/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz వీఓఏలకు తెలంగాణ సర్కారు గౌరవ వేతనం పెంపు!! Yadagiri Goud
వీఓఏలకు తెలంగాణ సర్కారు గౌరవ వేతనం పెంపు!!

వీఓఏలకు తెలంగాణ సర్కారు రాఖీ పండగ వేళ గుడ్ న్యూస్ చెప్పింది. వీఓఏలకు గౌరవ వేతనం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రూ.3,900 నుంచి రూ.5వేలకు వేతనాన్ని పెంచింది. అదనపు సాయం రూ.3వేలతో కలిపి నెలకు రూ.8వేలను వీఓఏలు అందుకోనున్నారు.

ఈ మేరకు గౌరవ వేతనం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 17,608 మంది వీఓఏలకు లబ్ధి చేకూరనుంది...

ప్రతిపక్షాలు పొలిటికల్ టూరిస్టులాంటివారు :హరీష్‌రావు ఎద్దేవా

నకిలీ హామీలు, వెకిలి చేష్టలు చేయడమే ప్రతిపక్షాలు పని అంటూ మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ..

తెలంగాణ కన్నా మెరుగైన పాలన ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారంటూ ఎద్దేవా చేశారు. మొన్న అమిత్ షా, నిన్న ఖర్గే వచ్చి పేపర్ పై రాసిచ్చిన హామీలు చదివి వెళ్లారన్నారు. వారికి రాష్ట్రం పైన ఎలాంటి అవగాహన లేదని తెలిపారు.

తెలంగాణ అభివృద్ధి విషయంలో మాటలు కాకుండా చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైద్యారోగ్య రంగంలో దేశంలోనే 3 వ స్థానంలో ఉన్నామన్నారు. తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ వన్‌గా ఉన్నది తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రనికే కాదు దేశానికే అన్నం పెట్టె స్థాయికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు.

ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్ పార్టీ వస్తుందని... హ్యాట్రిక్ కొట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మూడవ సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రానున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ స్లోగన్‌లు చేసే పార్టీ కాదు... సొల్యూషన్ ఇచ్చే పార్టీ అని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.......

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది :రేపటి నుండి అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ దాదాపు ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం పోలీస్, రెవెన్యూ అధికారులతో సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. గత రెండు రోజులుగా జిల్లా కలెక్టర్లు ఎస్పీ లతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహించింది.

తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎన్నికల ప్రక్రియపై పలు సూచనలు ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు సూచనలు చేస్తున్నారు.

  

సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో రేపటి నుండి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.

వికలాంగులు, వృద్ధులు ఇంటి నుండే ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.

పోలింగ్ తేదీ కంటే మూడు రోజుల ముందే పోలింగ్ కేంద్రాలకు రాలేని వృద్ధులు, వికలాంగుల ఇంటికే ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు తీసుకువెళ్లి వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలని సూచించారు....

త్వరలో 2 వేల మంది బస్‌ ఆఫీసర్ల నియామకం

నష్టాల బాట నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న టీఎస్‌ఆర్టీసీ మరో కొత్త కార్యాచరణకు సిద్ధమైంది. ఇప్పటికే పల్లె వెలుగు, గ్రామీణ ప్రాంత ప్రయాణికుల కోసం పలు ఆకర్షణీయ పథకాలు అమలులో ఉన్నాయి. అలాగే, నగర ప్రాంతాల్లోనూ టీ-24, టీ-9 వంటి రాయితీలతో కూడిన టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి.

తాజాగా, నగర, గ్రామీణ ప్రాంతాలలోని కాలనీల ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల వైపు ఆకర్శించే విధంగా త్వరలో 2 వేల మంది కాలనీ, బస్‌ ఆఫీసర్లను నియమించాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నిర్ణయం త్వరలోనే అమలులోకి రానుంది.

బస్‌ ఆఫీసర్ల నియామకం, వారి విధులకు సంబంధించి టీఎస్‌ఆర్టీసీ ఎండి సజ్జన్నార్‌ ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేశారు. కాగా, నగర ప్రాంతాలలో నియమితులయ్యే కాలనీ బస్‌ ఆఫీసర్లు ఆయా నగరాల్లోని వివిధ కాలనీలలో తిరిగి టీఎస్‌ ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తే కలిగే ప్రయోజనాలు, సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు.

అలాగే, నగరంలో వాణిజ్య ప్రాంతాలతో పాటు కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతాలకు షాపింగ్‌, వినోదం వంటి కారణాలతో ప్రజలకు ఎక్కువగా వస్తుంటారు..

