SI Mains Exam: నేడు, రేపు ఎస్సై మెయిన్స్ పరీక్షలు..
ఈ రోజు, రేపు.. ఈ నెల 14, 15 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ఎస్సై పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.. ఈ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు..
విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.. మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్ష ఉండగా.. ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్ విధానంలో మరో రెండు పేపర్లు ఉండనున్నాయి.. కాగా, ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో మెయిన్ పరీక్షకు మొత్తం 31,193 మంది అర్హత సాధించారు. వీరిలో 27,590 మంది పురుష అభ్యర్థులు.. 3,603 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు..
ఈ రోజు పేపర్-1 అంటే డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే పరీక్ష నిర్వహించనున్నారు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుండగా.. రేపు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పేపర్-3 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు..
పేపర్-4 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల నిర్వహించనున్నారు.. ఇక, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే ఎస్సై పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.. అభ్యర్థుల ఎత్తు కొలిచే పరికరాల్లో తప్పిదం వల్ల వేలాది మంది విద్యార్థులు అర్హత కోల్పోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
2019లో అర్హత సాధించిన అభ్యర్థులు 2023లో ఎలా అనర్హతకు గురవుతారని ధర్మాసనం ప్రశ్నించింది. ఎత్తు విషయంలో తమకు అర్హత వున్నప్పటికీ తమని అన్యాయంగా అనర్హతకు గురి చేశారని దాఖలైన పలు పిటిషన్లు మీద హైకోర్టు విచారణ చేపట్టింది. రెండు సైటేషన్లను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనర్హత పొందిన అభ్యర్థులు అందరికీ మళ్లీ శరీర ధారుడ్యం పరీక్షలకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది..
Oct 14 2023, 09:18