/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz మనిషి కనిపడట్లేడు.. మాట వినపడట్లేదు: కేటీఆర్ ఎక్కడ : రేవంత్ రెడ్డి Yadagiri Goud
మనిషి కనిపడట్లేడు.. మాట వినపడట్లేదు: కేటీఆర్ ఎక్కడ : రేవంత్ రెడ్డి

గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరంలో వర్షాలకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి.

రోడ్లపైకి మోకలాల్లోతు నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఇవాళ మంత్రి కేటీఆర్‌పై సెటైర్లు వేశారు.

‘నువ్వు నిర్మించిన విశ్వనగరం జల విలయంలో విలవిలలాడుతోంది. పండుటాకులా వణికిపోతోంది. హైటెక్ హంగుల వీడియోలు, ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో భ్రమలు కల్పించే కేటీఆర్.. ఇప్పుడెక్కడ? మనిషి కనిపించడం లేదు.. మాట వినిపించడం లేదే’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.......

Mamata Benarjee: రాజ్‌భవన్‌ ఎదుట ఆందోళన చేస్తా: మమత బెనర్జీ

కోల్‌కతా: అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్‌ ఆనంద్‌ బోస్‌ (Anand Bose) తన వద్ద పెండింగ్‌లో పెడుతున్నారంటూ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Benarjee) ఆరోపించారు..

ఇదే తంతు కొనసాగితే రాజ్‌భవన్‌ (RajBhavan) ఎదుట ధర్నాకు దిగుతానని ఆమె అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మమతా బెనర్జీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న యూనివర్సిటీల కార్యకలాపాల్లో గవర్నర్‌ జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా పని చేయకపోతే విశ్వవిద్యాలయాకు రావాల్సిన నిధులను నిలిపివేస్తానని హెచ్చరిస్తున్నారని అన్నారు..

''గవర్నర్‌ చర్యలు పరిపాలనను స్తంభింపజేసేలా ఉన్నాయి. అసెంబ్లీ ఆమోదించిన ఒక్క బిల్లును కూడా ఆయన తిరిగి పంపడం లేదు. అలాగని ఆమోదించడం లేదు. ఒకవేళ ఆయన తిప్పి పంపిస్తే.. సవరణలు చేసి తిరిగి ఆ బిల్లు గవర్నర్‌ ఆమోదానికి వెళ్తే.. కచ్చితంగా ఆమోదించాలన్న నిబంధన ఉంది. అంతేకాకుండా ఒకే బిల్లును రెండుసార్లు వెనక్కి పంపినా అది చట్టం అవుతుంది. అందుకే ఆయన బిల్లులను తన వద్దే పెట్టుకుంటున్నారు'' అని మమతా బెనర్జీ పేర్కొన్నారు..

Pawan: మాజీ సైనికుడిపై హత్యాయత్నానికి తెగబడ్డా పట్టించుకోరా?: పవన్‌ కల్యాణ్‌

అమరావతి: ఒక సైనికుడిగా దేశ రక్షణ విధుల్లో భాగస్వామి అయిన మోపాడ ఆదినారాయణ తన గ్రామంపై బాధ్యతతో ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనుకుంటే పాలకపక్షం అతనిపై హత్యాయత్నానికి తెగబడటం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు..

''దేశాన్ని శత్రువుల నుంచి కాపాడిన వ్యక్తి స్థానిక గూండాల నుంచి ప్రాణహానిని ఎదుర్కొంటున్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం రైతులపాలెంనకు చెందిన ఆదినారాయణపై స్థానిక వైకాపా సర్పంచి సంబంధీకులు తీవ్రంగా దాడి చేస్తే పోలీసులు స్పందించలేదు. హత్యాయత్నానికి సంబంధించిన సెక్షన్లు కాకుండా సాధారణ దాడిగా కేసు నమోదు చేశారు'' అని పవన్‌ అసహనం వ్యక్తం చేశారు..