ఎక్కువగా సిటీ బస్‌లు అందుబాటులో ఉండకపోవడం, బస్టాపులు వీటికి దూరంగా ఉండటంతో ప్రజలు క్యాబ్‌లు, ఆటోలు వంటి ప్రైవేటు రవాణా వ్యవస్థపై ఆధారపడుతున్నారు. ఆర్టీసీ నియమించే కాలనీ బస్‌ ఆఫీసర్లు తమకు కేటాయించిన కాలనీలలో తరచూ పర్యటించి ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు, మహిళలు, విద్యార్థులు షాపింగ్‌, వినోదం కోసం ఎక్కడికి వెళుతున్నారు ? ఏ రవాణా సౌకర్యాలను వినియోగిస్తున్నారు ? వంటి సమాచారరం తెలుసుకుని వారికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయిస్తారు.

అలాగే, కాలనీలలో జరిగే వివాహాలు, ఇతర శుభకార్యాల సమాచారాన్ని సైతం సేకరించి సంబంధిత వ్యక్తులకు తమ బస్సులను బుక్‌ చేసుకోవాలని సూచిస్తారు.

ఒకవేళ ఆ ప్రాంతం నుంచి ప్రజల డిమాండ్‌ను బట్టి అదనపు బస్సులు సైతం ఏర్పాటయ్యేలా చూస్తారు. అలాగే, అయితే, ఆయా కాలనీలలో నివసించే డ్రైవర్లు, కండక్టర్లనే కాలనీ బస్‌ ఆఫీసర్లుగా నియమిస్తారనీ, ఆ అధికారం ఆ ప్రాంత బస్‌ డిపోల మేనేజర్లకే అప్పగించనున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.

ఇక విలేజి బస్‌ ఆఫీసర్లు సైతం ఇవే అంశాల ప్రాతిపదికన విధులు నిర్వర్తించనున్నారు. తమ ప్రాంత పరిధిలోని గ్రామ పెద్దలు, అసోసియేషన్లు, ఇతర ప్రముఖులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు.

కాగా, నగర, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక బస్సులను బుక్‌ చేసిన కాలనీ, బస్‌ ఆఫీసర్లను అవార్డుల రూపంలో సన్మానించాలని సైతం టీఎస్‌ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.

కాగా, టీఎస్‌ఆర్టీసీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10 వేల గ్రామాల్లో బస్సు సర్వీసులను నడిపిస్తున్నది. ఏ సీజన్‌లో ఆ సీజన్‌కు తగిన విధంగా టికెట్ల రేట్లను తగ్గించడం, ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడం వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టి ఆదాయం పెంచుకుంటున్నది. దీంతో పాటే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సు సర్వీసులను సైతం నడిపిస్తున్నది.....

రేవంత్ రెడ్డి ఇంట్లో రాఖీ పండుగ సందడి

ములుగు ఎమ్మెల్యే సీతక్క గురించి తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన స్టైళ్లో తెలుగు రాజకీయాల్లో రాణిస్తున్నారు. తెలంగాణలోని ములుగు నియోజవవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆదర్శవంతంగా సేవ చేస్తున్నారు.

ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఆమె చేసిన సేవా కార్యక్రమాలు అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే నియోజకవర్గ ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని పలువురు అభిప్రాయపడుతుంటారు. ఆమె రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తుంది. అయితే నేడు రాఖీ పండుగ కావడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంట్లో గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌కు రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు.

YS Sharmila: సోనియా, రాహుల్‌తో వైఎస్‌ షర్మిల భేటీ..

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. గురువారం ఉదయం దిల్లీలో ఆమె వారిని కలిశారు..

అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే సోనియా, రాహుల్‌తో తాను చర్చించినట్లు తెలిపారు..

రాష్ట్ర ప్రజలకు మేలు చేసే దిశగా తాను నిరంతరం పనిచేస్తుంటానని షర్మిల చెప్పారు. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. వైతెపాను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో సోనియా, రాహుల్‌తో షర్మిల భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాంగ్రెస్ చేతిలోకి వైఎస్ఆర్ టీపీ పార్టీ ❓️

షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనానికి సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీతో ఆమె గురువారం ఢిల్లీలో భేటీ కానున్నారు.

అనంతరం విలీనంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ అగ్ర నేతలతో చర్చలు జరిపేందుకు బుధవారం ఆమె తన భర్త అనిల్‌తో కలిసి హస్తిన చేరుకున్నారు. వైఎ్‌సఆర్‌టీపీ నేతలకు గానీ, భద్రతాసిబ్బందికి గానీ సమాచారం ఇవ్వకుండా వెళ్లినట్లు సమాచారం. సెప్టెంబరు 2న వైఎస్‌ వర్ధంతి ఉన్నందున ఈలోపే విలీనంపై కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం నుంచి స్పష్టమైన హామీ లభిస్తుందని ఆమె ఆశిస్తున్నట్లు తెలిసింది.

