/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz భద్రాచలం వద్ద కొనసాగుతున్న వరద ఉధృతి Yadagiri Goud
భద్రాచలం వద్ద కొనసాగుతున్న వరద ఉధృతి

భద్రాచలం జిల్లా:జులై 28

భద్రాచలం వద్ద ఉగ్రగోదావరిలో వరద ఉధృతి కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది.

ప్రస్తుతం భద్రాచలం వల్ల రెండో ప్రమాద హెచ్చరిక కొన సాగుతున్నది. నదిలో మరోసారి వరద పెరుగు తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కాగా, ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరికి వరద పోటెత్తింది. పేరూరులో ఉదయం 6 గంటలకు నీటిమట్టం 48.44 అడుగులకు పెరిగింది.

దీంతో వెంకటాపురం-భద్రాచలం రహదారి బ్రిడ్జిలపై వరద ప్రవహిస్తున్నది. అదేవిధంగా వెంకటాపురం, వాజేడు మండలాల్లో రోడ్లపైకి భారీగా నీరు చేరింది.

ఈనేపథ్యంలో టేకులగూడెం, వీరభద్రవరం, సురవీడు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నీటిప్రవాహం పెరగడంతో అధికారులు రామన్న గూడెం పుష్కర ఘాట్‌ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు...

Flood Effect: హైదరాబాద్‌-విజయవాడ హైవేపై వరద.. భారీగా నిలిచిపోయిన వాహనాలు

నందిగామ: హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. మున్నేరు వాగు ఉద్ధృతితో కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్‌ సమీపంలోని ఐతవరం వద్ద గురువారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేసిన విషయం తెలిసిందే..

శుక్రవారం ఉదయమూ అదే పరిస్థితి కొనసాగింది. కీసర టోల్‌గేట్‌ నుంచి విజయవాడ వైపు సుమారు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి..

SB NEWS

SB NEWS

SB NEWS

holidays for schools: భారీ వర్షాలు.. తెలంగాణలో విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవు

హైదరాబాద్‌: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం శుక్రవారం కూడా సెలవును ప్రకటించింది..

ఇందుకు సంబంధించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.

మరో రెండు రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు బుధ, గురువారాలు సెలవు ప్రకటించాయి.

తాజాగా ఆ సెలవులను శుక్రవారం వరకూ పొడిగించారు. మరోవైపు శనివారం మొహర్రం, ఆ తర్వాత ఆదివారం ఇలా విద్యాసంస్థలకు వరుస సెలవులు వచ్చినట్లైంది..

జమ్మికుంటలో నీట మునిగిన ఇండ్లు

కరీంనగర్ జిల్లా:జులై 27

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వరద నీటితో మునిగిపోయింది. 6వ వార్డు పరిధిలోకి వచ్చే హౌసింగ్ బోర్డ్ కాలనీ భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి కాలనీ మొత్తం నీట మునగడం రివాజుగా మారింది.

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీలోకి ఒక్కసారిగా వరద నీరు చేరడంతో బుధవారం రాత్రి కాలనీవాసులంతా తమ ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ఉలిక్కిపడ్డారు.

సుమారుగా ఈ కాలనీలో 4 వందల పైగా ఇళ్లు ఉండగా అవన్నీ కూడా నీట మునిగాయి. దీంతో ఇళ్లల్లో ఉన్న ఫ్రిడ్జ్‌లు, టీవీలు, బియ్యం, నిత్యావసర సరుకులను సర్వం కోల్పోవడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు కాలనీవాసులు తెలిపారు.

వాటితో పాటు కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. వీటితో పాటు పట్టణ పరిధిలోని అంబేద్కర్ కాలనీ, మోత్కులగూడెంలోని కొంత భాగం, నీట మునిగాయి. కాగా జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లోని దాదాపు అన్ని గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.

ఇల్లందకుంట మండలంలోని మల్యాల గ్రామంలో అత్యధికంగా 37 శాతం వర్షపాతం నమోదు కావడంతో దీని ప్రభావంతో అన్ని గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. కాగా వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పరిస్థితి ఇలా ఉంటే మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఏం జరగనుందదోనని జమ్మికుంట పట్టణంతో పాటు ఇల్లందకుంట గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు...

Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

L

సున్నిపెంట సర్కిల్‌: ఎగువ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది.

జూరాల ప్రాజెక్ట్‌ నుంచి 52,856 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది..

జలాశయం నీటిమట్టం గురువారం ఉదయం 6 గంటల సమయానికి 816.20 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 38.1234 టీఎంసీలుగా నమోదైంది..