''వైకాపా నాయకులు ప్రభుత్వ భూములు, కాలువలు కబ్జా చేసి రెవెన్యూ రికార్డులు మారుస్తున్నారని జిల్లా అధికారులకు ఆదినారాయణ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయనపై దాడి చేశారు. భూ కబ్జాదారులు ఎంతకు తెగిస్తున్నారో అర్థమవుతోంది. విశాఖ చుట్టుపక్కల ప్రభుత్వమే సహజ వనరులను ధ్వంసం చేసి విలాసవంతమైన గృహాలు నిర్మించుకుంటోంది. ప్రజా ప్రతినిధులు ఆస్తులు కొల్లగొడుతున్నారు. వారి బాటలోనే అనుచరులు కూడా కబ్జాలు చేస్తున్నారు. ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. యథా పాలకుడు తథా అనుచరుడు అన్న చందంగా వైకాపా పాలన ఉంది..

Nara Lokesh: గ్రంధి శ్రీనివాస్‌.. భీమవరానికి పట్టిన క్యాన్సర్‌ గడ్డ: లోకేశ్‌

భీమవరం: స్థానిక వైకాపా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ భీమవరానికి పట్టిన క్యాన్సర్‌ గడ్డ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు..

యువగళం పాదయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గ్రంధి శ్రీనివాస్‌ అక్రమాలపై వైకాపా కార్యకర్తలే ఫిర్యాదు చేశారన్నారు. జగన్‌ ఇసుకాసురుడైతే.. గ్రంధి శ్రీనివాస్‌ భూబకాసురుడని లోకేశ్‌ ధ్వజమెత్తారు. తక్కువ ధరకు భూములు కొని ఎక్కువ ధరకు అమ్మారని ఆరోపించారు. పేదలకు ఒక్క ఇల్లు కట్టలేదు.. ఆయన మాత్రం పెద్ద ప్యాలెస్‌ కట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

''గ్రంధి శ్రీనివాస్‌ సొంత పార్టీ కార్యకర్తలపైనే కేసులు పెట్టించారు. టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తామన్న హామీ ఏమైంది. భీమవరాన్ని మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతాం. డంపింగ్‌ యార్డు, రింగ్‌రోడ్డు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేస్తాం. కిడ్నీ బాధితులకు డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేస్తాం. ఉండి సెంటర్‌లో వంతెన నిర్మిస్తాం. ఆకివీడు పంచాయతీలో సమస్యలు పరిష్కరిస్తాం. తెదేపా హయాంలో భీమవరంలో రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. తెదేపా అధికారంలోకి రాగానే రోడ్లు బాగు చేస్తాం'' అని లోకేశ్‌ హామీ ఇచ్చారు..

తెలంగాణ గవర్నర్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్‌?

తమిళ సినీ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు బీజేపీ అగ్రనాయకత్వం బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయనకు గవర్నర్ పదవి కట్టబెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రజినీకాంత్‌కు ఈ పోస్ట్ ఇవ్వడం ద్వారా దక్షిణ భారతదేశంలో ఆయన చరిష్మా పార్టీకి కలిసి వస్తుందని, ముఖ్యంగా తమిళనాడులో సీఎం స్టాలిన్‌ను కట్టడి చేయవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలపై పట్టు ఉన్న రజినీకాంత్‌ను తెలంగాణ గవర్నర్‌గా పంపించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది...

కరోనా టీకాకు.. గుండెపోటు ముప్పుకు సంబంధం లేదు

భారత్‌లో వినియోగించిన కరోనా వ్యాక్సిన్లకు, గుండెపోటు (Heart Attack) ముప్పు పెరుగుదలకు ఎటువంటి సంబంధం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది.

కరోనా వైరస్‌ (Coronavirus) విజృంభణ తర్వాత దేశంలో గుండెపోటు ముప్పు పెరిగిందనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా వ్యాక్సిన్‌ ప్రభావం గుండెపోటు (Heart Attack) కేసులు పెరగడానికి ఏమైనా కారణమా అనే అనుమానాలు వచ్చాయి. ఈ కోణంలో కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పరిశోధనలు చేస్తోంది. ఇదే సమయంలో భారత్‌లో వినియోగించిన కరోనా వ్యాక్సిన్లకు, గుండెపోటు ముప్పు పెరుగుదలకు ఎటువంటి సంబంధం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. మన దేశంలో కరోనా వ్యాక్సిన్‌లు (Corona Vaccine) సురక్షితమైనవేనని పరిశీలన అధ్యయనం తెలిపింది. ఇందుకు సంబంధించిన నివేదిక.. పీఎల్‌ఓఎస్‌ వన్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

