/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz సంస్కృతి, విలువలు, సాంప్రదాయాలు, తెలిపేదే తెలుగు భాష: నరేంద్ర మోడీ Yadagiri Goud
సంస్కృతి, విలువలు, సాంప్రదాయాలు, తెలిపేదే తెలుగు భాష: నరేంద్ర మోడీ

తెలుగు భాషా దినోత్సవ నిర్వహణపై భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు.

ఆదివారం మాన్ కి బాత్ లో భాగంగా మాట్లాడిన ప్రధాని.. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటించారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. మాతృభాషతో అనుసంధానమైతే.. మన సంస్కృతి, విలువలు, సంప్రదాయాలతో మంచి బంధం ఏర్పడుతుందని. దేశంలోని వారసత్వ భాషల్లో తెలుగు కూడా ఒకటని అన్నారు.

తెలుగు సాహిత్యం, వారసత్వ సంపదలో భారతీయ సంస్కృతికి సంబంధించిన అనేక అద్భుతాలు ఉన్నాయని.. తెలుగు వారసత్వాన్ని యావత్ దేశానికి అందించే ప్రయత్నం తాము చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా చెప్పుకొచ్చారు...

పెరుగుతున్న ఏసీ హెల్మెట్ల వినియోగం

•ట్రాఫిక్‌ సిబ్బందికి తప్పుతున్న ఇబ్బందులు

•బయటి వాతావరణాన్ని బట్టి లోపల ఉష్ణోగ్రతలు మార్చుకునే వీలు

మండే ఎండల్లో.. అధిక ఉష్ణోగ్రతల మధ్య విధులు నిర్వహించే ఉద్యోగులు, వీధి వ్యాపారులు, ద్విచక్ర వాహన దారుల కోసం ఎయిర్‌ కండిషనర్‌ (ఏసీ) హెల్మెట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఎంత ఎండలోనైనా వీటిని పెట్టుకొని చల్లగా విధులు నిర్వహించుకోవచ్చు. బైక్‌పై ప్రయాణాలు చేయవచ్చు. తీవ్రమైన చలి వాతావరణం ఉన్నప్పుడు.. ఈ ఏసీ హెల్మెట్లను హీటర్లుగానూ వాడుకోవచ్చు. వీటి ప్రయోజనాలను గుర్తించిన రాష్ట్ర పోలీసు శాఖ.. రాచకొండ కమిషనరేట్‌లో కొందరు ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లకు ప్రయోగాత్మకంగా అందించింది. చాలా ఉపయోగకరంగా ఉన్నాయని సిబ్బంది చెప్పడంతో.. 100 మంది ట్రాఫిక్‌ పోలీసులకు గతంలో రాచకొండ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ పంపిణీ చేశారు. ముఖ్యంగా ఎండాకాలంలో వీటిని ధరించి.. ట్రాఫిక్‌ విధుల్లో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అహ్మదాబాద్‌లోనూ ఇటీవల ట్రాఫిక్‌ పోలీసులకు వీటిని ప్రయోగాత్మకంగా అందించారు.

వినియోగదారుల అవసరాల మేరకు తయారీ..

మనవద్ద అంత చలి ఉండదు కాబట్టి.. ఎండ నుంచి ఉపశమనం కల్పించే హెల్మెట్లకే డిమాండ్‌ ఉంటోంది. హిమాచల్‌ప్రదేశ్‌ తదితర శీతల ప్రాంతాల్లో కార్మికులతో పాటు సాధారణ ప్రజలు సైతం బయటకు వచ్చేటప్పుడు హీటర్‌ హెల్మెట్లు ధరిస్తుంటారు. మన దగ్గర మైనింగ్‌, ఆయిల్‌ గ్యాస్‌, సిమెంట్‌, ఫార్మా, ఉక్కు తదితర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే కంపెనీల్లో కార్మికుల కోసం ఏసీ హెల్మెట్‌లు సరఫరా చేస్తున్నాం. వినియోగదారుల అవసరాలకు తగ్గట్లుగా వీటిని తయారు చేస్తున్నాం. నగర ట్రాఫిక్‌ పోలీసుల కోసం తయారు చేసి ఇచ్చాం’’ అని హైదరాబాద్‌కు చెందిన జార్ష్‌ కంపెనీ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ శశికాంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మరికొన్ని కంపెనీలు సైతం ఏసీ హెల్మెట్లు తయారు చేస్తున్నాయి.

ఎలా పని చేస్తాయంటే.