SB NEWS

*SB NEWS"

క‌రీంన‌గ‌ర్ లోయ‌ర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తే చాన్స్‌?

క‌రీంన‌గ‌ర్‌జిల్లా :జులై 27

జిల్లా లోని లోయర్ మానేరు డ్యామ్ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు వ‌ర‌ద పోటెత్తుతోంది.

ఉత్తర తెలంగాణాలో అతిభారీ వర్షాల‌తో ఏక్షణంలోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, నీటిని దిగువకు వదిలే అవకాశం ఉన్నది.

రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు.

గ్రామాలలో దండోరా వేసి ప్రజలను అప్రమత్తం చేశారు. పరివాహక ప్రాంతంలోకి పశువులు గాని, గొర్రెలు వెళ్లకుండా చూసుకోవాల‌ని, అలాగే చేపలు పట్టేవారు,

గొర్రెల‌ కాపరులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తం గా ఉండాలని ఇరిగేష‌న్ అధికారులు తెలిపారు...,.....

కడెం ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ను గురువారం ఉదయం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖ నాయక్ నిర్మల్ జిల్లా కలెక్టర్ కే వరుణ్ రెడ్డి నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ తో కలిసి రాష్ట్ర న్యాయ ఆటవి దేవాదాయ శాఖ మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు.

ఈ సందర్భంగా కడెం ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం కడెం జలాశయంలో వస్తున్న ఇన్ ఫ్లో వరద నీరు వరద గేట్ల పరిస్థితి పై నీటిపారుదల శాఖ అధికారులకు అడిగి తెలుసుకున్నారు.

కడెం ప్రాజెక్టు వరదగేట్ల పై నుండి ప్రవహిస్తున్న వరద నీరు లోతట్టు గ్రామాల ప్రజల తరలింపు ప్రాజెక్టుకు వరద ముప్పు ఏర్పడితే తీసుకోవాల్సిన చర్యలపై పలు శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు

ఈ సందర్భంగా కడం ప్రాజెక్ట్ పై రాష్ట్ర మంత్రి ఐ.కే. రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుకు చెందిన నాలుగు వరద గేట్లు మోర్రఇంచిన సందర్భంగా ప్రస్తుతం ప్రాజెక్టు చెందిన 14 వరద గేట్ల ద్వారా రెండు లక్షల 40 వేల క్యూసెక్కుల వీటిని గోదావరిలోకి విడుదల కొనసాగుతుంది కడెం ప్రాజెక్టు జలాశయం లో ప్రస్తుతం ఇన్ ఫ్లో నీరు తగుముఖం పడుతుందని ప్రాజెక్టు ఎలాంటి వరద ప్రమాదం ఉండ భొదని తెలిపారు.

కడెం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో వరద నీరు అధికంగా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులకు రాష్ట్ర మంత్రి ఐ కే రెడ్డి సూచించారు ఆయన వెంట కడం ప్రాజెక్టు ఈ ఈ రాథోడ్ విఠల్ డి.ఈ. బోజదాసు నిర్మల్ డిఎస్పీ గంగారెడ్డి కడెం మండల తహశీల్దార్ చిన్నయ్య ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఖానాపూర్ సిఐ రవీందర్ నాయక్ కడెంఎస్సై కే. రాజు స్థానిక ప్రజాప్రతినితులు తదితరులున్నారు...

48 గంటల్లో అతి భారీ వర్షాలు.. అధికారులకు సీఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను అప్ర మత్తం చేశారు. ఈ మేరకు ఆమె అధికార యంత్రా గానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఈ 48 గంటల పాటు అత్యంత అప్రమత్తతతో ఉండాలని సీఎస్ ఆదేశించారు.

ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని తెలిపారు.ఇప్పటికే గోదావరి బేసిన్‌లో పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాలువలు పూర్తి స్థాయి నీటి మట్టంతో ప్రవహిస్తున్నాయి.

ఇక ఈ రెండు రోజుల్లో కురిసే అత్యంత భారీ వర్షాల వల్ల అవి మరింత ప్రమాద స్థాయిలో ప్రవహించే అవకాశముంది. నిండిన ప్రతీ చెరువు వద్ద, ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న కాజ్- వే ల వద్ద ప్రత్యేక అధికారులతో పాటు పోలీస్ అధికారులను నియమించి తగు జాగ్రత్త చర్యలను చేపట్టాలని అధికారులకు సీఎస్ సూచించారు. లోతట్టు ప్రాంతాలు, ముంపునకు గురయ్యే ప్రాంతాలలో అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. గుర్తించిన పునరావాస కేంద్రాలలో అవసరమైన వస్తు సామాగ్రి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

వర్షాలకు దెబ్బతినే రాష్ట్ర, నేషనల్ హైవే రోడ్లకు వెంటనే మరమ్మతులు జరపాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.జలపాతాలు, ఇతర పర్యాటక ప్రాంతాలకు ప్రజలు రాకుండా నివారించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్‌డీఆర్ దళాలను సిద్ధంగా ఉంచామని, అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టిన జాగ్రత్త చర్యలపై ప్రజలను చైతన్యవంతం చేసేలా స్థానిక కేబుల్ టీవీలు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తెలపాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు....

