/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది Yadagiri Goud
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుమలలో నేడు మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనం కోసం 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.

ఇక నిన్న శ్రీవారిని 68,263 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారికి 28,355 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

టీఎస్‌ సెట్‌ దరఖాస్తుకు రేపే తుది గడువు

ఉస్మానియా యూనివర్సిటీ: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అలర్ట్‌.. రేపే టీఎస్‌ సెట్‌-2023 దరఖాస్తునకు గడువు ముగియనుంది. ఈ ఏడాదికి గానూ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఈ పరీక్షకు సంబంధించి ఈ నెల 5వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.

ఈ దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్టు 29వ తేదీతో ముగియనుంది. కాగా, రూ.1500 అపరాధ రుసుముతో వచ్చే నెల 4వ తేదీ వరకు, రూ.2000 అపరాధ రుసుముతో 9వ తేదీ వరకు, రూ.3000 అపరాధ రుసుముతో 12వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.

పరీక్షలను అక్టోబర్‌ 28, 29, 30వ తేదీల్లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 13, 14వ తేదీలలో దరఖాస్తులను ఎడిట్‌ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు.అక్టోబర్‌ 20వ తేదీ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

పీజీ ఉత్తీర్ణులైన వారు, పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు టీఎస్‌ సెట్ పరీక్ష రాసేందుకు అర్హులు. మొత్తం 29 సబ్జెక్టుల్లో సెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

పేపర్‌ -1ను 50 ప్రశ్నలకు నిర్వహించనుండగా, ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 100 మార్కులుంటాయి. పేపర్‌ -2లో 100 ప్రశ్నలుండగా, ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. 3గంటల వ్యవధిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఓసీలు 40 శాతం, రిజర్వేషన్‌ క్యాటగిరీలో 35 శాతం మార్కులు పొందితే క్వాలిఫై అయినట్టుగా పరిగణిస్తారు. వివరాలకు www.telanganaset.org, www.osmania.ac.in వెబ్‌సైట్‌లను సంప్రదించవచ్చు...

నేనేమైనా ఎన్టీఆర్ కు ఇల్లీగల్ భార్యనా? పురందేశ్వరి పై లక్ష్మీపార్వతి ఫైర్

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా స్మారక నాణెం విడుదల చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించిన కేంద్రం.. ఆయన సతీమణి లక్ష్మీపార్వతిని మాత్రం ఆహ్వానించలేదు. దీనిపై ఆమె ఇవాళ నిప్పులు చెరిగారు.

ఎన్టీఆర్ భార్యనని తాను బోర్డు కట్టుకు తిరగాలా అని ప్రశ్నించారు. ఇందుకు కారణమైన పురందేశ్వరిపైనా రెచ్చిపోయారు.

ఎన్టీఆర్ నాణెం విడుదల ప్రభుత్వ కార్యక్రమం అయితే ప్రోటోకాల్ ప్రకారం తనను పిలవాలని లక్ష్మీపార్వతి తెలిపారు.

ఎన్టీఆర్ భార్యగా తనకు ఆహ్వానం అందాలన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారని, తనకు మాత్రం ఆహ్వానం లేదన్నారు. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు వెళ్లడం అభ్యతరకరమని లక్ష్మీపార్వతి ఆక్షేపించారు......

దివ్యాంగులు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ జిల్లా:ఆగస్టు 28

ప్రభుత్వ పథకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

సోమవారం కలెక్టరేట్ లో జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ నుంచి టీఎస్ ఓబీఎంస్ పథకం ద్వారా వికలాంగుల వినికిడి లోపం ఉన్నవారికి మంజూరైన సెల్ ఫోన్లను జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్బంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హత గల దివ్యాంగులు టీఎస్ ఓబీఎంఎస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మాట్లాడుతూ.. డీఎస్ ఓబీఎంఎస్ ద్వారా జిల్లాలో 51 శాతం కంటే ఎక్కువ చెవుడు ఉన్న ఐదుగురికి సెల్ ఫోన్లను అందజేశామని తెలిపారు.

