/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz 2000 Note: 2000 నోట్ల మార్పిడికి ముగుస్తున్న డెడ్‌లైన్‌.. తర్వాత ఏంటి? Yadagiri Goud
2000 Note: 2000 నోట్ల మార్పిడికి ముగుస్తున్న డెడ్‌లైన్‌.. తర్వాత ఏంటి?

రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి (2000 Note exchange) ఆర్‌బీఐ (RBI) ఇచ్చిన గడువు దగ్గర పడింది. సెప్టెంబర్‌ 30తో గడువు తీరబోతోంది..

ఒకవేళ ఇప్పటికీ మీ దగ్గర రూ.2 వేల నోట్లు ఉంటే.. మార్చుకోవడానికి ఇంకా మూడు రోజులే గడువు ఉంది. అయితే, డెడ్‌లైన్‌ తర్వాత రూ.2 వేల నోట్ల పరిస్థితి ఏంటి?

ఆర్‌బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది? ఆసక్తిగా మారింది. దీనిపై ఇప్పటి వరకు ఆర్‌బీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు..

పెద్ద నోట్ల రద్దు అనంతరం 2016లో రూ.2 వేలు నోట్లను ఆర్‌బీఐ అందుబాటులోకి తెచ్చింది. 'క్లీన్‌ నోట్‌ పాలసీ'లో భాగంగా ఈ ఏడాది మే నెలలో ఉప సంహరించుకుంది.

నోట్లను రద్దు చేయలేదు. అంటే ఇప్పటికీ లీగల్‌ టెండర్‌గానే (నోట్లకు చట్టబద్ధత) రూ.2వేల నోటు కొనసాగుతోంది. అయితే, ఇప్పటికే పలు దుకాణాలు, పెట్రోల్‌ బంకులు రూ.2 వేల నోట్లను తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయి.

వాస్తవానికి నోట్ల మార్పిడికి ఆర్‌బీఐ దాదాపు 4 నెలల గడువు ఇచ్చింది. సెప్టెంబర్‌ 1 నాటికే దాదాపు 93 శాతం నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్‌బీఐ గణాంకాలు చెప్తున్నాయి.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 30 తర్వాత కూడా రూ.2 వేల నోట్ల మార్పిడికి బ్యాంకుల్లో మరో అవకాశం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. అయితే, నిర్దిష్ట గడువులోగా ఉపసంహరణ లక్ష్యం నెరవేరకపోతే లీగల్‌ టెండర్‌గా కొనసాగిస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఇప్పటికే ఓ సందర్భంలో చెప్పారు..

Streetbuzz News

Streetbuzz News

కాంగ్రెస్‌లో చేరేందుకు మైనంపల్లి ఢిల్లీ పయనం

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడు మైనంపల్లి రోహిత్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు.

ప్రస్తుతం తండ్రీకొడుకులు హస్తినలో ఉన్నారు. సాయంత్రం ఏఐసీసీ పెద్దలను ఇరువురు కలవనున్నారు. అనంతరం సాయంత్రం హన్మంతరావు, రోహిత్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి కాంగ్రెస్ రెండు టికెట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది.

మల్కాజ్‌గిరి నుంచి హన్మంతరావుకు, మెదక్ నుంచి రోహిత్‌కు సీటు కన్ఫామ్ చేసినట్లు బుధవారం మీడియాలో నిర్వహించిన చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి ప్రకటించారు.

గురువారం వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలిపారు. అందులో భాగంగా ఇవాళ వారిద్దరు ఢిల్లీ వెళ్లారు...

SB NEWS

Streetbuzz News

Streetbuzz News

TDP: సీఐడీ చీఫ్‌ సంజయ్‌పై చర్యలు తీసుకోండి: అమిత్‌షాకు తెదేపా ఎంపీ రామ్మోహన్‌ ఫిర్యాదు..

TDP: సీఐడీ చీఫ్‌ సంజయ్‌పై చర్యలు తీసుకోండి: అమిత్‌షాకు తెదేపా ఎంపీ రామ్మోహన్‌ ఫిర్యాదు..

అమరావతి: ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఫిర్యాదు చేశారు. సర్వీస్‌ రూల్స్‌ను అతిక్రమించి వైకాపాకు తొత్తుగా సీఐడీ చీఫ్‌ పనిచేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు..

ఈ మేరకు ఎంపీ లేఖ రాశారు. సంజయ్‌పై చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత ఆధారాలను జతచేశారు.

''విచారణ లేకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేశారు. రాజకీయ పక్షపాతాలు లేకుండా పనిచేయాల్సిన సీఐడీ చీఫ్‌ అన్నీ ఉల్లంఘించారు.

సీఎం జగన్‌ మెప్పు కోసం ప్రతిపక్షాలపై బురద చల్లుతున్నారు. సర్వీసు నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రెస్‌మీట్లు పెడుతున్నారు.

