/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల Yadagiri Goud
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

మంచిర్యాల జిల్లా :

హాజీపూర్‌ శ్రీరాంసాగర్‌, కడెం ప్రాజెక్ట్‌లతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ 20 గేట్లు 2 లక్షల క్యూసెక్కులనీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నీటిమట్టం 20.175 టీఎంసీలకు గాను 18.110 టీఎంసీలతో ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి దాదాపు 1.67 లక్షల క్యూసెక్కులు ప్రా జెక్ట్‌లోకి చేరుతోంది.

హైదరాబాద్‌ మెట్రో వా టర్‌ వర్క్స్‌ పథకానికి 311 క్యూసెక్కులు, 20 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు...

గుంతకల్ రాయదుర్గం పలు నియోజకవర్గాల్లో చంద్రబాబు నేడు పర్యటన

నేటి నుంచి మూడు రోజులు పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. బాబు ష్యురిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

నేడు ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు బళ్లారి జిల్లా జిందాల్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. బళ్లారిలో స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి ఆంధ్ర - కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన రాయదుర్గం నియోజకవర్గం ఓబులాపురం చెక్‌పోస్ట్‌కు చేరుకుంటారు.

రాయదుర్గం నియోజకవర్గం పల్లె పల్లె సమీపంలో వేరుశనగ రైతులతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు రాయదుర్గం పట్టణానికి చేరుకుని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

రేపు 6న కళ్యాణదుర్గం, 7న గుంతకల్లు నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. చంద్రబాబు రాక సందర్భంగా ఘనంగా టీడీపీ శ్రేణులు స్వాగత ఏర్పాట్లు చేశారు...

Hyderabad | హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. రోడ్లన్నీ జలమయం..

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో (Hyderabad) పలు చోట్ల కుండపోతగా వర్షం (Heavy rain) కురుస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉంది..

ఖైరతాబాద్‌, అమీర్‌పేట, సోమాజీగూడ, నాంపల్లి, మలక్‌పేట, సైదాబాద్‌, పాతబస్తీ, ఎల్బీనగర్‌, సాగర్‌రింగ్‌రోడ్‌, హస్తినాపురం, బీఎన్‌రెడ్డి, నాగోల్‌, ఉప్పల్‌, హబ్సిగూడ, తార్నాక, ఈసీఐఎల్‌, సికింద్రాబాద్‌, బేగంపేట, అడ్డగుట్ట, మారేడుపల్లి, ప్యాట్నీ,

ప్యారడైస్‌, బోయిన్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బొల్లారం, చిలకలగూడ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, కేపీహెబీ కాలనీ, ఆల్విన్‌ కాలనీ, మియాపూర్‌, కుత్భుల్లాపూర్‌, బీహెచ్‌ఈఎల్‌, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, మెహదీపట్నంలో వాన దంచికొడుతున్నది..

తల్లిదండ్రుల తర్వాత గురువుల పాత్ర వెలకట్టలేనిది : సీఎం కేసీఆర్

ఉపాధ్యాయుల దినోత్సవం మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానం పెంపొందించి, లక్ష్యం పట్ల వారి కి స్పష్టమైన అవగాహన కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని పేర్కొన్నారు. ‘మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ’ అనే సూక్తి, తల్లిదండ్రుల తర్వాత గురువులకు ఉన్న ప్రాధాన్యం తెలియజేస్తున్నదని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఉపాధ్యాయుల, విద్యార్థుల సంక్షేమానికి, అభివృద్ధికి సమర్థవంతమైన కార్యాచరణను అమలుచేస్తున్నదని వివరించారు. గురుకుల విద్యలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, నాణ్యమైన విద్యను అందిస్తూ రేపటి తరాన్ని తీర్చిదిద్దడంలో ముందంజలో ఉన్నదని తెలిపారు.

గుణాత్మక విద్యను అందిస్తూ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ సత్ఫలితాలను ఇస్తున్నదని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలతో నేడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు చదువుల్లోనూ, క్రీడల్లోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటుతుండటం గర్వకారణమని అన్నారు. విద్యారంగ ప్రగతి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న అంకితభావానికి, చిత్తశుద్ధికి ఇది నిదర్శమని పేర్కొన్నారు...