హెల్మెట్‌పై ఏసీ యూనిట్‌ ఉంటుంది. దీనినుంచి లోపల భాగంలో ఉన్న చిన్న రంధ్రాల ద్వారా చల్లని గాలి తల, ముఖ భాగానికి వస్తుంది. దీని బరువు 750 గ్రాములు. అందులో ఏసీ యూనిట్‌ బరువు 300 గ్రాములు ఉంటుంది. దీనిని పూర్తిగా హెడీపీఈ ప్లాస్టిక్‌ మెటీరియల్‌తో తయారు చేస్తారు.

ఈ హెల్మెట్లు సాలిడ్‌ స్టేట్‌ కూలింగ్‌ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఫ్యాన్‌, హీట్‌సింక్‌, కూల్‌సింక్‌ పరికరాలు వాడతారు. ఇందులోని బ్యాటరీని 3 గంటలు ఛార్జింగ్‌ చేస్తే.. 8 గంటలు పనిచేస్తుంది.

ముఖ్యంగా బయట ఉష్ణోగ్రతలను బట్టి హెల్మెట్‌ లోపల 10-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువ, ఎక్కువ చేసుకునే వీలు ఉంటుంది. బయట 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటే.. ఏసీ హెల్మెట్‌లో 25 డిగ్రీల వరకు తగ్గించుకొని చల్లని గాలి పొందవచ్చు. ఈ ఏసీ యూనిట్‌ వాటర్‌ఫ్రూప్‌గా ఉంటుంది. వీటి ధరలు రూ.6 వేల నుంచి వినియోగదారుల అవసరాలను బట్టి రూ.60 వేల వరకు లభ్యమవుతున్నాయి.

ఐఎస్‌ఐ మార్కు తప్పనిసరి.

వాహనదారులు ఏ హెల్మెట్‌ అయినా వినియోగించుకోవచ్చు. అయితే భారతీయ ప్రమాణాల బ్యూరో నిబంధనల ప్రకారం ఐఎస్‌ఐ మార్కు తప్పనసరిగా ఉండాలి’ అని హైదరాబాద్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ పాండురంగ నాయక్‌ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో : ఎమ్మెల్యే రేఖ నాయక్ ?

అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఆ పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ఒకటి రెండు రోజుల్లో ఆమె బీఆర్ఎస్‏కు రాజీనామా చేసే ఆలోచనలో ఉందని తెలుస్తుంది. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తుండగా.. ఇంకా టికెట్‏పై పూర్తి స్పష్టత రాలేదని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోనే ఉండి కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా ఖానాపూర్ టికెట్ ను బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రేఖా నాయక్‏కు కాకుండా మంత్రి కేటీఆర్ స్నేహితుడైన జాన్సన్ నాయక్‏కు కేటాయిస్తున్నారు.

దీంతో ఎమ్మెల్యే రేఖా నాయక్ బీఆర్ఎస్‏ను వీడాలని నిర్ణయం తీసుకున్నారు........

తెలంగాణ ఎన్నికల నిర్వహణకు ఈసారి 500 కోట్లు ఖర్చు: ఎన్నికల కమిషన్ లేఖ

ఈసారి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం సుమారు రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని ఎన్నికల సంఘం లెక్కలు వేసినట్లు సమాచారం.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇండెంట్ పంపినట్టు తెలుస్తున్నది. ఆ నిధులను విడుదల చేయాలని సర్కారుకు ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సుమారు రూ.370 కోట్ల వరకు ఖర్చయిందని అధికార వర్గాల టాక్. ఈసారి 30 శాతం ఖర్చు ఎక్కువగా ఉంటుందని అంచనాతో ప్రపోజల్స్‌‌ను పంపినట్టు సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల ఖర్చును ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఈవీఎం మిషన్ల సేకరణ, నిర్వహణ, భద్రపరచడం వరకు అయ్యే ఖర్చును ఎన్నికల సంఘం చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికల నామినేషన్ మొదలు, ఫలితాలు వచ్చేవరకు ఎన్నికల విధులు నిర్వహించే స్టాఫ్, పోలీసులకు ట్రాన్స్‌పోర్టు, అలవెన్సులు చెల్లించాల్సి ఉంటుంది.

పోలీసులు, పోలింగ్ స్టాఫ్‌కి పెద్దఎత్తున ఖర్చు అవుతుందని అధికారులు వెల్లడించారు. గతంలో పోలింగ్ రోజున అలవెన్సుల విషయంలో ఎంప్లాయీస్ ఆందోళనలు చేసిన సందర్భాలున్నాయి. దీంతో అలవెన్సులు ఇవ్వడంలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది...

రాఖీ పౌర్ణమికి 3 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆదేశించారు.

రక్షాబంధన్‌కు రాష్ట్రవాప్తంగా 3 వేల ప్రత్యేక బస్సులను నడిపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులను ఈ నెల 29, 30, 31 తేదీల్లో ప్రతి రోజూ వెయ్యి బస్సుల చొప్పున నడపనున్నట్లు పేర్కొన్నారు.

రాఖీ పౌర్ణమికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సజ్జనార్‌ సమీక్షించారు.

ఈ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ.. రాఖీ పౌర్ణమికి హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌, నిజామాబాద్‌, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, గోదావరిఖని, మంచిర్యాల, తదితర రూట్‌లలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ బస్ స్టేషన్ లతో పాటు ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు....

రేపు ఖమ్మం కమ్యూనిస్టుల అడ్డాలో బిజెపి సభ

రేపు 27న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు జరిగాయి. తొలుత కొత్తగూడెం చేరుకుని, ఆ తర్వాత ఖమ్మం వేదికగా తలపెట్టిన బహిరంగ సభలలో ప్రసంగించాల్సి ఉండేది. కానీ, సమాయాభావం కారణంగా ఆయన పర్యటనలో మార్పులు చేపట్టారు. కొత్తగూడెం రాకుండా నేరుగా ఖమ్మం సభకే అమిత్షా హాజరుకానున్నట్టు అధికారికి ప్రకటన వెలువడింది.

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అగ్రనాయకత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా… అమిత్ షా టూర్ ఖరారైంది. సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ఈ సభతోనే ఎన్నికల యుద్ధంలోకి దిగాలని బీజేపీ భావిస్తోంది. ఆగస్టు 27వ తేదీన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 3 గంటల 25 నిమిషాలకు ఖమ్మం చేరుకుంటారు.

ఆ తర్వాత… ‘రైతు గోస-బీజేపీ భరోసా’లో పాల్గొని ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత… తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

నిజానికి గతంలోనే ఖమ్మంలోనే సభను నిర్వహించేందుకు సిద్ధమైంది బీజేపీ. కానీ వర్షాల కారణంగా అమిత్ షా టూర్ రద్దైంది.

ఇక మరికొద్దిరోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుది. అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా…. కాంగ్రెస్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాపై కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖారులోగా తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.

అమిత్ షా సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని బీజేపీ తెలంగాణ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే టార్గెట్ గా అమిత్ షా ప్రసంగం ఉండే అవకాశం ఉంది.

ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో టికెట్లు దక్కని నేతలు బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ… చాలా మంది నేతలు పార్టీలు మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో..పార్టీ మారే నేతలను తమవైపు తీసుకువచ్చేందుకు కమలనాథులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు...

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఈసీ 10 సూత్రాల అమలు

•తెలంగాణ సహా అయిదురాష్ట్రాల ఎన్నికలకు మార్గదర్శకాలు

•సీ-విజిల్‌తో 50 నిమిషాల్లోనే కోడ్ ఉల్లంఘనలపై యాక్షన్

•విచ్చలవిడి ఖర్చు పై నిఘాకు 20 శాఖలతో స్పెషల్ కోఆర్డినేషన్

తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగంగా పూర్తిచేస్తోంది. షెడ్యూల్‌ వెలువరించకముందే.. ఆయా రాష్ట్రాలలో ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణలోనూ త్వరలోనే పోల్‌ ప్రిపేరేషన్‌పై రివ్యూ మీటింగ్‌ పెట్టనుంది. ఈ సందర్భంగా కీలక అంశాలపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. సమర్ధ ఎన్నికల నిర్వహణకు పది సూత్రాలను అమలు చేయనుంది. ఈసీ టెన్‌-కమాండ్‌మెంట్స్‌తో ఉల్లంఘనలకు చెక్‌పెట్టి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు వీలుకలగనుంది.