అందులో ఇంటర్ లేదా డిస్టెన్స్ చదివే 16 నుంచి 21 సంవత్సరాల మద్య వయస్సు ఉన్న వారిని, డీగ్రీ ఆ పైన చదువుతున్న 18 నుంచి 25 ఏళ్ల వయసు గల వారికి, 16 నుంచి 50 ఏళ్లు పైబడి ఎస్సెస్సీ చదివిన వారిని అర్హులుగా గుర్తించామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. గోపి, అదనపు కలెక్టర్లు లక్ష్మికిరణ్, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు......

ప్రభుత్వం ప్రకటించిన మోటారు సైకిళ్లను వెంటనే ఇవ్వాలి

•పెండింగ్ క్లెయిమ్స్ ను వెంటనే పరిష్కారం చేయాలి

•చినపాక లక్ష్మీనారాయణ

రాష్ట్ర ప్రభుత్వం 2022లో భవన నిర్మాణ కార్మికులకు అసెంబ్లీలో ప్రకటించిన లక్ష మోటార్ సైకిళ్లను వెంటనే ఇవ్వాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సోమవారం తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్లగొండ జిల్లా లేబర్ అధికారి కార్యాలయం ముందు కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా అసిస్టెంట్ లేబర్ అధికారికి వినతి పత్రం సమర్పించడం జరిగినది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక శాఖ మంత్రి గారు మే డే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు లక్ష మోటారు సైకిళ్ళు ఇస్తామని ప్రకటించి నేటికీ సంవత్సరం కావస్తున్న ఒక్క మోటార్ సైకిల్ కూడా ఇవ్వకపోవడం కార్మికుల పట్ల వారి కపట ప్రేమకు, చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. మోటార్ సైకిల్ వస్తుందని ఆశపడిన కార్మికునికి అడియాసే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మోటార్ సైకిల్ పంపిణీకి సంబంధించిన విధివిధానాలను రూపొందించి పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రమాదాలు, సహజ మరణాలు, పెళ్లి కానుక, ప్రసూతి సహాయం తదితర అనేక నష్టపరిహారాలు ఏ ఎల్ ఓ కార్యాలయాలలో కుప్పలు తిప్పలుగా పేరుకపోయాయని పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. కొత్తగా తీసుకువచ్చిన తంబు సిస్టం వలన కార్మికులు పనిచేసే చేతి వేళ్లపైన గీతలు అరిగిపోయి తంబులు రాకపోవడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఆలోచించి ఐరీస్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. సెప్టెంబర్ నెల 5వ తేదీన హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య భవన నిర్మాణ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు కేశవులు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు అద్దంకి నరసింహ పోలే సత్యనారాయణ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల జ్యోతి కాశమ్మ నాయకులు దయానంద్ సాగర్ల మల్లయ్య నీరుడు వీరయ్య గాదే యాదయ్య కాసర్ల సరిత బరిగల నరసింహ కాసర్ల వెంకన్న నారబోయిన సత్యనారాయణ గిరి శాంతి కుమార్ వెంకన్న సత్తయ్య నరసింహ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ములుగు గడ్డపై బిఆర్ఎస్ జండా ఎగరడం ఖాయం: మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి

దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 119 కి 115 నియోజకవర్గాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించి సీఎం కేసీఆర్‌ చరిత్ర స్పష్టించారని, పట్టుమని 10మంది అభ్యర్థులను ప్రకటించలేని పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఉన్నాయని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌ అన్నారు. సోమవారం వారు ములుగు జిల్లాలో పర్యటించి ములుగు జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

జూన్‌లో హఠాన్మరణం చెందిన దివంగత జడ్పీచైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ కుటుంబ సభ్యులకు మంత్రులు, కార్యకర్తల సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సమకూర్చిన రూ.కోటి 50లక్షల విలువైన చెక్కును అందజేశారు.అనంతరం మంత్రులు మాట్లాడుతూ..

రానున్న ఎన్నికల్లో ములుగు గడ్డపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీని నమ్ముకొని పనిచే సే నాయకులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు...

TTD: తితిదే బోర్డు సభ్యుల నియామకాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి సభ్యుల నియామకాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. నేరచరిత్ర, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారిని తితిదే బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు..

తితిదే బోర్డు సభ్యులుగా ఎన్నికైన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి నియామకాలను ఆయన సవాల్ చేశారు.