Viral Wedding Reception: కోనసీమలో పెళ్లంటే మాములుగా ఉండదు.. ట్రెండ్ సెట్ చేస్తున్న కొత్త జంట..

పెళ్లంటే ఓ సందడి వాతావరణం ఉంటుంది. పెళ్లింట్లో బంధువులు, ఫ్రెండ్స్, పిల్లలు, పెద్దలతో కోలాహలంగా మారుతుంది. రెండ్రోజులు ముందుగానే సందడి సందడిగా ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతారు..

మంగళస్నానం దగ్గరి నుంచి పెళ్లి అయిపోయేంత వరకు ఓ పండగలా జరుగుతుంది. అయితే పెళ్లి రోజు మాత్రం వెరీ స్పెషల్. తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో వధువరులు ఒక్కటవుతారు. ఆ తర్వాత రిసెప్షన్ కార్యక్రమం ఉంటుంది. అందులో వధువరులిద్దరూ ఫొటోలు దిగడం, వీడియోలు తీసుకుని వారి మెమోరీస్ ను గుర్తించుకుంటారు. అయితే ఓ పెళ్లిలో రిసెప్షన్ కు వెళ్లడానికి ఊరేగింపు కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎలా అంటే..!

పెళ్లిళ్లలో కోనసీమకు ఒక ప్రత్యేకత ఉంటుంది. పెళ్లికి ముందు కానీ, పెళ్లి తర్వాత కానీ అల్లుళ్లకు గ్రాండ్ గా వంటకాలు చేసి పెట్టిన సంఘటనలు విన్నాం, చూశాం. కానీ ఇప్పుడు సుఖేష్, శ్రీ రంగనాయకి అనే కొత్త జంట ట్రెండ్ సెట్ చేస్తుంది. రాజోలులో వధూవరులిద్దరూ వెడ్డింగ్ రిసెప్షన్ కు తీసుకెళ్తుండగా భారీ ఊరేగింపును ఏర్పాటు చేశారు.

కారులో కూర్చున్న ఈ జంట చుట్టూ బౌన్సర్లు, బుల్లెట్ బైకులపై మహిళలు పైలట్ గా తీసుకెళ్తున్నారు. డప్పు, వాయిద్యాల మధ్య బాణాసంచా పేల్చూతూ ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా ముందు, వెనుకాల భారీగా జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ నూతన జంటకు సంబంధించిన ఊరేగింపు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఊరేగింపును చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు నెటిజన్లు ఊరేగింపును ఇంత గ్రాండ్ గా జరుపుకుంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతైనా కోనసీమలో పెళ్లంటే మాములుగా ఉండదని అంటున్నారు.

కోస్తాంధ్రకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.

నెల రోజుల విరామం అనంతరం ఏపీలో మళ్లీ వర్షాల జోరు మొదలైంది. గత రెండ్రోజులుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గణనీయమైన స్థాయిలో వర్షపాతం నమోదైంది.

తాజాగా భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో ఈ నెల 5, 6 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ నెల 6న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. రాబోయే రెండ్రోజుల్లో 11.56 సెంమీ నుంచి 20.44 సెంమీ వరకు రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది..

ప్రమాదాల నివారణకు కృషి చేయాలి

•వంగూరి దామోదర్

నాగారం మండల పరిధిలోని ఈటుర్ ,పనిగిరి స్టేజి వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని టెక్నో డీడ్ ఐటీ కంపెనీ చైర్మన్ వంగూరి దామోదర్ అన్నారు.

ఈ సందర్భంగా స్థానిక నాగారం ఎస్సై కి సోమవారం వెనక్కి పత్రాన్ని అందజేసి స్టేజ్ వద్ద భారీ కేసును ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నర్సయ్య, నర్సింహ, రమేశ్, సందీప్, సురేష్, గోపి పాల్గొన్నారు.