1.ఓటర్ల తొలగింపు అంశం

ఓటర్ల తొలగింపుపై ఎన్నికల సంఘం ఫోకస్‌పెట్టింది. కేవలం ఫాం-7 రిసీవ్‌ అయిన తర్వాతే ఓటు తొలగింపు ఉండాలని స్పష్టం చేసింది. బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ తనిఖీ లేకుండా సుమొటాగా ఓటు తొలగించవద్దని పేర్కొంది. ఓటరు చనిపోతే, డెత్‌ సర్టిఫికెట్‌ అందిన తర్వాతే ఆ ఓటును డిలీట్‌ చేయాలని మార్గదర్శకాలు ఇచ్చింది. అలాగే మొత్తం తొలగించిన ఓట్లలో పదిశాతం ఓట్లను ర్యాండమ్‌గా సిస్టం ద్వారా ఎంపిక చేసి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో తొలగించిన ఓట్లు రెండుశాతానికి మించితే వాటిని ఈఆర్‌ఓ వ్యక్తిగతంగా తనిఖీ చేయాలి. ఓటరు చనిపోయిన సందర్భాల్లో మినహా ఇతర కారణాలుంటే వాటిని తప్పనిసరిగా తనిఖీ చేసిన తర్వాతే ఓటు తొలగింపు ఆదేశాలు ఇవ్వాలి..

2. ఎన్నికల ఖర్చుపై 20శాఖల నిఘా

ఎన్నికల సమయంలో పెరిగిపోతున్న ఖర్చుపై నిఘా పెట్టేందుకు ఎన్నడూ లేనంతగా ఈసారి కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. దాదాపు 20 ప్రభుత్వ శాఖలతో స్పెషల్‌ కోఆర్డినేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కో-ఆర్డినేషన్‌లో ఈడీ, ఐటి, రెవెన్యూ ఇంటలిజెన్స్, జిఎస్టీ, పోలీస్, కస్టమ్స్, ఎక్సైజ్, సిఐఎస్‌ఎఫ్, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, సివిల్‌ ఏవియేషన్, పోస్టల్, ఆర్‌బిఐ, ఎస్‌ఎల్‌బిసి, ఎన్‌సిబి, రైల్వే, ఫారెస్ట్, ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్స్‌ పనిచేయనున్నాయి. ఈ శాఖలన్నీ ఎవరికి వారు ఒంటరిగా పనిచేయకుండా, సమన్వయంతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల, పార్టీల ఖర్చుపై నిఘా పెడతారు. సరిహద్దుల గుండా వెళ్లే మద్యం, నగదు, ఉచితాలు, డ్రగ్స్‌ తదితర అంశాలపై మరింత ఫోకస్‌ ఉంటుంది. వీటితో పాటు రాష్ట్రంలోని ఎయిర్‌స్ట్రిప్‌లు, హెలిప్యాడ్‌లపై కన్నేసి ఉంచుతారు. లిక్కర్‌ కింగ్‌పిన్స్,

లిక్కర్‌ డిస్ట్రిబ్యూటర్లపై తీవ్రమైన చర్యలు ఉండనున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు లోనుచేయకుండా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటారు..

3. సీ విజిల్‌తో 50 నిమిషాల్లోనే యాక్షన్‌..

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై నేరుగా ఫిర్యాదు చేయడానికి ఎన్నికల సంఘం సీ-విజిల్‌ యాప్‌ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దింది. ఎవరైనా పౌరుడు ఎన్నికల కోడ్‌ఉల్లంఘనపై సీ-విజిల్‌ యాప్‌లో ఫోటో, వీడియో, ఇతర సమాచారం అప్‌లోడ్‌ చేయాలి. ఆ వెంటనే ఆ సమాచారం డిస్ట్రిక్‌ కంట్రోలర్‌కు చేరుతుంది. చేరిన అయిదు నిమిషాల్లోనే ఆ ఫిర్యాదు పరిష్కారం కోసం ఫ్లయింగ్‌ స్కాడ్‌కు అప్పగిస్తారు. 15 నిమిషాల వ్యవధిలో ఎలక్షన్‌కోడ్‌ ఉల్లంఘన జరిగిన ప్రాంతానికి చేరుకుని విచారణ చేస్తారు. మరొక 30 నిమిషాల్లోనే ఫిర్యాదుదారుకు తాము తీసుకున్న చర్యల సమాచారాన్ని పంపిస్తారు. అంటే ఫిర్యాదు చేసిన 50 నుంచి 100 నిమిషాల్లోనే వాటిపై యాక్షన్‌ తీసుకునేలా సి-విజిల్‌ తయారు చేశారు..

4. ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌

ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా ఓటరు సేవలన్నీ ఆన్‌ లైన్‌ ద్వారా పొందే అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో ఓటు కోసం దరఖాస్తు చేయవచ్చు. ఓటరు లిస్ట్‌లో పేరు తనిఖీ చేసుకోవచ్చు. పోలింగ్‌ బూత్‌ వివరాలు, బిఎల్‌ఓ, ఈఆర్‌ఓ డిటెయిల్స్, ఎన్నికల ఫలితాలు, ఈవిఎంల సమాచారం, ఓటరు కార్డు డౌన్‌లోడింగ్‌ తదితర సేవలన్నీ ఈ ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా పొందే అవకాశం కల్పించారు.

5. సువిధ పోర్టల్‌.. నామినేషన్లు, అఫిడవిట్ల దాఖలు కోసం

అభ్యర్థులు సువిధ పోర్టల్‌ ద్వారా నామినేషన్లు, అఫిడవిట్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే మీటింగ్‌లు, ర్యాలీలు నిర్వహించుకునేందుకు అనుమతుల కోసం ఈ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుంది.

6. సక్షం యాప్‌.. వికలాంగులు, వలస ఓటర్లు, తప్పుల సవరణల కోసం

వికలాంగులు, వలస ఓటర్ల కోసం ఈసీ సక్షం యాప్‌ను తయారుచేసింది. ఓటరు జాబితాలో కరెక్షన్ల కోసం ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఓటింగ్‌ సమయంలో వీల్‌చైర్‌ అవసరమైతే రిక్వెస్ట్‌ ను ఈ యాప్‌ ద్వారా పంపాలి.

7. కెవైసీ యాప్‌

పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు తెలుసుకోవడానికి కెవైసి యాప్‌ ను రూపొందించారు. ఇందులో అభ్యర్థుల నేర చరిత్ర సహా ఇతర వివరాలను ఉంచుతారు. అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా తమ అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలు వెబ్‌సైట్‌లో, సోషల్‌ మీడియాలో పెట్టాలి..

8. యూత్‌ ఓటింగ్‌ పెరిగేలా..

యువత ఓటింగ్‌ పెరిగేలా చర్యలు తీసుకోవాలి. పోలింగ్‌ కేంద్రాలలో కనీస సౌకర్యాలు కల్పించాలి. వికలాంగులకు ఓటింగ్‌కు అవసరమైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. చివరి మైలులో ఉన్న గ్రామాలలో సైతం సజావుగా పోలింగ్‌ ప్రక్రియ జరిగేలా చర్యలుండాలి.

9.సరిహద్దులో చెక్‌పాయింట్లు

ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు, మద్యం సరఫరాను అడ్డుకునేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. పొలీస్, ఎకైజ్, ట్రాన్స్‌పోర్ట్, స్టేట్‌ ఫారెస్ట్‌ డిపార్టు మెంట్ల ఆధ్వర్యంలో ఈ చెక్‌ పోస్టులలో నిఘా ఉంటుంది..

10. ఉన్నతాధికారులకు ప్రత్యేక ఆదేశాలు

ఓటరు జాబితాలో పెద్ద సంఖ్యలో నమోదు, తొలగింపులను జిల్లా ఎన్నికల అధికారులు తప్పనిసరిగా చెక్‌చేయాలి. రాజకీయ పార్టీల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలి.

పోలింగ్‌ పనులకు కాంట్రాక్ట్‌ ఉద్యోగులను నియమించొద్దు. పార్టీ క్యాంపెయిన్‌ మెటీరియల్‌ వాహనాల సంఖ్య ఒకటి నుంచి నాలుగుకు పెంపు. ఫేక్‌ న్యూస్‌ నియంత్రణకు ప్రత్యేక సోషల్‌ మీడియా సెల్‌ ఏర్పాటు..

అంగన్వాడీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట

అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏండ్లకు పెంచడం పట్ల ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తంచేశారు.

అంగన్వాడీల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని స్పష్టంచేశారు. అంగన్వాడి టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి, యూనియన్ ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో కలిశారు.

ఈ సందర్భంగా కవితకు, తమ సమస్యలు పరిష్కరించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారన్నారు.

ముఖ్యంగా ఉద్యోగ విరమణ వయస్సు ఏండ్లకు పెంచడమే కాకుండా ఉద్యోగ విరమణ సమయంలో అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50 వేలు అందించాలని నిర్ణయించడం శుభపరిణామని స్పష్టం చేశారు.

పదవీ విరమణ తర్వాత వారికి ఆసరా పెన్షన్ కూడా మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అంగన్వాడీల భవిష్యత్తుకు భరోసానిస్తుందని చెప్పారు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమని తెలిపారు.