దర్యాప్తు అంశాలను గోప్యంగా ఉంచాల్సిన సీఐడీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్నారు'' అని రామ్మోహన్‌నాయుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు..

Streetbuzz News

Streetbuzz News

ముగిసిన ఖైరతాబాద్ గణేశుని శోభయాత్ర

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. ఎన్టీఆర్‌ మార్గ్ క్రేన్ నెంబర్ - 4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరిగింది. జై భోళో గణేష్ మహారాజ్‌కి జై అంటూ భక్తుల నినాదాల మధ్య గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నారు.

క్రేన్ నెంబర్- 4 వద్ద చివరి పూజలు అందుకున్న తర్వాత సరిగ్గా మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో బడా గణేష్‌ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అయ్యారు.

మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో క్రేన్ నెంబర్-4 వద్దకు మహాగణపతి రాగానే గంటపాటు వెల్డింగ్‌ పనుల అనంతరం గణనాథుడిని నిమజ్జనం చేశారు.

మహాగణపతి నిమజ్జనోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంతగా జనం క్రేన్‌నెంబర్-4 వద్దకు చేరుకున్నారు. బై బై గణేషా అంటూ ఘనంగా బొజ్జ గణపయ్యకు వీడ్కోలు పలికారు.

గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు భక్తజనసంద్రంగా మారిపోయాయి. మహాగణపతి నిమజ్జనానికి రెండు భారీ క్రేన్లను ఉపయోగించారు.

ఇదిలా ఉండగా.. షెడ్యూల్‌ కంటే ముందుగానే ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర ఏడు గంటలపాటు నిర్విర్వామంగా కొనసాగింది.

దారి పొడువుగా గణపయ్యకు భక్తులు నీరాజనాలు పలికారు. మహాగణపతి ముందు యువత తీన్మార్ డ్యాన్సులతో హోరెత్తించారు.

గణేష్ నామస్మరణతో ట్యాంక్‌బండ్ మారుమోగింది. మహాగణపతి నిమజ్జనం పూర్తి అవడంతో మిగిలిన వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం మొదలైంది..

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త MS స్వామినాథన్ కన్నుమూత!

చెన్నై: భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు.

98 ఏళ్ల వయసున్న స్వామినాథన్ చెన్నైలోని ఆయన నివాసంలో ఈ రోజు తుది శ్వాస విడిచారు..

1925 ఆగష్టు 7న మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణం ప్రాంతంలో స్వామినాథన్ జన్మించారు. ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు విశేష కృషి చేశారు.

అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు. ఇది భారతదేశంలోని తక్కువ ఆదాయ గల రైతులు ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేయడానికి సహాయపడింది.

స్వామినాథన్ 1987లో చెన్నైలో ఎం ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. దాని ద్వారా ఆయన మొదటి ప్రపంచ ఆహార బహుమతిని అందుకున్నారు.

స్వామినాథన్ అనేక అవార్డులను అందుకున్నారు. 1971లో రామన్ మెగసెసే అవార్డు, 1986లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు అందుకున్నారు..

Streetbuzz News

బాలాపూర్ గణపతి లడ్డు రికార్డు బ్రేక్

తెలంగాణలో ఎంతో ఎంతో ప్రత్యేకత కలిగిన బాలాపూర్‌ గణేశుడి లడ్డూ ఈ ఏడాది కూడా భారీ ధర పలికింది.

హైదరాబాద్ శివారు తుర్కయాంజాల్‌కు చెందిన దాసరి దయానంద్ అనే వ్యక్తి రూ. 27 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.

ఈసారి లడ్డూ వేలంలో మెుత్తం 36 మంది పాల్గొన్నారు. లడ్డూ వేలానికి ఈ ఏడాదితో 30 ఏళ్లు పూర్తవుతుండగా.. గతేడాది కంటే ఈసారి 2.40 లక్షల ఎక్కువగా లడ్డూకు ధర పలకడం విశేషం.

వేలం అనంతరం దాసరి దయానంద్ గౌడ్ రూ. 27 లక్షలను బాలాపూర్ గణేేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేశారు.

గతేడాది బాలాపూర్‌కు చెందిన వంగేటి లక్ష్మారెడ్డి 24,60,000 లక్షలకు లడ్డూ దక్కించుకున్నారు.

ఈ ఏడాదితో వేలానికి 30 ఏళ్లు పూర్తవుతుండగా.. 2020లో కరోనా కారణంగా వేలం నిర్వహించలేదు. ఆ ఏడాది లడ్డూనూ సీఎం కేసీఆర్‌కు అందజేశారు........

Streetbuzz News

Kishan Reddy : హాట్‌హాట్‌గా బీజేపీ పదాధికారుల సమావేశం.. కిషన్‌రెడ్డిపై నేతల ఫైర్

హైదరాబాద్ : బీజేపీ పదాధికారుల సమావేశం గత రాత్రి జరిగింది. ఈ సమావేశం హాట్‌హాట్‌గా జరిగినట్టు సమాచారం.

