదయ్య, దక్షిణ భారతదేశం సెక్రెటరీ వైద్యనాథ్, వక్తలుగా ప్రొఫెసర్ కాశీమ్, డాక్టర్ బైరీ నరేష్, డాక్టర్ డి.యాదయ్య పాల్గొన్న ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందులో భాగంగా నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన దళితరత్న బుర్రి వెంకన్న ను మరోసారి తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. బుర్రి వెంకన్న మాట్లాడుతూ... నామీద నమ్మకం ఉంచి సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చిన జాతీయ కమిటీ నాయకులకు నా ప్రత్యేకమైన జై భీమ్ లు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  ఆలోచన విధానాన్ని, భారత రాజ్యాంగ హక్కులు ప్రజలకు తెలిసే విధంగా కృషి చేస్తానని, గ్రామాలలో మూఢనమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయని, వారిని సైన్స్ మీద నమ్మకం కలిగేటట్లు చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను ప్రతి పౌరుడికి తెలిసే విధంగా చైతన్యపరుస్తానని, బాబా సాహెబ్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ సంస్థలో పనిచేయడం సంతోషకరమని అన్నారు.

నల్గొండ జిల్లాలోని గ్రామ మండలాలలో మరియు జిల్లాలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ పూర్తి బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. నా మీద నమ్మకము తో నన్ను  రెండవ సారి రాష్ట్ర శాఖలో అవకాశం కల్పించినందుకు జాతీయ కమిటీ మరియు మాజీ జాతీయ అధ్యక్షులు చంద్రయ్య,  రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మయ్య కు, కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు జై భీమ్ అని తెలియజేశారు

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA