/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి-- మంత్రి ఎర్రబెల్లి Yadagiri Goud
వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి-- మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించిన తరుణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నమోదవుతున్న వర్షపాతం, వరదలు, లోతట్టు ప్రాంతాల జలమయం, వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అత్యవసర పరిస్థితుల్లో, రెస్క్యూ టీమ్స్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు తదితర అంశాలపై ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో గల ఆరు జిల్లాల కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా జిల్లాల పరిస్థితిని, తీసుకున్న ముందు జాగ్రత్తచర్యలను కలెక్టర్లు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గల జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ఉందని ప్రజలకి ఏ సమస్య ఉన్నా అధికారులకు తెలియ చేయాలని, ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా వెంటనే అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే జిల్లా కలెక్టరేట్లలో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల్లో, శిథి లావస్థలో ఉన్న ఇళ్లలో వున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి చేర్చాలని, అలాగే పునరావాస కేంద్రాల్లో వారికి భోజన సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఇదే సందర్భంలో తాను కూడా సహాయక చర్యలలో పాల్గొంటున్నానని, ప్రజా ప్రతినిధులు, యువత కూడా అధికారులకు సహకరించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు...

ప్రిలిమ్స్ ఫలితాలు సోమవారం వరకు ప్రకటించొద్దు: హైకోర్టు

ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను వచ్చే సోమవారం వరకు ప్రకటించవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీ అధికారులకు సూచించింది.

కాగా, వాదనలు వినిపించేందుకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని టీఎస్పీఎస్సీ తరపు న్యాయవాది కోరారు.

దీనికి సమ్మతించిన హైకోర్టు సోమవారం వరకు ఫలితాలు విడుదల చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది....

చినుకు పడితే చిత్తడే.. నరకాన్ని తలపిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్

చినుకు పడితే చిత్తడే అన్న తీరుగా భాగ్యనగర రోడ్లు తయారయ్యాయి. కొద్దిసేపటి వర్షానికే నగర రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నగరంలో ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తోందని వాహనదారులు వాపోతున్నారు.

ఈరోజు మంగళవారం ఉదయం నగరంలో భారీగా వర్షం కురిసింది. దీంతో ఉదయమే ఆఫీసు, స్కూళ్లకు వెళ్లే వాహనాలతో ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది. 10 నిమిషాల ప్రయాణానికే వాహనదారులు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. షేక్ పేట్ - రాయదుర్గం మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉప్పల్ నుంచి తార్నాక వెళ్లే మార్గంలోనూ పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అటు సికింద్రాబాద్ నుంచి బేగంపేట్ రోడ్‌లో హెవీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

అలాగే దిల్‌సుఖ్‌నగర్ నుంచి మలక్‌పేట్, చాదర్ఘాట్ వైపు ట్రాఫిక్ నిలిచిపోగా.. ఇటు కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెర్‌ ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైటెక్ సిటీలోనూ వాహనాలు ఎక్కడివి అక్కడే రోడ్లపై ఉండిపోయాయి. ఎంతసేపటికి ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.

మరోవైపు రాష్ట్రంలో మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు...

MMTS Trains: హైదరాబాద్‌లో పెను ప్రమాదం తప్పింది. మలక్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి

MMTS Trains: హైదరాబాద్‌లో పెను ప్రమాదం తప్పింది. మలక్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి. అయితే రెండు రైళ్లలోని లోక్ పైలట్లు ముందే గమనించి ట్రైన్లను నిలిపివేశారు.

దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి రావడంతో ప్రయాణికులు కాసేపు టెన్షన్ పడ్డారు. లోక్ పైలట్లు అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించడం, ట్రైన్లను నిలిపివేయడంతో ప్రయాణికులందరూ ఊపిరిపీల్చుకున్నారు.

అదే రెండు రైళ్లు ఢీకొని ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని అంటున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఒక రైలును మరో ట్రాక్‌పైకి మళ్లించారు. దీంతో రెండు రైళ్లు వేరే వేరే ట్రాక్‌ల పైనుంచి పెళ్లాయి. ఈ ఘటనతో రెండు ఎంఎంటీఎస్ ట్రైన్లు అరగంటపాటు ఆగిపోయాయి.

అయితే ఈ ఘటనపై సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు విచారణ చేపడుతున్నారు. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి ఎలా వచ్చాయనేది ఆరా తీస్తున్నారు. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంగానే ఇలా జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో లోపం ఎక్కడ జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు.

కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నిక కేసులో హైకోర్ట్ సంచలన తీర్పు

కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు ను ప్రకటించిన కోర్టు....

వనమా వెంకటేశ్వర్ రావు గెలుపును సవాల్ చేస్తూ 2019 లో హైకోర్టును ఆశ్రయించిన జలగం....

ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు నివేదిక సమర్పించారని పిర్యాదు లో పేర్కొన్న జలగం వెంకట్రావ్....

సమగ్ర విచారణ అనంతరం వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదని తీర్పు నిచ్ఛిన హైకోర్ట్....

సమీప అభ్యర్ధిగా జలగం వెంకటరావును విజేత గా ప్రకటించిన కోర్టు...

తప్పుడు అఫిడవిట్ సమర్పించిందుకు గాను వనమాకు రూ 5 లక్షల జరిమానా,2018 నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యే గా అర్హుడు కాదని తీర్పు నిచ్చిన హైకోర్ట్...

పార్లమెంట్‌లో మణిపుర్‌ కల్లోలం: నిమిషాలకే వాయిదా పడిన లోక్‌సభ

దిల్లీ: ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌(Monsoon Session of Parliament) కార్యకలాపాలకు మణిపుర్ అల్లర్ల అంశం తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. దానిపై ప్రధాని ప్రకటన చేయాలని ఎంపీలు పట్టుపట్టడంతో ఉభయ సభల్లో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది..

ఈ పరిస్థితుల మధ్య మంగళవారం లోక్‌సభ(Lok Sabha) ప్రారంభమైన వెంటనే వాయిదా పడింది. 11 గంటలకు ప్రారంభమైన సభను స్పీకర్ ఓం బిర్లా నిమిషాల వ్యవధిలోనే వాయిదా వేశారు.

మళ్లీ మధ్యాహ్నం రెండు గంటలకు దిగువసభ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మణిపుర్ అంశం, ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్‌పై సస్పెన్షన్ వేటుతో రాజ్యసభ కార్యకలాపాలు సజావుగా సాగలేదు.

దాంతో ఛైర్మన్ జగదీప్‌ ధనఖడ్ ఎగువ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదావేశారు. ఇదిలా ఉంటే..

ప్రధాని ప్రకటన చేయాలంటూ పట్టుపడుతున్న విపక్ష ఎంపీలు దానిపై వెనక్కి తగ్గుతాయని ప్రభుత్వం భావించడం లేదు. దాంతో ప్రభుత్వం ఇక బిల్లుల్ని ప్రవేశపెట్టడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం..

జులై 29న "షా " హైదరాబాద్ పర్యటన?

తెలంగాణ నేతలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా పిలిపించుకొని మాట్లాడుతున్నారు.

కార్యక్రమంలో,సోమవారం రాత్రి గం. 9.00 సమయంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అమిత్ షా నివాసానికి వెళ్లి కలిశారు.

అంతకంటే ముందు మధ్యాహ్నం పార్లమెంటులోని హోంమంత్రి ఛాంబర్లో బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కలిశారు.

వరుసగా ఇద్దరు ముఖ్యనేతలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 29న అమిత్ షా హైదరాబాద్ పర్యటించనున్నారు.

ఈలోగా తెలంగాణ ముఖ్య నేతలను పిలిపించి ఏ అంశాలు చర్చించారన్నది ఆసక్తికరంగా మారింది...

మీరు ఎవ్వరు? మీరేమైనా మినిస్టరా❓️

తెలంగాణలో బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజానీకం ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతోంది. ఇక పిల్లలను స్కూళ్లకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. వర్షానికి చిన్నారులను ఎలా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఈ క్రమంలోనే ఓ చిన్నారి తల్లి ట్విటర్ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని స్కూళ్లకు సెలవులను ప్రకటించాలని కోరింది. మంత్రి స్పందించలేదు కానీ ఆమె కుమారుడు స్పందించాడు. తానే మంత్రిని అన్న రేంజ్‌లో వెటకారంగా రిప్లై ఇచ్చాడు. అంతే.. మంత్రి కుమారుడి రిప్లై చూసిన ఆ తల్లితో పాటు నెటిజన్లకు పట్టరాని కోపం వచ్చింది. అసలు రిప్లై ఇవ్వడానికి మీరెవరు? మీరేమైనా మినిస్టరా? అని నిలదీశారు.

వర్షం వస్తోంది కాబట్టి.. విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాక సెలవు ప్రకటిస్తే ప్రయోజనం ఉండదని, ముందుగా స్పందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఓ విద్యార్థి తల్లి ట్విటర్ వేదికగా కోరారు. దీనికి మంత్రి కుమారుడు కార్తీక్ రెడ్డి రిప్లై ఇస్తూ.. ‘మీ వెటకారం అర్థమయ్యింది. ప్రభుత్వం ఏమీ ట్విటర్‌లో నడవదని గ్రహించండి. ఇటీవల మంత్రి సెలవులపై 8.15కి ట్వీట్ చేశారు. కానీ ఆ శాఖ ముందుగానే నిర్ణయం తీసుకుంది. ట్విటర్లో ట్రోలింగ్ చేయడం సులభం. కామన్ సెన్స్ ఉపయోగించండి’ అని పేర్కొన్నారు.