‘భారత్‌లో వ్యాక్సిన్‌లు సురక్షితమని మా అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో గుండెపోటుకు వ్యాక్సిక్‌లతో సంబంధం లేదు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో గుండెపోటు మరణాలు తక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనంలో గుర్తించాం’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన జీబీ పంత్‌ ఆస్పత్రికి చెందిన మోహిత్‌ గుప్తా వెల్లడించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత అక్యూట్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ (AMI) ఎప్పుడూ కనిపించలేదని తమ విశ్లేషణలో తేలినట్లు చెప్పారు. ఆస్పత్రిలో చేరిన ఏఎంఐ బాధితుల్లో.. వయసు, మధుమేహం, ధూమపానం కారణాల వల్లే మరణం ముప్పు ఎక్కువగా కనిపించిందన్నారు. అయితే, ఇది ఒకే కేంద్రంలో జరిపిన అధ్యయనమని.. ఇందుకు కొన్ని పరిమితులు ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.

గుండెపోటు తర్వాత బాధితుల మరణానికి సంబంధించి వ్యాక్సిన్‌ ప్రభావం ఏమైనా ఉందా..? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు గతేడాది మన దేశంలోనే ఓ అధ్యయనం జరిగింది. ఇందుకోసం దిల్లీలోని జీబీ పంత్‌ ఆస్పత్రిలో ఆగస్టు 2021-ఆగస్టు 22 మధ్య కాలంలో చేరిన 1578 మంది రోగుల సమాచారాన్ని విశ్లేషించారు. వీరిలో 1086 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కాగా.. 492 మంది టీకా తీసుకోనివారే. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 1047 (96 శాతం) మంది రెండు డోసులు తీసుకోగా.. మరో 4శాతం మాత్రం కేవలం ఒక డోసు తీసుకున్నారు.

Botsa Satyanarayana: సాంకేతిక కారణాలతోనే టీచర్ల వేతనాలు ఆలస్యం: బొత్స

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లోని టీచర్లకు జీతాలు ఇంకా వేయలేదని కొందరు విమర్శిస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు..

సాంకేతిక కారణాలతోనే జీతాలు ఆలస్యం అయ్యాయని.. 7 లేదా 8వ తేదీల్లో టీచర్ల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తామని మంత్రి తెలిపారు. విశాఖ ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో రాష్ట్ర గురుపూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.

వేడుకకు మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి పురస్కారాలు అందించారు. ఆయనతోపాటు మంత్రి గడివాడ అమర్‌నాథ్‌, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కార్యక్రమానికి హాజరయ్యారు.

మంత్రి బొత్స మాట్లాడుతూ.. ''రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాలు లేవు. దీనిపై గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదు. ప్రస్తుతం నియామకాలపై సీఎం జగన్‌ దృష్టి పెట్టారు. 3,200 పోస్టులు భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. నెల రోజుల్లో అన్ని వర్సిటీల్లో నియామకాల ప్రక్రియ చేపడతాం.

ప్రభుత్వ పాఠశాల ముందు నో సీట్ బోర్డులు పెట్టె పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. ఏపీలో తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను పరిశీలించాలని నీతి ఆయోగ్ కూడా చెబుతోంది. ప్రధాని మోదీ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ పుస్తకాలను ప్రశంసించారు'' అని బొత్స వెల్లడించారు..

Amitabh Bachchan: 'భారత్‌ మాతాకీ జై' రాజకీయ వివాదం వేళ అమితాబ్‌ ట్వీట్‌..!

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) చేసిన ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆయన 'భారత్‌ మాతాకీ జై' అని ట్విటర్‌లో పోస్టు చేశారు..

కాకుండా.. 'భారత్‌' (Bharat)గా సంబోధించడం మొదలుపెట్టిన నేపథ్యంలో ఈ ట్వీట్‌ చేయడం గమనార్హం. వచ్చే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో దేశం పేరును భారత్‌గా మాత్రమే స్థిరపర్చేలా ప్రత్యేక బిల్లును తీసుకొస్తారన్న ఊహాగానాలు సాగుతున్నాయి.

