అంగన్వాడీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నదెవరు?
ఉమ్మడి రాష్ట్రంలో రోజుల తరబడి సమ్మెచేసినా అంగన్‌వాడీలకు ప్రభుత్వాలు ఒక్క రూపాయి వేతనం పెంచలేదు.
కానీ, నేడు ఏ వినతిపత్రం ఇవ్వకపోయినా మూడుసార్లు వేతనం పెంచిన తెలంగాణ సర్కార్ మీదికి అంగన్‌వాడీలను ఉసిగొల్పుతున్నది ఎవరు?
తమ ఉనికిని కాపాడుకోవటం కోసం రెండు సంఘాలు ఈ పని చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్కున చేర్చుకొని అండగా నిలిచిన సర్కారుపై విషం చిమ్మే కుట్రలో భాగంగానే అంగన్‌వాడీలతో బలవంతపు సమ్మె చేయిస్తున్నారనే వాదనకు ఆదిలాబాద్ ఘటన నిదర్శనమనే వాదన వినిపిస్తున్నది.
అంగన్‌వాడీ కేంద్రం ప్రభుత్వ ఆస్తి.. ప్రభుత్వ ఆస్తిని సొంత ఆస్తిగా భావించి వాటికి తాళాలు వేసి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు భంగం కలిగించి తద్వారా ప్రభుత్వంపై తమ అక్కసును కొన్ని సంఘాలు వెళ్లగక్కుతున్నాయి.
అదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహిళా ఎస్సై పై దాడి కి పాల్పడిన అంగన్వాడి కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.అక్కడ విధులు నిర్వహిస్తున్న,తలమడుగు ఎస్ ఐ ధనశ్రీ,వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అంగన్వాడి టీచర్లు ఆమెపై దాడికి పాల్పడ్డారు జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు.
భౌతికంగా వారు దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన అంగన్వాడీ టీచర్లపై కేసు నమోదు చేశామని పోలీసు చెబుతున్నారు...
Sep 21 2023, 16:27