పదాధికారుల సమావేశంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ అయిన కిషన్ రెడ్డిపై పలువురు నేతలు ఫైర్ అయ్యారు..

పార్టీ ఏం చేస్తుందో.. ఎన్నికలను ఎలా ఎదుర్కొంటోందో తమకు అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

పార్టీని నమ్ముకుని నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నామని.. మనం మాత్రం ఆఫీసుల్లో కూర్చుని మీటింగులు పెట్టుకుంటున్నామన్నారు.

అయితే పార్టీ మీటింగ్‌లో నెగిటివ్ గా మాట్లాడడం సరి కాదని కిషన్ రెడ్డి వారించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరి పదేళ్ళు అవుతుందని.. ఎలా మాట్లాడాలో తనకు తెలియదా? అంటూ పార్టీ కీలక నేత సంకినేని వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు.

వరంగల్ నరేంద్ర మోదీ సభకు, ఖమ్మం అమిత్ షా సభకు పెద్దగా జనం రాలేదని నేతలు పేర్కొన్నట్టు సమాచారం. అక్టోబర్ 1, 3న జరగనున్న ప్రధాని మోదీ సభలకైనా.. భారీగా జనాల్ని తరలించాలని కిషన్ రెడ్డిని కోరారు.

రాష్ట్ర కార్యాలయంలో తమను ప్రెస్ మీట్‌లు పెట్టనీయడం లేదని అధికార ప్రతినిధులు తెలిపారు. అధికార ప్రతినిధులుగా తమ రోల్ ఏంటో తెలుపాలని బీజేపీ నేతలు కోరారు..

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండను ఢీ కొట్టిన బస్సు

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ఈరోజు ఉదయం పెను ప్రమాదం తప్పింది. 4 వ కిలో మీటరు రాయి వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కొండను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న పలువురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.

డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. తిరుపతి నుంచి తిరుమలకు వస్తుండగా తిరుమలకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

దీంతో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందిన వెంటనే ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు క్రమబద్ధీకరించారు. గాయపడిన వారిని 108 వాహనంలో తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రికి తరలించారు.......

SB NEWS

Streetbuzz News

Streetbuzz News

మొన్న చంద్రుడు.. నిన్న సూర్యుడు.. ఇవాళ శుక్రగ్రహంపై ప్రయోగాలకు ఇస్రో రెడీ..

మొన్నటి చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ ప్రఖ్యాతి గాంచింది. నిన్న సూర్యుడి గుట్టు తెలుసుకునేందుకు ఆదిత్య మిషన్ ఎల్1 ను నింగిలోకి పంపింది..

ఇక ఇప్పుడు శుక్ర గ్రహంపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) రంగం సిద్ధం చేస్తోంది.. చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతమైన నేపథ్యంలో త్వరలోనే వీనస్ మిషన్‌ను చేపట్టనుంది.

సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం అయిన శుక్రుడిపై భారత్ ప్రయోగాలు చేపట్టనుంది. ఇప్పటికే వీనస్ మిషన్కు సంబంధించి రెండు పేలోడ్లు అభివృద్ధి చేసినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు.

శుక్రుడిపై అధ్యయనం చేయడం వల్ల అంతరిక్ష శాస్త్ర రంగంలోని అనేక ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని చెప్పారు. శుక్రగ్రహం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని.. అక్కడి వాతావరణం చాలా మందంగా ఉంటుందని వెల్లడించారు.

భూమి కూడా ఏదో ఒకరోజు శుక్రుడు కావచ్చని .. 10,000 సంవత్సరాల తర్వాత భూమి లక్షణాలు మారిపోవచ్చని సోమనాథ్ పేర్కొన్నారు..

Streetbuzz News

STREETBUZZ NEWS

తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధాని మోడీ మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబరు 1న హైదరాబాద్‌తోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ప్రధాని మోడీ పర్యటించాల్సి ఉంది.

ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాద్‌లో ఆయన పలు అభివృద్ధి పనులకు బేగంపేట ఎయిర్‌పోర్టులోనే శంకుస్తాపన చేయాల్సి ఉంది.

అయితే మారిన షెడ్యూల్‌ మేరకు ప్రధాని బేగంపేట ఎయిర్‌పోర్టుకు కాకుండా ప్రత్యేకంగా విమానంలో నేరుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు.

అక్టోబరు 1న మధ్యాహ్నం 1.30 కు ప్రధాని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 1.35 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు బయల్దేరి వెళతారు.

2.10గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరకుని 2.50 గంటల వరకు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు.

అనంతరం 3 గంటల నుండి 4 గంటల వరకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం 4.10 నిమిషాలకు మహబూబ్‌నగర్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తారు. సాయంత్రం 4.50గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ కి తిరిగి వెళ్లనున్నారు...

Streetbuzz News