అమితాబ్‌ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు ఆయనకు మద్దతు పలకగా.. మరి కొందరు మాత్రం ''జయా జీ అంటే మీకు భయం లేదా'' అని సరదాగా వ్యాఖ్యానించారు.

తాజాగా భారత్‌ అధ్యక్షతన జీ-20 సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్‌ 9న ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. దీని ఆహ్వాన పత్రాల్లో President of India అని బదులుగా President of Bharat అని ప్రచురించారు. దీనిని తప్పు పడుతూ కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ట్వీట్‌ చేశారు..

బీసీలు అంటే బిచ్చగాళ్ళు కాదు... మన దేశ నిర్మాతలు

•నక్సలైట్ విప్లవ ఉద్యమ నేత కామ్రేడ్ జే ఎస్ ఆర్

మన దేశ జనాభా 140 కోట్ల మందిని సాదుతున్న ప్రాణదాతలు మన బీసీలు

CPIML secretary JSR

మనదేశ వెన్నెముక బీసీల హక్కులను విస్మరిస్తున్నా దగాకోరు రాజకీయ పార్టీలను బొంద పెట్టండి

ప్రజాస్వామిక వాది

కామ్రేడ్

జే ఎస్ ఆర్ పిలుపు

మండల్ కమిషన్ ముఖ్యమైన సిఫార్సు అయిన బి.సిలకు

ఇకనైనా చట్ట సభలల్లో ప్రాతినిధ్యం అమలుచేయలనీ కామ్రేడ్

జే ఎస్ ఆర్ డిమాండ్

పార్లమెంట్లో మండల్ కమీషన్ నివేదిక అమలు ప్రకటిస్తూ అప్పటి ప్రధాని వి.పి.సింగ్ గారు 1990 ఆగస్టు 7న అన్న మాటలు, "ఇక్కడ పోరాటం. బిసిల జీవనోపాధికి సంబంధించినది కాదనీ... రాజ్యాధికారంలో భాగం కోసం... ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ పేర్కొన్నారు.

మన దేశ జనాభాలో 50% పైగా ఉన్న బిసిలు చేసే పోరాటం ఇది. ఇది కేవలం ఆర్ధిక అంశాలకు సంబంధించిన ప్రశ్న కాదు. ఇది ఈ దేశంలోని బిసిల అస్తిత్వం, ఆత్మ గౌరవానికి దేశంలో అన్ని రంగాలలో ప్రాతినిధ్యం కోసం డిమాండ్ చేసే ప్రశ్న. మనదొక వింత దేశం. ఇక్కడ గౌరవం అనేది సంపదలతో వచ్చేది కాదు. ఇక్కడ గౌరవం కులంతో ముడిపడి ఉంది. కులానికి అధికారం తోడైతే ఆ గౌరవం మరింత పెరుగుతుంది. ఈ దేశంలో ఇప్పుడున్న సామాజిక ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా వివక్షతో వెలివేతలతో కూడుకొని ఉంది. అణచివేయబడిన బలహీన వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది. అలాంటి అణగదొక్కబడిన, సామాజికంగా వెనుకబడిన వారిని, వ్యవస్థలో ఇప్పటికే బాగా అభివృద్ధిచెంది ముందు వరుసలో ఉన్న వారితో పోటీపడాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు సమ సమాజ స్వప్నకుడు నక్సలైట్ కమ్యూనిస్టు సిపిఐ ఎంఎల్ పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జే ఎస్ ఆర్.

ఇలాంటి పద్ధతి ఇప్పటి వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం. సామాజికంగా, విద్యాపరంగా వేలాది సంవత్సరాలుగా వెనక్కు నెట్టివేయబడిన వారిని సామాజికంగా విద్యాపరంగా అభివృద్ధి చెంది ముందు వరుసలో వారితో సమాన స్థాయిలో పోటీపడాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? అని నిష్కళంక దేశభక్తుడు, నిస్వార్థ ప్రజా సేవకుడు... అణగారిన వర్గాల హక్కుల పోరాటయోధుడు...