అంగన్వాడీలు చేస్తున్న సేవలకు సీఎం కేసీఆర్ గుర్తింపునిచ్చారని, ఇప్పటికే దేశంలో అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని చెప్పారు. అనేక రాష్ట్రాల్లో అరకొర వేతనాలు చెల్లిస్తుంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత అంగన్వాడీలకు ప్రభుత్వం మూడుసార్లు వేతనాలు పెంచిందని గుర్తు చేశారు.

అంగన్వాడీలకు ఉద్యోగ విరమణ వయస్సు పెంచడం, ఆర్థిక సాయం చేయడం వంటి నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్ కు కల్వకుంట్ల కవిత ధన్యవాదాలు తెలిపారు.......

కాంగ్రెస్, బీజేపీ పార్టోల్లు వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త:గంగుల

కరీంనగర్‌ జిల్లా :ఆగస్టు 26

కాంగ్రెస్‌, బీజేపీలు మోసకారి పార్టీలని, ఒక్క అవకాశం అంటూ వచ్చే ఆ పార్టీలను నమ్మి ఓటేస్తే దివ్యాంగుల పెన్షన్లు కూడా ఎత్తుకు పోతారని మంత్రి గంగుల కమలాకర్‌ విమర్శించారు. గత ప్రభుత్వాలు దివ్యాంగులను చిన్నచూపు చూశాయన్నారు. దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో దివ్యాంగులకు రూ.4 వేల పెన్షన్‌ ఇస్తున్నామని చెప్పారు.

కరీంనగర్‌లో శనివారం మంత్రి గంగుల మీడియాతో మాట్లాడారు. దివ్యాంగుల కళ్ళల్లో ఆనందమే సీఎం కేసీఆర్ కోరుకుంటారన్నారు. కరీంనగర్‌ జిల్లాలో 23 వేల మంది దివ్యాంగులకు రూ.11.85 కోట్ల పెన్షన్ చెల్లిస్తున్నామని వెల్లడించారు.

దేశంలో ఒంటరి మహిళలకు, డయాలసిస్ పేషెంట్లకు, బీడీ, టేకేదార్లకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో శాంతి భద్రతలు క్షినిస్తాయని చెప్పారు. 30, 40 కేసులు ఉన్నవాళ్లు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. తస్మాత్ జాగ్రత్త, భవిష్యత్ తరాల బాగు కోసం మనసున్న మారాజు సీఎం కేసీఆర్‌ను కాపాడుకోవాలని కోరారు.

కులవృత్తులకు పూర్వవైభవం..

సమైక్య రాష్ట్రంలో ధ్వంసమైన కులవృత్తులకు సీఎం కేసీఆర్ పూర్వవైభవం తీసుకొచ్చారని మంత్రి గంగుల అన్నారు.

దిగువ మానేరు జలాశయంలో 100 శాతం సబ్సిడీపై ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. 2014 నుంచి ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో రూ.12.35 కోట్ల విలువైన చేపపిల్లలను ఉచితంగా అందించామన్నారు.

ఇప్పటి వరకు 50 వేల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరిగిందని చెప్పారు. నీలి విప్లవం వల్ల తెలంగాణ చేపల దిగుమతి స్థాయి నుంచి ఎగుమతి స్థాయికి చేరిందని వెల్లడించారు. కులవృత్తులకు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో తెలంగాణలో రివర్స్ మైగ్రేషన్ జరిగిందని తెలిపారు..

CM KCR: ఖమ్మం భారాస నేతలకు సీఎం కేసీఆర్‌ పిలుపు..

హైదరాబాద్‌: ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేస్తానన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది..

ఇప్పటికే భారాస అధిష్ఠానం ఉభయ జిల్లాల్లోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో తుమ్మల రాజకీయ పయనం ఎటువైపు ఉంటుందన్న చర్చ ఊపందుకుంది. తుమ్మల పార్టీ మారుతారా.. ఏ పార్టీలోకి వెళ్తారు..? స్వతంత్రంగా బరిలో నిలుస్తారా అనే అంశాలపై ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భారాస నేతలకు గులాబీ అధినేత, సీఎం కేసీఆర్‌ నుంచి పిలుపు వచ్చింది. వెంటనే ప్రగతి భవన్‌కు రావాలని పలువురు భారాస అభ్యర్థులను ఆయన కోరారు. సాయంత్రం ఖమ్మం భారాస నేతలతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి ప్రకటన ఉంటుందన్నది భారాస వర్గాల్లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌ మారింది..