/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz మరో మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు.. Yadagiri Goud
మరో మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు..

హైదరాబాద్:జులై 25

తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతా వరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు రెడ్‌అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో రానున్న 3 రోజులపాటు అంటే జూలై 25-27 వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురు స్తాయని తెలిపింది. ఈ మూడు రోజుల పాటు వాతావరణ శాఖ మోడల్ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని భారత వాతావరణ తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదురోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. అయితే.. తెలంగాణ వ్యాప్తంగా ఈ నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో పాటు 40-50 కిలోమీటర్ల ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధి కారులు తెలిపారు. ముఖ్యంగా..తెలంగాణలో మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఈరోజు మంగళవారం నాడు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అలాగే.. మిగిలిన జిల్లాల్లోనూ మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నాలుగు రోజులు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అయితే హైదరాబాద్‌లో ఇప్పటికే వర్షం మొదలవ్వడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను డైవర్ట్ కూడా చేయడం జరిగింది. భారీగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో నగరవాసులు భీతిల్లిపోతున్నారు. మరో మూడు గంటలపాటు ఇలాగే వర్షం కురుస్తుందని.. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దంటూ జీహెచ్ఎంసీ అలెర్ట్ చేసింది.

ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కొత్తగూడెం, వరంగల్‌, హన్మకొండ, జనగాం, కామారెడ్డి, కరీంనగర్‌, పెద్దపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, భువనగిరి, రంగాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించింది....

AP Rainfall Updates: ఏపీలో ఐదురోజులపాటు భారీ వర్షాలు..రేపు.. ఎల్లుండి ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు..

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ నెల 26వ తేదీన వాయిగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి..

ఈ నేపథ్యంలో అప్రమత్తం చేస్తోంది వాతావరణ శాఖ.

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మరో ఐదురోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సైతం ధృవీకరించింది.

భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం పశ్చిమ మధ్య & ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర -దక్షిణ ఒడిశా మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏర్పడందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ వెల్లడించారు..

బుధవారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడనున్నట్లు తెలిపారు. ఆతర్వాత ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయని వెల్లడించారాయన. బుధవారం అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, గురువారం భారీవర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడనున్నట్లు వివరించారు.

బుధవారం.. కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు,పల్నాడు,బాపట్ల,ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

తిరుపతి :జులై 25

తిరుమలలో భక్తుల రద్దీ

నేడు మంగళవారం సాధారణగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు15 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

నిన్న సోమవారం శ్రీవారిని 73,796 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 28,840 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు....

పిల్లలూ! స్కూల్ టైమింగ్ మారింది

తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని స్కూళ్ల టైమింగ్‌లో మార్పులు చేస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇకపై.. ప్రాథమిక పాఠశాలలు అనగా 1వ తరగతి నుంచి 5 వరకు (1st Class To 5th Class) ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:15 గంట వరకూ స్కూళ్లు ఉంటాయి. అప్పర్ ప్రైమరీ (ప్రాథమికోన్నత పాఠశాలలు) అనగా 6వ తరగతి నుంచి 10 వరకు (6 to 10th Class) స్కూళ్లు 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 వరకు పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే విధంగా అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోని ప్రైమరీ స్కూళ్లు కూడా ఇదే సమయాన్ని పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.

తక్షణమే అమలు..!

కాగా.. జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఈ టైమింగ్స్ పాటించాలని కేసీఆర్ సర్కార్ ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణలోని అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్‌జేడీఎస్‌ఈలకు విద్యాశాఖ సోమవారం రాత్రే పంపించింది.

మరోవైపు.. డీఈవోలు, ఆర్‌జేడీఎస్ఈల పరిధిలోని ఎంఈవోలు, హెడ్‌మాస్టర్లు, పాఠశాలల యాజమాన్యాలకు సమయాల్లో మార్పులకు సంబంధించిన సూచనలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలల సమయాల్లో చేసిన మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే.. మంగళవారం నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయన్న మాట.

ఇదివరకు ఇలా..!

అయితే ఇప్పటి వరకూ తెలంగాణలోని స్కూళ్లు 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నడిచేవి. తాజాగా మారిన టైమింగ్స్ ప్రకారం ప్రైమరి స్కూళ్లకు ఉదయం అరగంట ఆలస్యంగా స్కూళ్లు మొదలై సాయంత్రం పావు గంట ఆలస్యంగానే ముగియనున్నాయి. ఇక అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోనూ ఉదయం అరగంట ఆలస్యంగా ప్రారంభమై.. సాయంత్రం 45 నిమిషాలు ఆలస్యంగా పాఠశాలలు ముగియనున్నాయి. కాగా.. రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు, చేర్పులు చేయాలని గత కొంతకాలంగా పాఠశాల విద్యాశాఖ ఆలోచనలు చేస్తున్న విషయం తెలిసిందే....

Polavaram: పోలవరం తొలిదశ మిగిలిన పనులకు అదనంగా రూ.12,911 కోట్లు!

దిల్లీ: పోలవరం నిర్మాణంపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్రమంత్రి బిశ్వేశ్వర్‌ టుడు ఈ మేరకు లిఖితపూర్వక జవాబిచ్చారు..

''పోలవరం తొలి దశలో 41.15 మీటర్ల నిర్మాణం పూర్తికి ఏపీ ప్రభుత్వం నిధులు కోరింది. ఇందుకోసం రూ.17,144 కోట్లు ఖర్చువుతుందని చెప్పింది. 2024 జూన్‌ నాటికి ప్రాజెక్టు నిర్మించాలని తొలుత నిర్ణయించాం.

2020, 2022లో వరదల వల్ల నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి'' అని కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే, ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందనేది మాత్రం పేర్కొనకపోవడం గమనార్హం..

మరోవైపు, పోలవరం తొలిదశ నిర్మాణానికి మిగిలిన పనుల కోసం అదనంగా రూ.12,911 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. వైకాపా పార్లమెంటరీ నేత అడిగిన ప్రశ్నకు.. రాజ్యసభలో కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

నిధుల విడుదలకు అభ్యంతరం లేదని ఆర్థికశాఖ తెలిపినట్లు వివరించింది. ఈ మేరకు పోలవరం నిధులపై గత నిర్ణయాన్ని సవరిస్తూ మంత్రివర్గం తాజా ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. అయితే, ఈ తాజా ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉందన్నారు..

TS High Court: భాజపా తలపెట్టిన ధర్నాకు తెలంగాణ హైకోర్టు అనుమతి..

హైదరాబాద్‌: నగరంలోని ఇందిరా పార్క్‌ వద్ద మంగళవారం తెలంగాణ భాజపా తలపెట్టిన ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

తెలంగాణలో అర్హులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపు, నిర్మాణంలో జాప్యంపై రేపు తెలంగాణ భాజపా నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు..

అయితే, ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో భాజపా నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేశారు.

పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ధర్నాకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది..

తెలంగాణలో మహిళలపై జరుగుతున్న దారుణాలు మీకు కనిపించడం లేదా?

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఇటీవల వివిధ అంశాలపై సోషల్ మీడియాలో ఆమె తరచు చేస్తున్న పోస్టులు ఇంటర్నెట్‌లో చర్చగా మారుతున్నాయి.

ఈ క్రమంలో ఇటీవల మణిపూర్ ఘటనపై రియాక్ట్ అయిన స్మితా సబ ర్వాల్‌కు తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు.

నల్గొండ జిల్లాలో దళిత మహిళపై ఓ సర్పంచ్ రక్తం వచ్చేలా దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన అంశంలో స్మితా సబర్వాల్ స్పందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే ఘటనలపై సత్వరమే స్పందిస్తూ ట్వీట్లు పెడతారు.

ఇప్పుడు మీరు బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ దుర్ఘటనపై కూడా స్పందించాలని కోరుకుంటున్నాం అని ట్వీట్ చేశారు.

రఘునందన్ రావుతో పాటు పలువురు నెటిజన్లు సైతం ఈ అంశాంపై స్మితా సబర్వాల్ రియాక్షన్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆమె వ్యవహార తీరు ఫక్తు రాజకీయ నాయకురాలిగా ఉందని ఇప్పటికే పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్న వేళ నల్గొండ ఘటనపై స్మితా ఎందుకు స్పందించడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే ఘటనలపై రియాక్ట్ కావడానికి క్షణం ఆలస్యం చేయని ఈ ఆఫీసర్.. తెలంగాణలో జరుగుతున్న దురాగతాలపై మాత్రం నోరు మెదపడంలేదని సెటైర్లు వేస్తున్నారు. గతంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఘటనలపై ఆమె చేసిన పోస్టులను ప్రస్తావిస్తూ.. అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు ఇంత సెలెక్టివ్ గా ఆలోచించడం ఏంటి.. పెయిడ్ ప్రమోషన్స్ మాదిరిగా సెలెక్టివ్ అంశాల మీదనే రియాక్ట్ అవుతారా?