నకిరేకల్ నియోజకవర్గం MLA అభ్యర్థిగా అవకాశం ఇవ్వండి : శేపూరి రవీందర్

•పార్టీ అబివృద్దికి కృషి చేస్తాను

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేపూరి రవీందర్ గారు నకిరేకల్ నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని తన రాజకీయ అనుభవ పత్రాన్ని సమర్పించారు.

గతంలో mptc, zptc గాను, ప్రస్తుతం చిట్యాల మున్సిపాలిటీ1వ వార్డు కౌన్సిలర్ గా కొనసాగుతున్ననని అని తెలుపుతూ ,వచ్చే శాసనసభ ఎన్నికలలో నకిరేకల్ నియోజకవర్గం MLA అభ్యర్థిగా ప్రకటంచాలని కోరారు.

బీజేపీ పార్టీ అబివృద్దికి కృషిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల, నకిరేకల్ పట్టణ అధ్యక్షులు కురెల్ల శ్రీను,పల్సా శ్రీను,నకరేకల్ ,కేతేపల్లి మండల అధ్యక్షులు యానాల శ్రీనివాస్ రెడ్డి,రాచకొండ గోపి లు పాల్గొన్నారు,

బీజేపీ జిల్లా సీనియర్ సిటిజన్ కన్వీనర్ పాల్వాయి భాస్కర్ రావు, sc మోర్ఛ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాస శ్రీనివాస్,మహిళా మోర్ఛ జిల్లా ఉపాధ్యక్షురాలు పాపని వనజ, sc మోర్చ నియోజక వర్గ కన్వీనర్ కోరబోయిన లింగ స్వామి,కిసాన్ మోర్చ నియోజక వర్గ కన్వీనర్ జిట్టా కృష్ణ,

భువనగిరి యాదాద్రి జిల్లా obc మోర్చా ఉపాధ్యక్షుడు పల్లపు దుర్గయ్య, నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు, కోళ్ల స్వామి,పల్లె వెంకన్న, ప్రధాన కార్యదర్శి లు గంజి గోవర్ధన్,తరాల శ్రీనివాస్,

మండల సహా ఇంఛార్జి లు చికీలంమెట్ల అశోక్, జయారపు రామకృష్ణ ,సీనియర్ నాయకులు ముడుసు బిక్షపతి,చెరుకు లింగాస్వామి,పబ్బు వెంకన్న, సిగ స్వామి,రావుల వెంకన్న,పాకాల దినేష్ లు పాల్గొన్నారు.

గూగుల్‌ సిల్వర్‌ జూబ్లి.. విషయాలు వైఫల్యాలు

నేడు ఇంటెర్నెట్‌ సెర్చింజన్‌ గూగుల్‌ పుట్టినరోజు. సరిగ్గా పాతికేళ్ల కిందట ఇదే రోజున గూగుల్‌ ఆవిర్భావం జరిగింది. గూగుల్‌ అనే పదం డిక్షనరీలోకి అధికారికంగా ప్రవేశించి 17 సంవత్సరాలు అయ్యింది. ఇద్దరు హార్వర్డ్‌ విద్యార్థులు డార్మ్‌లో దీనికి రూపకల్పన చేశారు. 4 సెప్టెంబర్‌ 1998లో లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌ దీన్ని ప్రారంభించినప్పుడు గూగుల్‌ కేవలం ఒక శోధన ఇంజిన్‌ మాత్రమే. కాలక్రమంలో ఒక్కో మెట్టు పైకెక్కుతూ సామాజిక మాధ్యమాల నుంచి యూటూబ్‌ వరకు, అక్కడి నుంచి పేమెంట్‌ సేవల వరకు విస్తరించింది.

ఇప్పుడ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఏఐ శకానికి బాటలు వేస్తోంది. గూగుల్‌ కంపెనీ ఇప్పుడు ఆల్ఫాబెట్‌ పేరెంట్‌ గ్రూప్‌లో భాగమయ్యాక టెక్నాలజీ దిశగా విస్తరించింది. కొన్ని విభాగాల్లో ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తుంది. ప్రస్తుతం ఏఐ కృత్రిమమేథ రేస్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది.