సుప్రీం కోర్టులో తీర్పు వచ్చేవరకు "జలగం"ప్రమాణస్వీకారం వాయిదే

ఖమ్మం జిల్లా:జులై 26

బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావ్‌కు చుక్కెదురైంది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీల్‌కి వెళ్లే వరకు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు తీర్పును రిజర్వు పెట్టింది. అయితే, వనమా సుప్రీంకోర్టుకు వెళ్తుండటంతో జలగం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి అడ్డంకిగా మారింది.

అయితే హైకోర్టు గురువారం తీర్పు వెలువరించే అవకాశం ఉండగా, వనమా సుప్రీంలో అప్పీల్ చేయనున్నారు.

దీంతో ఉన్నత న్యాయం స్థానం తీర్పు వెలువడే వరకు వెంకట్రావు ప్రమాణ స్వీకారం వాయిదా పడనుంది. సుప్రీంకోర్టు సైతం ఎలాంటి తీర్పును ఇస్తుందోనని రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వనమా, జలగం ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే కావడం విశేషం.

వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేస్తూ జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కాపీని బుధవారం అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు, ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌కు వెంకట్రావు అందచేశారు.కొత్తగూడెం ఎమ్మెల్యేగా తనను పరిగణించి ప్రమాణ స్వీకారం చేయించాలని కోరారు.

అనంతరం మీడియాతో మాడుతూ.. ఖమ్మం జిల్లాలో 2014లో బీఆర్ఎస్నుంచి తాను ఒక్కడినే గెలిచానని వెంకట్రావు స్పష్టం చేశారు. రాజకీయ కుతంత్రాల వలన 2018లో ఓడిపోయినప్పటికీ.. బీఆర్ఎస్పార్టీలోనే ఉన్నానని తెలిపారు. భవిష్యత్తులోనూ కేసీఆర్ నాయకత్వంలోనే కొనసాగుతానని వెల్లడించారు. రెగ్యులర్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, నేను ఏమి చేశానో నియోజకవర్గ ప్రజలకు తెలుసునని, ఏమీ చేస్తానో కూడా వారికి తెలుసు అని స్పష్టం చేశారు...

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో హ్యాట్రిక్ ఖాయం : మంత్రి హరీశ్‌రావు

నల్గగొండ జిల్లా:జులై 26

మిర్యాలగూడ నియోజకవర్గంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి జగదీశ్‌ రెడ్డి తో కలిసి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. నిరుద్యోగ సమస్య తెలంగాణ లో లేదని..కాంగ్రెస్ పార్టీలోనే పదవుల నిరుద్యోగం ఉందని మంత్రి హారీష్ రావు ఆరోపించారు.

సీఎం కేసీఆర్ పాలనలో యువతకు ఉపాధి, ఉద్యోగాలు లేవని జడ్చర్ల సభలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ కౌంటర్ ఇచ్చారు.కాంగ్రెస్, బీజేపీ లు ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని.. అభివృద్ధి అనే ఆయుధంతో మేం వారికి సమాధానం చెబుతామన్నారు.

కాంగ్రెస్ పరిపాలన బాగోలేదనే ప్రజలు కేసీఆర్‌ను రెండు సార్లు సీఎం కుర్చీలో కూర్చోబెట్టారని రాష్ట్రంలో మూడోసారి ముమ్మాటికి బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 స్థానాల్లో అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినందుకే ఈ ఘనతను సాధించిందని ఆయన తెలిపారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేసీఆర్ చేసి చూపించారని అన్నారు. రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 15 వేల బెడ్స్ ఉండేవని… వాటి సంఖ్యను 50 వేలకు పెంచామని హరీశ్ వెల్లడించారు.

గత ఐదేళ్లలో లక్ష 50 వేల ఉద్యోగాలను ఇచ్చామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో 9 మెడికల్ కాలేజీల ను ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోవాలని హరీశ్ అన్నారు.

నల్గొండ జిల్లా బీఆర్ఎస్ కు కంచుకోట అని. అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పారు...