ఈ ముగ్గురిని తితిదే బోర్డు సభ్యులుగా తొలగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి పోటీ చేస్తుందా❓️

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా? లేదా? అనే విషయమై నేడు స్పష్టత వచ్చింది. తెలంగాణ ఎన్నికల బరిలోకి టీడీపీ కూడా దిగనుంది.

ఈ క్రమంలోనే ఈ అసెంబ్లీ ఎన్నికల‌పై తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేసింది. ఏడుగురు సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో ఒక కమిటీని నియమించారు.

కమిటీలో కాసాని జ్ఞానేశ్వర్, రావుల చంద్రశేఖరరెడ్డి, అర్వింద్ కుమార్ గౌడ్, కంభంపాటి రామ్మోహనరావు, బక్కిన నరసింహులు, కాశీనాథ్, నర్సిరెడ్డిలకు చోటు కల్పించారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటి స్వీకరించనుంది.

అనంతరం చంద్రబాబుకు నివేదిక సమర్పించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను టీడీపీ ప్రకటించనుంది....

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి : ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిందని, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు.

సోమవారం మెదక్ మండలం కోంటూరు పెద్ద చెరువులో సబ్సిడీపై 1,84,500 చేప పిల్లల విడుదల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో చెరువులన్నీ నిండటంతో చేప పిల్లలు వదిలి నీలి విప్లవం తీసుకురావాలన్నారు.

ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లలను పెంచి మత్స్యకారులు ఆర్థికంగా అభ్యున్నతి సాధించాలని ఆకాంక్షించారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్‌ ఎం. లావణ్య రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, జిల్లా మత్స్యశాఖ అధికారి రజని, మెదక్ వైస్ ఎంపీపీ మార్గం ఆంజనేయులు, మెదక్ పీఏసీఎస్‌ చైర్మన్ హన్మంత్ రెడ్డి, మండల రైతుబంధు అధ్యక్షుడు కిష్టయ్య, మెదక్ ఎమ్మార్వో శ్రీనివాస్, నాయకులు రవి సిద్ధ గౌడ్, మోహన్, రెడ్డి తదితరులు పాల్గొన్నారు...,.

Mamata: 'డిసెంబర్‌'లోనే లోక్‌సభ ఎన్నికలు ఉండొచ్చు!

కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికలపై (General Elections) పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) ఈ ఏడాది డిసెంబర్‌లో వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు.

ఇప్పటికే ప్రచారం కోసం అన్ని హెలికాప్టర్లను కాషాయ పార్టీ ముందస్తుగా బుక్‌ చేసుకొందన్నారు. టీఎంసీ యువజన విభాగం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆమె.. మూడోసారి భాజపా అధికారంలోకి వస్తే 'నిరకుంశ పాలనే'నని ఆరోపించారు..

'మూడోసారి భాజపా అధికారంలోకి వస్తే ఇక నిరంకుశ పాలనే. ఈ ఏడాది డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలకు భాజపా వెళ్లవచ్చని అంచనా వేస్తున్నా. ప్రచారం కోసం అవసరమైన అన్ని హెలికాప్టర్లను కాషాయ పార్టీ ఇప్పటికే ముందస్తుగా బుక్‌ చేసుకొంది. మరో పార్టీకి అవకాశం ఇవ్వొద్దనేది వారి ఆలోచన. పశ్చమ బెంగాల్‌లో సీపీఎం పాలనకు ముగింపు పలికాం. లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను తప్పకుండా ఓడిస్తాం. ఇప్పటికే అన్ని వర్గాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం భాజపా చేస్తోంది. మరోసారి అధికారం చేపడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి' అని మమతా బెనర్జీ పేర్కొన్నారు..

ఇక అక్కడి గవర్నర్‌ తీరుపై మండిపడ్డ ఆమె.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంతో సవాలుకు దిగవద్దని సూచించారు.. గవర్నర్‌ పదవి అంటే తనకు గౌరవం ఉన్నప్పటికీ.. ఆయన తీరు మాత్రం బాగాలేదన్నారు. ఇక ఇటీవల జాదవ్‌పుర్‌ యూనివర్సిటీలో చోటుచేసుకున్న వివాదంపైనా స్పందించిన మమతా.. 'గోలీ మారో' అంటూ నినాదాలు చేసిన వారిని అరెస్టు చేస్తామన్నారు..