విజయాలు.. వైఫల్యాలు

ఇ-మెయిల్‌, స్మార్ట్‌ఫోన్‌లు, సాప్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, డ్రైవర్‌లెస్‌ కార్లు, డిజిటల్‌ అసిస్టెంట్‌లు, యూట్యూబ్‌, వందల కొద్దీ ఉత్పత్తులు, సేవలను గూగుల్‌ సృష్టించింది. కానీ అవన్నీ వర్కవుట్‌ కాలేదు. కిల్డ్‌ బై గూగుల్‌ వెబ్‌సైట్‌లో 288 రిటైర్డ్‌ ప్రాజెక్ట్‌లు జాబితా చేయబడ్డాయి. ఇందులో గేమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ స్టేడియా, బడ్జెట్‌ విఆర్‌ హెడ్‌సెట్‌ గూగుల్‌ కార్బ్‌బోర్డ్‌ వంటివి ఉన్నాయి. కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో గూగుల్‌ తన సర్వవ్యాప్తిని కొనసాగించగలదా అన్నది నేటి ప్రశ్న. అయితే ఈ ప్రయత్నంలో కొంత వెనక్కు తగ్గిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

కృత్రిమ మేథ ప్రయోగం మొదట్లో చాలామందిని ఆకట్టుకుంది. ఇది నవంబర్‌ 2022లో చాట్‌జీపీటీ పేరుతో ప్రపంచానికి పరిచయం అయింది. మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థల నుంచి బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను పొందింది. అయితే పేజీల కొద్దీ సమాచారం ఇచ్చే సెర్చింజన్‌కి బదులుగా, ఒక ప్రశ్నకు ఒకేసారి సమాధానం ఇవ్వడం వల్ల చాట్‌జీపీటీ గూగుల్‌ కిల్లర్‌”గా మారిందన్న అపోహలు తలెత్తాయి.

.అయితే, అల్ఫాబెట్‌ తన గూగుల్‌ క్లౌడ్‌ వ్యాపారంతో ఏఐ విప్లవానికి కేంద్రంగా నిలుస్తోంది. భారీ, చిన్న వ్యాపారాల నుండి మంచి డిమాండ్‌ ఉన్నందున, మౌలిక సదుపాయాలను, నిల్వను అప్‌డేట్‌ చేయడానికి క్లౌడ్‌ మంచి ఆదాయ వనరుగా నిలుస్తోంది. అమెజాన్‌ వెబ్‌సర్వీస్‌, మైక్రోసాఫ్ట్‌ అజూర్‌తో పోల్చితే గూగుల్‌ క్లౌడ్‌ చిన్నదే అయినప్పటికీ సమర్థవంతమైనదిగా పేరు తెచ్చుకుంది.

మాంచెస్టర్‌ సిటీ అసలు పేరు తెలుసుకోవడం నుండి ప్రపంచంలోని అతి చిన్న పెంగ్విన్‌ జాతులను గుర్తించడం వరకు, ఎలైట్‌ మేధావులు సైతం ఒకప్పుడు సమాధానం చెప్పలేని ప్రశ్నలకు గూగుల్‌ మాస్టర్‌గా నిలిచింది. ఇంటర్నెట్‌ ప్రారంభంతో, లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌ గూగుల్‌ను పరిచయం చేయడం ద్వారా క్విజ్‌ ప్రపంచాన్ని కూడా మార్చేశారు. గూగుల్‌ ప్రారంభంతో ఇప్పుడు లైబ్రరీలలో తిరుగుతూ, ఎన్‌సైక్లోపీడియాలను కంఠస్థం చేసేరోజులు పోయాయి...

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ ,

అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలో నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూర్ గ్రామానికి చెందిన వేముల లింగస్వామి కుమార్తె వివాహానికి ఆదివారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన వధువరువులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వేముల వీరేశం అనుచరులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

SB NEWS