ఆదర్శ కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్

జె.ఎస్.ఆర్. నేతాజీ నేడు ఇక్కడ విడుదల చేసిన బహిరంగ రేఖలు సమాజాన్ని ప్రశ్నించారు.

ఇలాంటి పద్దతి ఇప్పటి వ్యవస్థలో ఉన్న పెద్దలోపం. అత్యంత అన్యాయం. ఈ అన్యాయాన్ని సరిదిద్దడం చాలా అవసరం. కనుక మేము చాలా స్పష్టమైన అవగాహనతోనే ఈ దేశ పరిపాలనా యంత్రాంగంలో బలహీనవర్గాలకు భాగస్వామ్యం ఇవ్వదలిచాము. ఆ క్రమంలో అధికార వ్యవస్థలో బిసిలను భాగస్వాములను చేయదలిచాము. ”

'విపి సింగ్ గారు మండల్ కమిషన్ అమలు చేస్తుంటే భరాయించ లేక అద్వానీ రధయాత్ర చేసి విపి సింగ్ గారి ప్రభుత్వాన్ని పడవేసారు అలాంటి బిజెపి లో ఉన్నందుకు బిసిలు సిగ్గు పడాలి. ప్రభుత్వ పరిశ్రమలను అమ్ముతున్న బిజెపి లో ఉన్నందుకు సిగ్గుపడాలి. చట్టసభలల్లో బిసి లకు ప్రాతినిధ్య చట్టం తీసుకురాకుండా, చిత్తశుద్ధితో పనిచేయని బిజేపి, కాంగ్రెస్, టీఆర్ఎస్, వైయస్ఆర్సిపి, టీడిపి మొదలయిన పార్టీలలో ఉన్న బిసిలు సిగ్గు పడాలి...

బయటకు రావాలి. చట్టసభలల్లో బిసి లకు ప్రాతినిధ్య చట్టం వచ్చే వరకు బిసి లు ఓట్లు వేయకూడదని నోటా నొక్కాలనే నిర్ణయాన్ని ప్రకటించే శక్తి బిసిలు పొందాలి. చట్ట సభలల్లో బిసి ల ప్రాతినిధ్యాన్ని సాధించాలి. ప్రజాస్వామ్యానికి, సోషలిజానికి పునాదులు వేయాలి. కామ్రేడ్ జే ఎస్ ఆర్ పేర్కొన్నారు.

సురవరం సుధాకర్ రెడ్డి గారు పార్లమెంట్ కోటీశ్వర్ల క్లబ్ గా తయారయింది అన్నారు. దానిని మార్చడానికి చేయాల్సిన కార్యాచరణ గురించి చెప్పలేదు. వాళ్ళ కున్న వర్గపోరాట దృక్పధంతో ఏమి చేయాలో చెప్పరు. చర్చ చేయరు. చట్టసభలు ఉన్నతంగా ఉండాలంటే డబ్బు, మద్యం బహుమతులు పంచేవారు, వారి నాయకులు నేరస్తులు వారిని శిక్షించాలి. పార్టీల రిజిస్ట్రేషన్ రద్దుచేయాలి. అపుడే పార్లమెంట్ అసెంబ్లీలు కోటీశ్వర్ల క్లబ్బులు కావు.... పని అణగారిన వర్గాల హక్కుల కోసం అను దినం పోరాటం కొనసాగిస్తున్న ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్

జే ఎస్ ఆర్ తేల్చి చెప్పారు.

రాజ్యాంగం వలన ఇప్పుడు పార్లమెంట్లో 84, 47 మంది యస్.సి., యస్.టీలు యంపీ లుగా ఉన్నారు. 412 మంది ఒసి లు యంపీ లుగా ఉన్నారు. 131 మంది యస్.సి., యస్.టీ లు యంపీ లు

ఉన్న వారు ఏమి చేయలేకపోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తున్న, మొత్తం ప్రవేటీకరణ చేస్తున్నా మౌనంగా ఉంటున్నారు. ఇంతమంది ఉన్న తమ గళం విప్పడం లేదు. అంబేద్కర్ స్టేట్ సోషలిజం కోరుకుంటున్నారు. భూమి, పరిశ్రమలు ప్రభుత్వం చేతిలో ఉండాలన్నారు. కాని ఈ యంపిలు నోరు విప్పడం లేదు. కనీసం నిరసన తెలియచేయడం లేదు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. కోటీశ్వర్లు, పీడక కులాల వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వలన, వారు మౌనంగా ఉంటున్నారు.... అని ప్రజాతంత్ర ఉద్యమకారుడు బాధితుల బంధువు కామ్రేడ్ జె ఎస్ ఆర్ సార్ ఆరోపించారు.