తెలంగాణలో మహిళలపై జరుగుతున్న దారుణాలు మీకు కనబడటం లేదా? లేక సమయం లేక స్పందించడం లేదా?అంటూ నిల దీస్తున్నారు.

మరి తాజా విమర్శలపై స్మితా సబర్వాల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

వరద నీటిలో చిక్కుకున్న ఒరిస్సా బస్సు

రంపచోడవరం:జులై 24

ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒక ప్రైవెట్ ట్రావెల్స్ గుప్తా బస్సు వరద నీటిలో చిక్కుకుంది. సోమవారం ఉదయం ఒరిస్సా రాష్ట్రం నుండి ఆంధ్రాకు వచ్చే క్రమంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా,

రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం కల్లేరు గ్రామ పంచాయతీ పరిధిలోని కుయుగూరు, నిమ్మలగూడెం గ్రామాల జాతీయ రహదారిపై అప్పటికే కుయుగూరు వాగు వరద నీరు రహదారిపై చేరి ఉంది.

తెల్లవారు జామున 4.30 గంటలు కావడంతో వరద నీరు సరిగా కనిపించక పోవడంతో బస్సు వెళ్లి పోతుందిలే అనే ఉద్దేశ్యంతో డ్రైవర్ వరద నీటిలో నుండి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు.

ఈ తరుణంలో రహదారి పక్కకు వెళ్లి బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ఇది గమనించిన డ్రైవర్ బస్సును ఆపి బస్సులో ఉన్న సుమారు 45 మంది ప్రయాణికులను దించేసాడు. ప్రయాణికులు అక్కడి నుండి మోకాళ్ళ లోతు వరద నీటిలో నడుచుకుంటూ వెళ్లిపోయారు.

ప్రయాణికులు దిగి నడిచి వెల్లిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చింతూరు రెవిన్యూ, పోలీసులు, పంచాయతీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని jcb సహాయంతో వరద నీటిలో చిక్కుకున్న బస్సును బయటకు తీశారు...

అక్టోబర్‌లో గ్రూప్‌-3 పరీక్ష?

గ్రూప్‌-3 పరీక్ష అక్టోబర్‌ నెలలో నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయమై కమిషన్‌ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే రెండు, మూడుసార్లు చర్చించి, ఎన్నికలకు ముందే పరీక్ష నిర్వహించాలనే అభి ప్రాయానికి కమిషన్‌ వచ్చినట్టు సమాచారం.

మరో వారం, పది రోజుల్లో గ్రూప్‌-3 పరీక్ష తేదీలను కమిషన్‌ ప్రకటించనున్నట్టు తెలిసింది.

అక్టోబర్‌ నెలలో స్టాఫ్‌ సెల క్షన్‌ కమిషన్‌, ఐబీ పీఎస్‌తోపాటు మిగతా పరీక్షలు ఉన్నాయి.

ఈ నేప థ్యంలో వాటిని పరి గణ నలోకి తీసుకొని గ్రూప్‌-3 పరీక్ష తేదీలను పరి శీలి స్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ ఉన్న తాధికారి ఒకరు తెలిపారు.

అక్టోబర్‌ రెండు లేదా మూడో వారంలో పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ భావిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నికలలోపే పరీక్షలన్నీ పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్ల డించారు. ఇదిలా ఉండగా

రాష్ట్రంలో 105 విభాగాల్లో గ్రూప్‌-3 క్యాటగిరీలో 1,363 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో ఉద్యోగానికి సగటున 394 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు....

కేటీఆర్ కు పలువురు విన్నుత రీతిలో శుభాకాంక్షలు

హైదరాబాద్ :జులై 24

సామాజిక మాధ్యమాల్లో మంత్రి కేటీఆర్‌ చురుగ్గా ఉంటారు. ఇతర రాజకీయనేతలందరి కంటే భిన్నంగా, పూర్తిగా పాజిటివ్‌ ధృక్పథంలోనే సోషల్‌ మీడియాను వినియోగిస్తూ తన ప్రత్యేకతను చాటు కుంటున్నారు. ప్రభుత్వం సాధించిన విజయాలు, తన పర్యటనల విశేషాలు పంచు కొంటారు.

ప్రజా సమస్యలను తెలు సుకొనేందుకు, ప్రజలతో తన భావాలను పంచుకొనే వేదికగానే ట్విట్టర్‌ను వినియోగిస్తుంటారు. ‘ఆస్క్‌ కేటీఆర్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రజలను నుంచి సమ స్యలను తానే స్వయంగా తెలుసుకుంటుండడం విశేషం. ఉర్దూ, ఇంగ్లిష్‌, హిందీ, తెలుగులో అనర్గళంగా మాట్లా డడమేగాక స్వయంగా ఆయనే ట్వీట్‌ చేస్తుంటారు.

ఆయా భాషల్లో కవితలను కోట్‌ చేస్తూ దేశంలో జరిగే పరిణామాలపై సమ యస్ఫూర్తిగా స్పందిస్తుంటారు. పాజిటివ్‌ దృక్కోణంలోనే విమర్శలను కూడా గుప్పించడం కేటీఆర్‌ ప్రత్యేకత. మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో 40.52 లక్షలు, ఫేస్‌బుక్‌లో 11.11 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 13.77 లక్షలు, లింక్‌డిన్‌లో 2.55 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆయన క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.

వెల్లువెత్తిన అభిమానం

ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు జన్మదినోత్సవం సందర్భంగా పలువురు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ప్రజానేత, మంత్రి కేటీఆర్‌ దేశానికి నాయకత్వం వహించే దిశగా ఎదగాలని పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ ఆకాంక్షించారు.

కేటీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా కోలేటి శుభాకాంక్షలు తెలిపారు. గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా పేదరికంతో చదువుకు ఇబ్బందులు పడుతున్న ఇద్దరు విద్యార్థినులకు టీఎస్‌ ఫుడ్స్‌ చైర్మన్‌ మేడే రాజీవ్‌సాగర్‌ ఆర్థిక సాయం అందజేశారు. ఎంజీ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ చదువుతున్న కొమ్ము కిష్టయ్య కుమార్తె సుమతికి, మీర్‌పేట్‌ టీకేఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతున్న మల్లెపాక రాములు కుమార్తె శ్వేత కాలేజీ ఫీజుల కోసం కాలేజీ చదువు పూర్తయ్యే వరకూ రూ.లక్ష చొప్పున అంద జేస్తానని ప్రకటించారు. నవతరం నాయకుడు, యువతరం ఆదర్శనీయుడు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అని టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్‌ అమీర్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, పౌర సరఫరాల సంస్థ మాజీ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ దేశానికి అభివృద్ధి నమూనా కావాలన్న కలను సాకారం చేస్తున్న కేటీఆర్‌ వందేండ్లు జీవించాలని అధికార భాషా సంఘం అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ ఆకాంక్షించారు. మంత్రి కేటీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా జూలూరు శుభాకాంక్షలు తెలిపారు.మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని ఎంపీ సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా ఆదివారం ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో రెండు వేల మొక్కలు నాటారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం నాగారం గ్రామస్థులు పొలంలో వరితో హ్యాపీ బర్త్‌డే కేటీఆర్‌ అని ఏర్పాటుచేసి, అక్కడే కేక్‌ కట్‌ చేశారు.

ఆపద్బాంధవుడు కేటీఆర్‌

అభాగ్యులకు అండగా నిలువడంలో మంత్రి కేటీఆర్‌ ముందు వరుసలో ఉంటారు. అటెండర్‌ నుంచి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఎదిగిన సిరిసిల్ల జిల్లా చీకోడుకు చెందిన పిట్ల నర్సింహులు, ఇంటి కలను సాకారం చేసుకొన్న తంగళ్లపల్లి మండలం రామ చంద్రాపూర్‌కు చెందిన మేడిపల్లి నీలవ్వ, ఐదో అంతర్జాతీయ నేపాల్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన యువ కరాటే ప్లేయర్‌ జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన బొలుగుల చందు, కృత్రిమ కాలును అమర్చుకొన్న బీహార్‌ రాష్ట్రం సీవాన్‌కు చెందిన దివ్యాంగురాలు ప్రియాంశు కుమారి జీవితాలే కేటీఆర్‌ మానవీయతకు నిదర్శనాలు.....