Hyderabad: సాగర తీరంలో నిమజ్జనాల సందడి.. ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్: గణపతి నిమజ్జనాలకు పలు శాఖ అధికారులతో కలిసి పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
గణపతి ఉత్సవాల్లో బుధవారం మూడో రోజు కావడంతో నిమజ్జనానికి సాగర తీరానికి విగ్రహాలు తరలివస్తున్నాయి..
ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో కలిసి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పర్యటించారు.
సాగర్‌తో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న చెరువుల్లో సుమారు 50వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని భావిస్తున్నట్టు తెలిపారు.
తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా ప్రాంతాల్లో మార్పులు రావడంతో అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్మారకం రావడంతో ఆయా మార్గాల్లో స్వల్ప మార్పులు ఉంటాయని తెలిపారు.
హుస్సేన్ సాగర్‌కు వచ్చే రహదారుల్లో యూటర్న్‌లు, వంతెనల ఎత్తులు, ఎత్తుల వారీగా విగ్రహాల అనుమతిపై సమీక్షించిన సీపీ.. క్రేన్ల ఏర్పాట్లపై కూడా అధికారులతో చర్చించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు..
Sep 20 2023, 19:56