ఇటువంటి పరిస్థితి వస్తుందని ఒక దార్శనికుడిగా జె ఎస్ ఆర్ గారు బిసిలు చట్టసభలల్లో ఉండాలని కోరుకున్నారు. అపుడే చట్ట సభలు దేశానికీ ప్రాతినిధ్యం వహిస్తాయని జె ఎస్ ఆర్ భావించారు. అందుకొరకు చట్ట సభలల్లో బిసిలు ప్రాతినిధ్యం ఉండాలని, బిసి కమిషన్ వేయాలని జె ఎస్ ఆర్ కోరారు.

విపి సింగ్గారు మండల్ కమిషన్ నివేదికను అమలు చేస్తుంటే అద్వానీ, ఆర్యస్యస్ వాళ్ళు,

బిజేపి వాళ్ళు, వాళ్ళ బానిసలు కమండల యాత్ర చేసి విపి సింగ్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టారు. మండల్ కమిషన్ నివేదిక లో బిసిలకు చట్ట సభలల్లో ప్రాతినిధ్యం ఉండాలని సిఫార్సు కూడా ఉంది. ఆ నివేదిక ను అమలు కాకుండా ఈ ఆర్యస్యస్ వాళ్ళు, వాళ్ళ పార్టీ బిజేపి, వాళ్ళ బానిసలు అడ్డుకున్నారనీ .... జె ఎస్ ఆర్ గారు తెలిపారు.

చివరికి ఈ నాడు కనీసం బిసి జనగణన చేయకుండా అడ్డుకుంటున్నారు. అసలు బిసి జనగణన 2011లో చేసారు. మండల్ కమిషన్ రిపోర్ట్ లో కూడా బిసి ల లెక్కలు ఉన్నాయి వాటిని ప్రాతిపదికగా తీసుకోవచ్చు. కాని తీసుకోరు. కాని ఈ ప్రభుత్వం 10% ఇ.డబ్ల్యు యస్. రిజర్వేషన్ కయితే ఒక వారంలోనే చేసుకుంది. బిసీ ల కోసం అయితే చేయదు. ఇంత జరుగుతున్న బిసి సంఘాలు ఐక్యంగా కదలరు. ఐక్యంగా ఉద్యమించరు. బిసి మంత్రులు, యంపి, యంయల్.ఎ లు రాజీనామా చేయాలి. అంబేద్కర్ గారి స్ఫూర్తితో యస్, యస్సీ యంపి లు అంబేద్కర్ వాదులు చట్ట సభలల్లో బిసిల ప్రాతినిద్యం రాజ్యాంగ సవరణ చేయించడానికి ముందుకు రావాలి. మనకి యాగాలు, యజ్ఞాలు, దేవాలయాలు కాదు కావల్సింది. చట్ట సభలల్లో బిసి లకు 52% ప్రాతినిధ్యం. అపుడే అందరికి ఉచిత విద్య, వైద్యం వస్తుంది. దేశం ముందుకు పోతుంది. అందుకు బిసిల ప్రాతినిధ్యం ఉండాలి. అప్పుడే చట్టసభలు బాగుంటాయి. దేశం బాగుంటుందనీ కామ్రేడ్ జే ఎస్ ఆర్ తెలిపారు.

70 సం||లు బ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు, కమ్మలు, రెడ్లు, దొరలు వాళ్ళ బానిసలే అధికారంలో ఉన్నారు. మరియు ప్రతిపక్షంలో ఉన్నారు. ఉద్యమాలకు నాయకత్వం వహించారు. వహిస్తున్నారు. ఉ ద్యమాలు, పోరాటాలు చేస్తున్నారు. అయినా దేశం లో పేదరికం ఎందుకు వుంది. చరిత్రలోను వర్తమానం లోను ఈ దేశ ప్రజల సమస్యలకు కారణాలు ఏమిటి. ఎవరు కారకులు అని అద్యయనం చేసారా. చేయరు... తీవ్రమైన పాదం వ్యక్తం చేశారు.