కార్తీక్ రెడ్డి రిప్లై చూసిన సదరు విద్యార్థి తల్లి.. ‘మీరు చూపించిన శ్రద్ధకు అభినందనలు కార్తీక్.. కానీ అది విద్యాశాఖమంత్రికి నేను చేసిన విన్నపం. మీరు సమాధానం ఇచ్చారంటే ఒకవేళ కొంపదీసి మీరు విద్యాశాఖామంత్రా?’ అన్నట్టుగా కామెంట్ పెట్టారు.

అంతేకాదు.. కార్తీక్ రెడ్డి తానేదో మంత్రిలా ఫీలైపోతున్నారని.. తాను పిల్లలపై ఉన్న కన్సర్న్‌తో మంత్రిని అడిగిన చిన్న ప్రశ్నకు వెటకారంగా సమాధానమిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మొత్తానికి కార్తీక్ రెడ్డికి దిమ్మతిరిగే రిప్లై వచ్చింది. అంతే దెబ్బకు దిగి వచ్చారు. కేవలం తాను ట్రోల్స్‌కి మాత్రమే సమాధానం ఇచ్చానని.. పిల్లలపై కస్నర్న్ చూపే తల్లిదండ్రులకు కాదన్నారు. మీరు ట్రోలరా? లేదంటే కన్సర్స్ ఉన్న తల్లా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలని సమాధానం ఇచ్చారు. నెటిజన్లు సైతం కార్తీక్ రెడ్డి ట్వీట్‌పై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు...

అదనపు కలెక్టర్ల బదిలీ

హైదరాబాద్:జులై 25

రాష్ట్రంలో పనిచేస్తున్న తొమ్మిది మంది అదనపు కలెక్టర్లను బదిలీ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో

ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ గా రాజేశం, మంచిర్యాల అదనపు కలెక్టర్ గా మోతిలాల్, నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్గా సీతారామారావు, నిర్మల్ అదనపు కలెక్టర్గా కిషోర్ కుమార్,

ఖమ్మం అదనపు కలెక్టర్గా నటరాజ్, ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ గా వేణు, యు ఎల్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హైదరాబాద్ గా వేణు మాధవరావు, సంగారెడ్డి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిగా దేవుజా,

టీఎస్ పిఎస్ సి అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా ప్రేమ్ రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు...

టమాటా రైతు కు అభినందన

హైదరాబాద్:జులై 25

టమాట పండించి కోటీశ్వరుడైన కౌడిపల్లి రైతు మహిపాల్ రెడ్డి దంపతులని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డితో సోమవారం సాయంత్రం సెక్రటేరియట్‌లో ముఖ్య మంత్రిని మహిపాల్ రెడ్డి దంపతులు కలిశారు.

ఇప్పటికే రెండు కోట్ల రూపాయల విలువైన టమాట పంటను అమ్ముకోగా ,మరో కోటి రూపాయల విలువైన పంట కోతకు సిద్ధంగా ఉందని సీఎంకు వివరించారు. వాణిజ్య పంటల సాగు విషయంలో తెలంగాణ రైతులు వినూత్నంగా ఆలోచిస్తే పంటల సాగు లాభదాయకంగా ఉంటుందని మహిపాల్ రెడ్డికి కేసీఆర్ సూచించారు.

మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌కు చెందిన మహిపాల్‌రెడ్డి అనే రైతు టమాట పండించి కోటీశ్వరుడయ్యారు. తనకున్న పొలంతోపాటు ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని మహిపాల్‌రెడ్డి కూరగాయలు సాగు చేస్తుంటారు.

ఈసారి ఎనిమిది ఎకరాల్లో టమాట పంట వేశారు. అయితే, పంట చేతికొచ్చే సమయానికి టమాటాకు మునుపెన్నడూ లేని ధర పలుకుతుండటంతో మహిపాల్‌ రెడ్డిని లక్ష్మీదేవి కరుణించింది. ఇప్పటిదాకా ఎనిమిది వేల బాక్సుల ఒక్కో బాక్సు 25 కిలోలు టమాటాలు విక్రయించగా మహిపాల్‌రెడ్డికి రూ.కోటీ 84 లక్షలు వచ్చాయి.

ఇంకా రూ.కోటి విలువ చేసే టమాట ఆయన వద్ద ఉంది. అయితే, వచ్చిన ఆదాయంలో రూ.50లక్షల వరకు పెట్టుబడి ఖర్చులకు వెళ్తుందని మహిపాల్‌ రెడ్డి తెలిపారు. ఈ నెల 5న హైదరాబాద్‌లోని బోయినపల్లి మార్కెట్‌కు మహిపాల్‌రెడ్డి 550 టమాట బాక్సులు తీసుకెళ్లగా ఒక్కో బాక్సు రూ.2,300 నుంచి రూ.2,500 చొప్పున పలికింది. దీంతో ఒక్కరోజే మహిపాల్‌రెడ్డికి రూ.13.75లక్షలు వచ్చాయి...