సోనియాతో భేటీ తర్వాత విలీనం ఖరారవుతుందని.. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారని విశ్వసనీయ వర్గాలు కూడా తెలిపాయి. జగనన్న వదిలిన బాణాన్ని జగన్‌పైనే ప్రయోగించబోతున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తొలుత తెలంగాణలో ఆమె సేవలు వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ భావించినా.. ఆంధ్రప్రదేశ్‌లో అయితేనే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని, ఆమె ద్వారా జగన్‌ను కట్టడి చేయొచ్చని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో బీజేపీ కూడా బలహీనంగా ఉన్నందున కాంగ్రెస్‌ పుంజుకోవడానికి షర్మిల చేరిక లాభిస్తుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, అన్న జగన్‌ జైలులో ఉండగా.. ఆయన వదిలిన బాణంగా రాష్ట్రమంతటా తిరిగి వైసీపీని బలోపేతం చేసిన షర్మిల.. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ పాలుపంచుకున్నారు.

అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచాక తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం.. ఆస్తిలో వాటా ఇచ్చేందుకూ జగన్‌ నిరాకరించడంతో.. ప్రత్యామ్నాయం వైపు మళ్లారు.

తెలంగాణలో వైఎస్ఆర్‌ టీపీ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర కూడా చేపట్టారు. తొలుత తెలంగాణకే పరిమితమైన ఆమె.. తల్లి విజయలక్ష్మిని వైసీపీ గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి జగన్‌ నిర్దాక్షిణ్యంగా తొలగించిన దరిమిలా ఏపీ రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలిసింది.

ఇదే సమయంలో వైఎస్‌ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ద్వారా ఆమెను పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆయనతోను, ఆ పార్టీ నేతలతోను పలు దఫాలు చర్చలు జరిపిన ఆమె.. రాహుల్‌గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలియజేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. కాంగ్రెస్‌లో పార్టీ విలీనానికి ఇది సంకేతమని ఆనాడే వార్త లు వెలువడ్డాయి.

గురువారం సోనియాతో సమావేశం తర్వా త విలీన ప్రక్రియ పూర్తిగా కొలిక్కి వస్తుందని వైఎస్ఆర్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి.......

తెలంగాణ ప్రజలకు అలర్ట్.. పెరుగనున్న ఉష్ణోగ్రతలు !

తెలంగాణ మరింత ఉష్ణోగ్రతలు పెరుగనున్నాయి. తెలంగాణలో గత కొన్ని రోజులుగా వరుణుడి జాడ కనిపించడం లేదు. ఈసారి నైరుతి రుతుపవనాల రాకే ఆలస్యం కాగా, జూన్ నెలలో సరిగ్గా వర్షాలు కురవలేదు..

దీంతో ఆ నెల లోటు వర్షపాతం నమోదయింది. ఇక జూలై చివరి వారంలో వర్షాలు దంచి కొట్టాయి.

తెలంగాణ రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. భారీ వరదల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయారు. జూలై నెలలో రికార్డు వర్షపాతం నమోదయింది. ఇక ఆగస్టు వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. వేడి గాలులు, విపరీతమైన ఉక్కపోత ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. వర్షాలు లేక అన్నదాతలు తలలు పట్టుకుం టున్నారు. అయితే… మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది..

Srisailam: శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన 15 దుకాణాలు!

నంద్యాల: శ్రీశైలంలోని లలితాంబికా దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి దాటాక ఎల్‌ బ్లాక్‌ సముదాయంలో మంటలు వ్యాపించాయి. ప్రమాదం కారణంగా సుమారు 15 దుకాణాలు కాలిబూడిదయ్యాయి..

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొస్తున్నారు.

శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు సమాచారం..

Hyderabad: మాదాపూర్‌లో అర్ధరాత్రి రేవ్‌ పార్టీ భగ్నం..

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో రేవ్‌ పార్టీని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీఎస్‌ న్యాబ్‌) అధికారులు భగ్నం చేశారు. మాదాపూర్‌ విఠల్‌రావు నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్‌ పార్టీని నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు..

ఇద్దరు యువతులు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు కొందరు ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీలో పాల్గొన్న వారి నుంచి టీఎస్‌ న్యాబ్‌ అధికారులు భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం నిందితులను మాదాపూర్‌ పోలీసులకు అప్పగించారు..