ఇందాక గోరుతో పెళ్లి రాజకీయ పార్టీల వాళ్ళకు అధికారం కావాలి. నాయకత్వం కావాలి. ఆస్తులు పెంచుకోవాలి. కానీ వీళ్ళకు అందరికి విద్యవద్దు. ప్రజాస్వామ్యము వద్దు. సోషలిజం వద్దు.

చట్ట సభలు బాగుండాలంటే ప్రజాస్వామ్యం ఉండాలంటే దేశం బాగుండాలంటే బిసిలు చట్ట సభలల్లో ఉండాలి. బిసి లంటే శ్రమ జీవులు. యస్సీ యస్టీ, బిసిలు శ్రమ జీవుల పాలన కావాలంటే 52శాతం బిసిల ప్రాతినిధ్యం అవసరం.... అని కామ్రేడ్ జై బొరన్న గారు పేర్కొన్నారు.

131 మంది ఏస్ టీ,, యస్సీ, యంపి లు ఉన్నా ఏమి చేయలేకపోతున్నారు. ఎందుకంటే మిగతా 412 మంది ఓసీలు. అందుకని ఏమి చేయలేకపోతున్నారు. కనీసం నిరసన కూడా తెలియచేయడం లేదు. అదే 270(52%) బీసీలు ఉంటే వాళ్ళ గళం ఇంకొక రకంగా ఉంటుంది. 410 (యస్సి, యస్ టి, బిసి) యంపీ లు ఉంటే అది శ్రమజీవుల గళం అవుతుందనీ...

జై భారత్ క్రాంతి బోర రాజన్న

రిషి త్రినేత్రుడు జె కె గారి

సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ అన్నమయ్య జె ఎస్ ఆర్ సా ర్

9848540078 తెలిపారు.

శ్రమ జీవుల పాలన అవుతుందనీ జె ఎస్ ఆర్ గారు పేర్కొన్నారు. అందుకొరకు మండల్ కమిషన్ చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఉండాలని ముఖ్యమైన సిఫార్సు చేసింది అ సిఫార్సు అమలుకు బీసీ సంఘాలు ఐక్యంగా కృషి చేయాలనీ ...బిసి సంఘాలు ఐక్యతతో, కలసివచ్చే శక్తులతో, అంబేద్కర్వాదులతో, ఐక్యతతో కృషి చేసి చట్టసభలల్లో బిసి లకు 52% ప్రాతినిధ్యం కొరకు ఉద్యమించాలి, సాదించాలి... అని ప్రజా బంధువు కామ్రేడ్ జె ఎస్ ఆర్ గారు తెలిపారు.

ప్రజాస్వామ్యం, సోషలిజం, రాజ్యాంగం వర్ధిల్లాలి.... బీసీ లారా మీరు బిచ్చగాళ్లు కాదు... ఈ దేశ నిర్మాతలు... అని ప్రజా నేస్తం కామ్రేడ్ జె ఎస్ ఆర్ గారు8328277285 తెలిపారు

బహుజన రాజ్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జనవరి 3 వ తేదీన జరుపుకుందాం: బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బహుజన రాజ్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జనవరి 3 వ తేదీన జరుపుతామని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఈ మేరకు ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ దేశంలో పేద వర్గాలు, మరి ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా మహిళల, వితంతువుల చదువు కోసం అలుపెరగని కృషి చేసిన మొదటి తరం మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి ఫూలే అని ప్రవీణ్ కుమార్ కొనియాడారు..

పేద వర్గాలకు చదువునందించే క్రమంలో ఎన్నో అవమానాలు, బెదిరింపులను ఫూలే దంపతులు ఎదుర్కొన్నారన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి రోజున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుతామన్నారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ వల్ల మెజారిటీ పేదలకు చదువు వచ్చిందని గాని, ఉపాధ్యాయుల పనీతీరు మెరుగైందని చెప్పడానికి పెద్దగా చారిత్రక ఆధారాలు లేవని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు......